వీచే గాలి వాటం బట్టీ అంచన వేసే అనుభవం వృక్షానికి ఉంటుంది, అనుభవం లేని మొక్క మాత్రము వీచే గాలిలో చల్ల దనాన్ని ఆస్వాదిస్తుంది, అదే తీరునా రాధ రూపం తో ఉన్న రుక్మిణి వల్ల వచ్చే అనుభవాలను అంచనా వేయాల, లేక ఆమె నాతో ఉంది కదా అని ఆనంద పడాలో అర్ధం కాక రుక్మిణి ని చూస్తూ ఉన్నాను.
టేబుల్ మీద ఉన్న లాకెట్ తీసుకొని, నేను చూస్తు ఉండగానే ఆమె మెడలో వేసుకుంది, వేసుకొని ఎలా ఉంది అని అడిగింది, అప్పుడు నేను తనతో, ““నేను పెంచిన షేర్ మార్కెట్ కి ఇప్పుడు విలువ వచ్చింది”, అని నవ్వుతున్నాను, “రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకటీ ఇవ్వాలి గా మరి ? ఏO కావాలి ?”” అని అడిగింది రుక్మిణి, అప్పుడు నేను ““ఇది అంత చేసింది నిన్ను ప్రేమిస్తున్నాను అని అనుకోకుండా ఉంటే చాలు”” అని చెప్పాను, తను ఒక నిమిషం మౌనం గా ఉండి నాతో అంటుంది ““మీకు ఒక నిజం చెప్పాలి, నేను కూడా మీ ఇంటర్వ్యూ మ్యాగజైన్ చదివాను, మీరు రాధ నీ ఎంత ప్రేమించారో నాకు అర్ధం అయ్యింది, అలాంటి మనిషి రెండు రోజులు పరిచయం ఉన్న ఒక అమ్మాయి కోసం అంత డబ్బు ఖర్చు చేసాడు అంటే, ఒక అమ్మాయిగా రావలిసిన ఆలోచనలో ఉన్న అనుమానం నాకు కూడా వచ్చింది అందుకే అంత కోపం వచ్చింది, కానీ రాధ ఫోటో చూసాక అర్ధం అయ్యింది, మీరు ఖర్చు పెట్టింది దేహానికి కాదు, రూపానికి అని, సరే కానీ మీకు ఏం కావాలో చెప్పండి లేదా మీకు ఇష్టమో చెప్పండి నేను అది కొని ఇస్తాను”” అని నవ్వుతుందీ, నేను వెంటనే ““నా కోసం ఒక్కసారి ఇండియాకి వస్తావా..?, ఎందుకు ఏంటీ అని ఏం అడగకు”” అని అన్నాను, రుక్మిణి నాతో “ఒక నిమిషం” అని చెప్పి, వాళ్ళ ఇంటిలోకి వెళ్లి, ఒక పది నిమిషాలు తరవాత బయటకి వచ్చి “అమ్మ పర్మిషన్ అడగాలి గా అందుకే లోపలకి వెళ్ళి అడిగి వచ్చాను, ఎన్ని రోజులో చెప్తే డ్రెస్ ప్యాక్ చేసుకుంటా” అని అంటూ నా వంక చూస్తుంది. రేపు ఉదయం స్టార్ట్ అవుదాం అని చెప్పి, నేను మా హోటల్ కి వచ్చేశాను, నా ఫ్రెండ్స్ ముగురు చాలా హ్యాపీ గా ఉన్నారు, రుక్మిణిని నా పేరెంట్స్ కి చూపించి, రుక్మిణిని ఒపించి పెళ్లి చేసుకుంటాను ఎమో అని.
ఆమెతో వేసే అడుగులకి, గత జ్ఞాపకాల అనుభవాలు నాకు ఎదురు వచ్చి, నాకు సరైన దారి అందిస్తుంది అనుకుంటూ ఆనందంగా అడుగులు వేస్తున్నాను నేను.
