HOME


మూడు  లేఖలు – Season II 

1 వ అధ్యాయము

రెండోసారి మొదటి పరిచయం

మనుషులని కలిపేది మనస్సులు అయితే…
ఆ మనస్సులని విడదీసేది పరిస్థితులు…
మరి మనస్సు తీసుకునే నిర్ణయాల వలన వచ్చే పరిస్థితులు మధ్య…
పరిస్థితుల వలన నిర్ణయాలు తీసుకునే మనస్సు మధ్య ముందుకు వెలబోతున్న కథ ఇది.

రాధా: ఉదయం 3:00AM అవుతోంది ఇంకా ఎప్పుడు పడుకుంటావు?

రామ కృష్ణ: ఎవరు…?

రాధా: నేను రాధని.. కృష్ణుడా, లోపలికి రావచ్చా?

రామ కృష్ణ: స్వంత నిర్ణయాల మీద నిలబడేవారికి, అనుమతి అడిగే హక్కు ఉండదు అనుకుంటా?

రాధా: నిర్ణయాలు, హక్కులు సాగే సెలయేరు లాంటివి, చూడడానికి ఒకే చోట ఉన్నట్లు ఉంటాయి కాని మారుతుంది, పరిస్థితులు మాదిరిగా. సరే కాని, ఏమిటి మరి అంతా అలా పని చేస్తూనే ఉన్నావ్, కొంచెం కూడా ఫ్రీ టైం ఉంచుకోకుండా…?

రామ కృష్ణ: ఖాళీ సమయం, మనస్సున మనశoతి లేని మనిషికి మంచిది కాదు, అందుకే కాసుల కోసం ఖాళీ సమయాన్ని ఖర్చు చేస్తునా. 

రాధా: చేస్తావ్… చేస్తావ్… ఎందుకు చేయవ్, హెల్త్ కొంచెం అయినా పట్టించుకుంటున్నావా?

రామ కృష్ణ: నువ్వు ఉన్నావ్ గ నన్ను పట్టించుకోవడానికి, నన్ను వదలి నువ్వు ఎక్కడికి వెలతావు చెప్పు?

రాధా: నేను ఎక్కడికి వెల్తాను, నేను ఎప్పుడూ నీలోనే ఉంటాను, ఇలా రా వచ్చి నా పక్కన కూర్చో.

అని రాధ నన్ను హత్తుకుంది, నేను ఆమె కౌగిలిలో ఊపిరి తీసుకుంటున్నాను, ఆమె కౌగిలిలో ఊపిరి తీసుకోవడం, అమ్మ ఊపిరి పోయడం రెండు ఒకటే అనిపిస్తుంది నాకు, ఆమె ఉంగరాల జుట్టు నా ఊపిరికి పూల తోట మాధిరిగా, సుగంధం శ్వాసగా మారింది, ఆమె చేతి వేళ్ళతో నా జుట్టును నిమురుతోంది. రూమ్‌లో నిశ్శబ్దం నా నేత్రాలకు నిద్రపంపింది రాధ సమక్షంలో. కాసేపటికి రాధ నాతో “ఉండు కృష్ణుడా, నన్న పిలుస్తున్నారు” అని అంటోంది, వద్దు రాధ వెళ్ళదు అనిపిస్తున్నా వినకుండానే వె ళ్ళిపోతుంది నన్ను వదిలి, నేను రాధ… రాధ… అని అరుస్తున్నాను.

 రామ కృష్ణ… ఏమైంది రా, ఇదిగో Water తాగు, అని నన్ను నిద్ర లేపి Water ఇచ్చింది సింధు. water తాగి లేచి, ఫేస్‌వాష్ చేసుకుంటూ, నువ్వు ఎప్పుడు వచ్చావ్ ఇంటికి అని అడిగాను సింధుని, ఏమి పట్టించుకోనట్టుగా.

సింధు: ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇలా కల్వరిస్తూ నాలుగు గోడల మధ్య కలలు కంటూ ఓడిపోతూ, నాలుగు గోడల బయట గెలుస్తూ బతుకుతావ్, పైగా ఒక్కడివే విడిగా ఉంటున్నావ్ పేరెంట్స్‌ని వదిలి. 

రామ కృష్ణ: ఎక్కడో ఒక చోటా గెలుస్తూనే ఉన్నాను కదా, అంత కాలం… ఇంత కాలం.. ఒంటరిగా ఉండాలి అని ఏం టైం పెట్టుకోలేదు, పెట్టుకుంటే ఫస్ట్ నికు ఫోన్ చేసి చెప్తాను, అమ్మ, నాన్నని వదిలేసాను అని నీకు ఎవరు చెప్పారు, తమ్ముడికి పెళ్లి అయింది, వాడు వాడి వైఫ్, ఇద్దరూ అమ్మ నాన్నకి తోడుగా ఉన్నారు. 

