HOME

మూడు  లేఖలు – Season II 

2 వ అధ్యాయము

లాకెట్

రవి : మీరు టెన్షన్ ఏం పడకండి కిశోర్ గారు, రుక్మిణి చెప్పిన రాధా హెల్త్ కేర్ కంపెనీ, మీరు కలవాలని అనుకుంటున్నCEO కూడా వీడే.

లోపుల్లో సింధు నన్ను పక్కకి తీసుకొని వెళ్లి, “అయ్యో రామకృష్ణ, ఏదో మా ఆయన నువ్వు ఇచ్చే బిజినెస్ కోసం ఆసక్తి చూపిస్తున్నాడని నువ్వు ఓవర్ చేసావ్ అనుకో, బాగోదు చెపుతున్నాఅని కాస్త కోపంగా చెప్పింది, అప్పుడు నేను సింధుతో, నాకు లేని పోని ఆలోచనలు ఇవ్వకు మళ్ళీ నువ్వే బాధ పడతావ్ అని నవ్వుతూ టీజ్ చేశాను.

Next Day
నేను ఆఫీస్ కి వెళ్లాను, నాతో పాటు మా యాదవులు కూడా వచ్చారు. వాళ్ళకి తోడు సింధు కూడా వచ్చింది. అందరూ నా క్యాబిన్ లోనే ఉన్నారు. మొత్తం మీద నేను రుక్మిణి ని నా క్యాబిన్ కి పిలవమని నా PAకి చెప్పాను. రుక్మిణి వచ్చింది, ఎలా అంటే, ఒక పక్కకి జడ వేసుకుని, మెడ ఓంపున వయ్యారం
కొంచం తన మెడలో గొలుసుకి కూడా అదిoది ఏమో, గొలుసు
కదులుతు , మెరుస్తూ , తన
కన్నుల్లో
ఉన్న కాంతికి పోటీ పడుతుంది

 ఆమె చూపు మాత్రం చాలా నిజాయితీగా ఉంది. నిజాయితీకి ఉండే పదునైన రూపానికి ఆమె కాటిక మరో రూపం. ఊపిరి మాత్రం కొంచం ఎక్కువగా తీసుకుంటోంది, నా ఆలోచనలు మళ్ళీ ఆమె చేతి వేళ్ళ వంకా వెళ్ళుతున్నాయి కానీ నా మనస్సు
మాత్రం
వద్దు అంటూ ఆపేస్తోంది. చివరికి నా చూపు ఆమె చేతివేళ్ళ వంక వెళ్ళింది. రుక్మిణి చేతి వేళ్ళ మధ్యలో ఒక పెన్ ఉంది. ఈసారి చేతివేళ్ళు పెన్ పట్టుకుని నా జీవితంలో ఏమి రాయబోతున్నాయో రానున్న కాలానికే కనబడాలి.

Hi sir, this is Rukmini Joshi అని పలకరించింది, మా మాటలు ఇలా సాగుతున్నాయి.

రామకృష్ణ: Hello రుక్మిణి…. Joshi అంటే from Nepal ?

రుక్మిణి: No Sir, Indian from Bangalore.

రామకృష్ణ:  so మీకు తెలుగు వచ్చా?

రుక్మిణి: హా వచ్చు సర్, Mother
from Hyderabd
so నాకు తెలుగు కూడా వచ్చు and మీరు నన్ను మీ క్యాబిన్ కి పిలిచారు అంట ?

రామకృష్ణ: అవును, నిన్న జరిగిన logistics issue గురించి.

రుక్మిణి: I apologize for the oversight. In alignment with your support for India’s protocols, I mistakenly selected an unsuitable logistics person whose name starts with Kishore

రామకృష్ణ: తెలుగు లో చెప్పు, మనది ఇంగ్లీష్ స్టోరీ కాదు, తెలుగు స్టోరీ, రీడర్స్ మళ్ళీ feel అవుతారు.

రుక్మిణి: ఒక wrong logistics ని select చేసుకున్నా సర్, వాడికి ఎలా ప్రాసెస్ చేయాలో తెలియలేదు, stupid fellow.

అని తిడుతోంది కిశోర్ ని, ఇంతలో సింధు ఎంటర్ అయ్యి, “ఎందుకు తిడుతున్నావ్ అతణ్ని, Air lines issue అంటే అతను ఏం చేయగలడుఅని చెప్పి మధ్యలో ఎంటర్ అయింది, నేను, సుదీక్ష ఇంకా రవి నవ్వుకుంటున్నాం. రుక్మిణి కి ఏం అర్థం కాలేదు. అప్పుడే నేను సింధు ని ఆపి, రుక్మిణి తో, You did a good
job but
ఆఫీసుకి వెళ్ళి మరీ తిట్టకు next time, ఎందుకంటే logistic కంపెనీ మా సింధు వాళ్ళ fiancé ది. ఇంకా ఎన్ని years నుంచి పారిస్ లో ఉన్నారు అని అడిగాను.

రుక్మిణి: around 10 years నుండి

రామకృష్ణ: good, మీ ఫాదర్ ఏం చేస్తున్నారు..?

రుక్మిణి: I am single parent child sir, dad
నా చిన్నపుడు expire అయ్యారు.

సుదీక్ష: పోనిలే బావానీ స్టోరీ లో మెయిన్ విలన్ ఈసారి లేడు రా బావా.

అని నాతో అనాడు, రుక్మిణి, “excuse me” అని వాడి వైపు చూసింది, నేను ఏదో cover చేసి, నా friends ని పరిచయం చేశాను. అందరం కలసి లంచ్ చేసాము చాలా సరదాగా మాటలాడుకుంటూ, కానీ రుక్మిణి తన employee, నేను boss అన్నట్టు బిహేవ్ చేస్తోంది. రవి గాడు రుక్మిణి తో, “మేము first time Paris వచ్చాం, మాకు సిటీ చూపిస్తావా, నీకు బాగా తెలిసి ఉంటుంది కదా సిటీ గురించిఅని అడిగాడు, రుక్మిణి నా expression కోసం వెయిట్ చేస్తోంది, నేను ok అన్నట్టు సైగ చేశాను.

నెక్స్ట్ డే ఉదయం Paris వీధుల్లో పర్యటన


మొదలయ్యాయి
మా ముచ్చట్లతో. రుక్మిణి రూపం రాధని మరిపిస్తోంది, ఆమె perfume నన్ను మైమరపిస్తోంది, ఆమె కళ్ళకి shades పెట్టుకున్నా
కుడా
ఆమె కనుబొమ్మలకి అందంగా ఉన్నా అన్న పొగరు shades నలుపు రంగుని తొక్కిపెడుతున్నాయి. మగవాడు మునిగి తేలకుండా ఉండెందుకు
ఆహ్ కళ్లకి కళ్ళద్దాలు
పెట్టింది ఏమో అనిపించింది, పంటి కింద chewing gum నములుతూ, నవ్వుతూ నడుస్తోంది. Paris లో ఉన్న ప్రకృతి రుక్మిణి పెదవులకు చలి తో గులాబీ రంగుని పూస్తోంది. గులాబీ
మంచులాంటి తనువు తో ఉన్న రుక్మిణి
, రాత్రి ఆకాశపు రంగు బట్టలు వేసుకుని, పగలు సూర్య కిరణాల కాంతికి పోటీ పడేలా ఉంది ఆమె చిరునవ్వులో వెలుగు. సూర్య కిరణాలు ఇష్టపడే నలుపు రంగును రుక్మిణి వేసుకున్నా కూడా, ఆమె వైపు సూర్య కిరణాలు రావటం లేదు, ఎక్కడ కిరణాల వల్ల ఆమె శరీరం కందిపోతుంది ఎమో అన్నట్టు.