సింధు: సమాధానం సిద్ధంగా ఉంచుకుంటావా, లేదా సమాధానం ఉన్న దానికి నా ప్రశ్న పుడుతుందో నాకు అర్థం కాదు నీతో మాట్లాడినప్పుడు. 

రామ కృష్ణ: సమాధానం తెలిసినప్పుడు, ప్రశ్న వేయకూడదు, ఎందుకంటే జవాబుకి విలువ లేకపోయినా, ప్రశ్నకి విలువ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 

సింధు: మాటలు మాట్లాడినంత ఈజీ కాదు ఒంటరిగా ఉండటం, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్, అసలు?

 రామ కృష్ణ: మా నాన్న కూడా ఎప్పుడూ నన్ను అడగలేదు, నువ్వు ఎవరు అడగడానికి?

సింధు: ఎందుకు అరుస్తావ్, కింద అమ్మ నాన్న వచ్చారు.

రామ కృష్ణ: మీ అమ్మ నాన్న నా?

సింధు: కాదు మీ అమ్మ నాన్న!

నేను వెంటనే స్టెప్స్ దిగి హాల్‌లోకి వెళ్లాను, డాడీ ఇంకా అమ్మ సోఫాలో కూర్చున్నారు, డాడీ నా భుజం మీద చేయి వేసి ఎలా ఉన్నావ్ రా అని అడిగారు. డాడీని చూసి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది, ఆయన్ని హత్తుకుని బాగున్నా డాడీ అని చెప్పాను, ఇంతలో అమ్మ పక్కనుంచి “నేను కూడా వచ్చానురా” అని అంటోంది వెటకారంగా, అప్పుడు నేను అమ్మతో, చీర బాగుంది అమ్మ అని అన్నాను, అమ్మ నాతో “టాపిక్ డైవర్ట్ చేయకురా, ఎలా ఉన్నావ్… మేము ఉన్నాం అని గుర్తు ఉందా అసలు, ఒకే ఊరిలో ఉన్నా కూడా వేరే వేరే ఇంట్లో ఉన్నాం, ఇది ఏంటి అంటే, మీ నాన్న మాట్లాడరు, నువ్వు మాట్లాడనివ్వ” అంటోంది, అప్పుడు నేను అమ్మతో సరే సరే కాని, ఏమిటి సడన్ విజిట్ అని అడిగితే, “సింధుకి పెళ్లి కుదిరింది, నిన్ను కలుస్తా అంటే తీసుకొచ్చాను” అని చెప్పింది అమ్మ నాతో. నేను సింధుకి కాంగ్రాట్స్ చెప్పి, అబ్బాయి ఏమి చేస్తాడు, పేరు ఏమిటి అని అడిగాను, “తన పేరు కిషోర్, పారిస్‌లో Logistic Company నడుపుతున్నాడు” అని చెప్పుకుంటూ వచ్చింది”. Next week నేను Paris వెళ్తున్నా New Project Work మీద అని చెప్పాను, అప్పుడే సింధు నాతో “అది తెలుసు మాకు ఆల్రెడీ, మీ తమ్ముడు చెప్పాడు, నేను కూడా నీత్తో Paris వస్తా రా, కిషోర్ కూడా రమ్మన్నాడు పారిస్‌లో పెళ్లి షాపింగ్ చేద్దాం అని”. సరే వెళదం, మన ఫ్రెండ్స్ రవి ఇంకా సుదీక్షని కూడా అడుగు వస్తారు ఏమో, పైగా మీ ముగ్గురు Doctors కదా Busy People అసలే అని నవ్వుతూ అన్నాను.