అందరం
షాపింగ్ కి వెళ్లాము, సింధు జువెలరీ కలెక్షన్ చూస్తోంది, ఇంతలో రుక్మిణి కూడా ఏదో random గా కలెక్షన్ చూస్తోంది, వాటిలో ఒక Diamond Locket రుక్మిణి కి బాగా నచ్చింది. Price ఎంత అని అడిగింది షాప్ వాడిని, వాడు 3600€ Euros అని చెప్పాడు. రుక్మిణి కి బాగా నచ్చింది కానీ, తీసుకోలేదు. నేను సింధు కి సైగ చేశాను, వెంటనే సింధు, రుక్మిణి తోనీకు చాలా బాగుంటుంది రుక్మిణి, నేను నీకు gift ఇస్తానుఅని చెప్పింది, కానీ రుక్మిణి అసలు ఒప్పుకోలేదు. సింధు షాపింగ్ జువెలరీ చాలా ఫాస్ట్ గా చేస్తోంది hardly 20 minutes లో select చేసి బిల్లింగ్ దగ్గరకి వెళ్ళుతున్నప్పుడు, రుక్మిణి మొబైల్ కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ చూసిన వెంటనే, తనకి నచ్చిన లాకెట్ కొన్నది. షాప్ నుంచి బయటకి వచ్చాక సింధు ఇంకా రుక్మిణి మాటలు.

సింధు: ఏం జరిగింది రుక్మిణి, నేను కొని ఇస్తా అంటే వద్దు అన్నావ్, మళ్ళీ నువ్వు కొనుకున్నావ్.

రుక్మిణి: నిజానికి నాకు లాకెట్ బాగా నచ్చింది, కానీ నా దగరా అంతా మనీ లేదు, సో ఆగిపోయాను.

సింధు: మరి సడెన్ గా అంతా మనీ ఎలా వచ్చాయి?

రుక్మిణి: షేర్ మార్కెట్ లో నాకు కొన్ని షేర్స్ ఉన్నాయి, Last 3 months గా ఉన్న షేర్ సడెన్ గా 87% high అయ్యింది, సో మనీ తో కొనాను.

సింధు: అయినా నేను గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను కదా రుక్మిణి నీకు.

రుక్మిణి: నచ్చింది, కష్టపడి సంపాదించుకోవాలి, కానుకగా వస్తే కంటిచూపుకి చిన్నచూపుగానే కనిపిస్తుంది.

సింధు: మరి షేర్స్ లో, ప్రాఫిట్ వల్లనే వచ్చిందిగా, కష్టం ఎక్కడ ఉంది.

రుక్మిణి: షేర్స్ నేను కొనప్పుడు లాకెట్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉంది, but for some reasons వల్ల షేర్స్ డౌన్ అయ్యాయి, సో అది నేను కష్టపడి సంపాదించిన మనీ.

అని చెప్పి ఇంక నేను వెళ్తాను అని తను వెళ్లిపోయింది. నేను నా friends మా stay దగ్గరకు వచ్చేశాం. నేను ఫ్రెష్ అయి కొంచం సేపు రెస్ట్ తీసుకున్నా. ఈవెనింగ్ అయింది. నేను లేచేసరికి, సింధు, సుదీక్ష, రవి ముగ్గురు నా రూమ్ లో ఉన్నారు. మా మాటలు ఇలా సాగుతున్నాయి.

సుదీక్ష: అరేయ్ రామకృష్ణ నీ మొబైల్ నా దగ్గర ఉండిపోయింది.

రామకృష్ణ: ఐతే ఎం,
ఇవ్వు ఇటు ఇపుడు.

సింధు: అంటే వాడు నీ ఫోన్ లో ఒక 47 కోట్ల కి OTP Request చూసాడు అంటా, నీ PA నుండి.

రామకృష్ణ: అయితే.. కొన్ని కోట్లు ట్రాన్సాక్షన్స్ రన్ అవుతాయి నా బిజినెస్ లో. High amount అయితే నాకు OTP వస్తుంది అందులో ఏం ఉంది.

రవి: ఇంక ఆపరా బావా, అబద్ధాలు చెప్పింది ఇంకా చాలు. అరేయ్ రామకృష్ణ, 47 కోట్లు ఖర్చు చేసి, షేర్ ప్రైస్ పెంచడం ఏమిట్రా నువ్వు అసలు?

సుదీక్ష: పెంచడం పక్కన పెట్టు రవి, within 30 minutes లో షేర్ మార్కెట్ ని చెంజ్ చేసాడు అయగారు. రామకృష్ణ నాక్కూడా ఏదైనా ఇష్టం అయితే నేను కొనుక్కోలేకపోతే, ఇలా షేర్ మార్కెట్లు, పాల పాకెట్లు మార్చకు రా నాన్న, just నేను ఇష్టపడింది కొని ఇవ్వు చాలు.