 ఒక వారం తరువాత Paris కి నలుగురం వెళ్తున్నాం, ప్లేన్ లో కూర్చునపుడు నా మదిలో ఒకటే అనిపించింది, ఇదే ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడానికి పాకెట్ మనీ పొగేసుకున్నా నేను, ఈరోజు నా ఓన్ ప్లేన్ లో నా ఫ్రెండ్స్ ని నేను ఇంకో దేశానికి తీసుకుని వెళ్తున్నాను అది కూడా పెళ్లి షాపింగ్ కి, నేను చాలా సార్లు సింగిల్ గా నా ప్లేన్ లో జర్నీ చేసాను కాని నాకు ఎప్పుడు నేను ఏదో సాధించాను అన్న ఫీలింగ్ రాలేదు, ఈ రోజు నా ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తుంటే అర్థమైంది, సక్సెస్ అవ్వడం అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.. మనసుకు నచ్చిన వారితో ఉండటం అని, వారికి నచ్చినట్లు మసులుకోవడం అని. PARIS రీచ్ అయ్యాము, నేను వారి ముగ్గురితో చెప్పాను నాకు 2 Days work ఉంది, తర్వాత షాపింగ్ కి వెళ్దాం, ఈ లోపు మీరు సిటీ చూడండి అని. రెండు రోజులు తరువాత నలుగురం సింధు fiance కిషోర్ ని కలుద్దాము అని కిషోర్ ఆఫీస్ కి వెళ్లాం, కిషోర్ తన లాజిస్టిక్ బుకింగ్ ఆఫీస్ అండ్ వేర్‌హౌస్ చూపిస్తుంటాడు, ఇంతలో బుకింగ్ ఆఫీస్ దగ్గర ఏదో గొడవ, ఎవరో ఒక అమ్మాయి Shipment గురించి స్టాఫ్‌ని తిడుతోంది, సింధు, రవి ఇంకా సుదీక్ష అలా చూస్తూ ఉన్నారు, ఎందుకు అలా చూస్తున్నారు అని, నేను వెళ్లి చూసాను.

సింధు: అరేయ్ రవి.. నేను చూస్తున్నది నిజమేనా?

రవి: ఓక నిమిషం ఆగవే నేనే షాక్ లో ఉన్నాను.

సుదీక్ష:
ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ట్రిప్ కి వస్తే మనకి ఈ షాక్ ఏంటి రా?

సింధు: రామకృష్ణని పిలవండి రా, వాడు కూడా చూస్తాడు.

రామకృష్ణ: మీతో పాటు నేనూ చూస్తున్నాను రా.

రవి: చూశావా బావా, అసలు కలా… నిజమా… గొడవ పడుతున్న అమ్మాయి అచ్చం మన రాధ లా ఉంది కదా…!

రామకృష్ణ: అవును రా రవి, ఆమె అచ్చం నా రాధా లా ఉంది, వెస్ట్ బెంగాల్ టైగర్ కి వెస్టర్న్ డ్రెస్స్ వేసినట్టు, ఎలా విరుచుకుని పడిపోతోందో స్టాఫ్ మీద, ఆమె చెమట చుక్క, భూమి మీద పడితే తట్టుకోలేనని చెప్పింది ఏమో చల్ల గాలికి, అందుకే ఆమె చుట్టూ చిరుగాలి చుట్టుకొని ఆమె జుట్టును చిన్నగా గాలికి విసురుతోంది.

మేము అందరం ఆమెని చూస్తూ ఉండిపోయాం, ఇంతలో కిషోర్ వెళ్లి, సమస్య పరిష్కారం చేశాడు, ఆమె అక్కడ నుండి వెళ్లిపోయింది. మేము నలుగురం వెళ్లి కిషోర్ ని అడిగాం, ఎవరు ఆ అమ్మాయి…? అంత ఇష్యూస్ చేసింది అని.

కిషోర్: ఆమె మా క్లయింట్ ఆఫీస్ లో లాజిస్టిక్స్ ఇన్ చార్జ్ గా పని చేస్తోంది, వాళ్ళ company shipment, delivery damage condition లో డెలివర్ అయ్యింది, అందుకే వచ్చి సీరియస్ అయ్యింది. కానీ వాళ్ళ CEO మంచి వ్యక్తి అని విన్నాను, వెళ్లి అతన్ని మీట్ అయ్యి జరిగిందంతా చెప్పాలి, లేదంటే ఆ క్లయింట్ ఆర్డర్స్ మిస్ అవుతాయి.

రవి: ఆ అమ్మాయి పేరు ఇంకా కంపెనీ పేరు ఏమిటి కిషోర్ గారు?

కిషోర్: ఆమె పేరు రుక్మిణి జోషి, కంపెనీ పేరు రాధ హెల్త్ కేర్.

రాధ రమణీయం… అని ఎక్కడో విన్నాను, సీతకి దూరమైన రాముడిలా, రాధాకి దూరమై రుక్మిణికి దొరికిన కృష్ణుడిలా, ఉన్న నేను మీ అందరికీ తెలిసిన రామ్… రామ కృష్ణ… To be continued on 13, Sept 2024

Writer – Ram Kocherlla

S/o Mani kumar Kocherlla.

** Click here for Next chapter **

Thank you so much for reading, please comment below your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.9 11 votes
Article Rating
Subscribe
Notify of
guest

4 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Siva Ramya
Siva Ramya
3 months ago

Super 👍

Sreevidya
Sreevidya
3 months ago

Superb Ram😊 Eagerly waiting for the next episode