సింధు: రవి, సుదీక్ష మీరు ఇద్దరూ కాస్త సైలెంట్ మోడ్ లో ఉంటారా.

సుదీక్ష: సైలెంట్ మోడ్ ఏం కర్మ, రామకృష్ణ గాడు చేసిన పనికి ఏకంగా flight mode.

సింధు: రామకృష్ణఅయిన పిల్లకి షేర్స్ ఉన్నాయి అని నీకు ఎలా తెలుసు రా.

రామకృష్ణ: తను మొబైల్ use చేస్తుండగా నేను random గా రాధ మొబైల్ చూశా, so నాకు గుర్తు ఉంది.

సింధు: రుక్మిణి ని ఇష్టపడుతున్నావా కృష్ణ?

రామకృష్ణ: ఇష్టం..! ప్రేమ..? రుక్మిణి ని ఇష్టపడిన లాకెట్, నేను ప్రేమించిన రాధ, రెండిటికి సమస్యా డబ్బే, అందుకే నేను నిమిషం డబ్బు కోసం ఆలోచించలేదు, రుక్మిణి ఇష్టానికి నా సంపాదన సాయపడితే చాలు అనుకున్నా.

అని చెప్పుతున్న సింధు కి అంతలో రుక్మిణి మా stay దగ్గరకి వచ్చి, మా ముందే లాకెట్ పట్టుకుని చాలా కోపంగా నిలుచుంది. అసలే అందమైన కళ్ళు, కళ్ళ కాంతికి కొంచెం వేడి ఉన్న, సూర్యుడికి 
 చెమటలు పట్టేలా ఉన్నాయి, ఆమె కళ్ళలో కొలువై ఉన్న కోపానికి.

రుక్మిణి: so నా అందానికి మీరు కట్టిన విలువ 47 కోట్లు.

రామకృష్ణ: అందానికి
ఎవరూ
విలువ కట్టలేరు కానీ ఆనందానికి విలువ కట్టగలరు.

రుక్మిణి: ఆనందం అందిచే ఆడదాని అందాన్ని అందుకుంటాం అనుకుంటారు మీలాంటి డబ్బు ఉన్న మగవాళ్ళు.

రామకృష్ణ: పైసలతో వచ్చే అందం కన్నా, ప్రేమతో ఇచ్చే అందానికి విలువ ఎక్కువ.

రుక్మిణి: అంటే ఇప్పుడు, నన్ను ప్రేమిస్తున్నా అంటున్నారా?

రామకృష్ణ: కాదు, నీ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నా.

రుక్మిణి: బిజినెస్ మాన్ వి కదా, మాయమాటలు ఏమైనా చెబుతారు. లాకెట్ వద్దు, మీ కంపెనీ లో జాబ్ కూడా వద్దు. గుడ్ బై మిస్టర్ రామకృష్ణ.

అని చెప్పి, లాకెట్ ని టేబుల్ మీద పెట్టి కోపంగా వెళ్లిపోయింది. ఇంతలో రవి గాడు నాతో, “షేర్స్ ని మేనేజ్ చెయ్యడం అంత ఈజీ కాదు బావా, స్త్రీ ని మేనేజ్ చేయడంఅని అంటున్నాడు. నేను రుక్మిణి కి నచ్చచెపుదాం అని వెళ్తున్నా. ఇంతలో సింధు అంటోంది రవి ఇంకా సుదీక్ష తో, “రాధ పొలికలతో ఉన్న ఆమ్మాయి Paris లో ఉంది అని నాకు ముందే తెలిసింది రా, అందుకే నేను కూడా రామకృష్ణ తో Paris వచ్చాను, మీ అందరిని తీసుకొని వచ్చేలా చేసానుBe continued on 20th Sept 2024

Writer – Ram Kocherlla

S/o Mani kumar Kocherlla.

** Click Here for Next Chapter **

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

5 4 votes
Article Rating
Subscribe
Notify of
guest

6 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sreevidya
Sreevidya
3 months ago

Brilliant Ram🫰 Prathi sari Mee poetry tho maya chestharu.

M Seshu
M Seshu
3 months ago

Great

Siva Ramya
Siva Ramya
3 months ago

Wow nice story 👏