ఇండియా కి నేను, రుక్మిణి నా ఫ్రెండ్స్ రిటర్న్ అయ్యాం, ఎయిర్‌పోర్ట్ లో కారు రెడీగా ఉంది, కారు ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యాం, ఓ 30 నిమిషాల తరువాత, రవి గడు రూట్ చూస్తూ “ఇటు ఎక్కడికిరా తప్పు రూట్ లో వెళుతున్నాడు డ్రైవర్, ఒక సారి చెప్పు” అని నాతో అంటున్నాడు. నేను రవితో “తప్పు ఏమి కాదు నాకు తెలుసు, ఎటు వెళ్తున్నడో” అని అన్నాను. కాసేపటికి, కారు ఒక ఇంటి ముందు ఆగింది, నా ఫ్రెండ్స్ అందరూ చాలా సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే కారు ఆగిన place రాధా వాళ్ళ ఇల్లు కాబట్టి, నేను రుక్మిణిని తీసుకొని రాధ వాళ్ళ ఇంటిలోకి వెళ్ళాను. రాధ వాళ్ళ నాన్న మొక్కలకు నీళ్ళు పోసి అప్పుడే లోపలికి వచ్చారు, నన్ను చూస్తూ, నా పక్కన ఎవరు అని చూస్తున్నారు. రుక్మిణి చూస్తూ, ఒక నిమిషం మౌనంగా ఉండి, ఒక్క సారిగా ఆంటీని పిలిచారు, ఆంటీ బయటకి వచ్చి రుక్మిణిని చూస్తూ, ఏడుస్తూ హత్తుకొని గట్టిగా ముద్దులు పెట్టుకుంటున్నారు. అంకుల్ రుక్మిణి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు తల్లి, నేను అంత కటినంగా ఉండి ఉండకూడదు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని ఏడుస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. కోరుకున్నది ఇలలో కోల్పోయినా, అది కలలో దొరికినా నిజమే అనుకుంటారు అని.
అందుకే అంటారు ఏమో ప్రేమించే వ్యక్తి పంచప్రాణాలుగా ప్రకాశిస్తే, ప్రస్తుతని పసిగట్టలేరు అని. అందరూ అన్నట్టు మనిషి కనులకి కారణం ప్రపంచాన్ని చూడటానికి అని, కానీ ప్రపంచానికి మనం చూపించని మనిషి గుండెలో బాధని, కన్నీటి రూపం లో బయట పెట్టడానికి కూడా అని తెలుసుకోవాలి.
నేను వాళ్ళ ఇద్దరిని ఊర్కో పెట్టాను, మరచిపోలేక మోయలేక మోస్తున్న మౌనమైన భారం కన్నీటి బిందువులుగా బయటకి వచ్చినపుడు, వాళ్ళు వాస్తవానికి వచ్చారు. నిజానికి ఇప్పుడే నాకు గుండె బరువు తగ్గింది, ఎందుకు అంటే, రాధ నాకు దూరం అయింది అని కోపం ఒక వైపు ఉంటే, వాళ్ళకి వాళ్ళ కూతురిని శాశ్వతం గా దూరం అవడానికి కారణం నేనే అనే బాధ ఇంకో వైపు, ఈ కోపం లో ఉన్న బాధ భరించ లేక నాకు నేను వేసుకున్న శిక్ష ఈ ఒంటరి తనం, చాల రోజుల తర్వాత నా కంటి నుంచి చల్లగా కన్నీరు బయటకి వచ్చింది, కాసేపటికి వాళ్లకి చెప్పాను, “ఈ అమ్మాయి పేరు రుక్మిణి, మీ ఇద్దరు ఒక సారి చూస్తారు అని ఇండియా తీసుకొచ్చాను” అని చెప్పను. అప్పుడు రాధ వాళ్ళ ఫాదర్ నాతో “మా శోకం తగ్గడానికి అదే రూపం ఉన్న ప్రాణాన్ని తీసుకొచ్చావ్, కానీ నువ్వు మనస్సు ఇచ్చిన మనిషిని నేను ఎప్పటికి తీసుకొని రాలేను, నను క్షమించరా ”’అని నా చేతులు పట్టుకొని కంట తడి పెట్టుకున్నారు. ఒక గంట సేపు రుక్మిణిని ప్రేమతో ముంచి ఎత్తారు, నేను రుక్మిణి దగ్గరికి అసలు వేళ్ళలేదు, నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురిని ఆలా చూస్తూ ఉన్నాం, కాసేపటికి నేను అంకుల్ తో మేము వెళ్తాము అని అన్నాను అప్పుడు అంకుల్ నాతో “రుక్మిణి ఎక్కడ ఉంటుంది అని అడిగారు” నా కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉంటుంది అని చెప్పాను, వెంటనే రాధ వాళ్ళ అమ్మగారు “ఎందుకు రామ కృష్ణ గెస్ట్ హౌస్ లో, తను మా ఇంట్లో ఉంటదిలే” అని అన్నారు, నేను ఒక సారి రుక్మిణి వంక చూసి, నీకు సరే నా ? అని సైగ చేసాను చిన్నగా, రుక్మిణి కళ్ళలో ఆనందం నాకు ఉంటాను అని సమాధానం చెప్పాయి, సరే నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని బయటకి వస్తుంటే, రుక్మిణి బయటకి వచ్చి “జాగ్రత్తగా వెళ్లి రా కృష్ణుడా” అని రాధ నన్ను ఎలా పిలుస్తుందో అలా పిలిచింది, ఒక సరిగా, నేను నా ఫ్రెండ్స్ వెనక్కి తిరిగి చూసాం, రాధ ఏమైనా రుక్మిణి లోకి వచ్చింది ఏమో అనే అంతల “కృష్ణుడా అని పిలిస్తే మీ ఫేస్ లో అందం ఎలా ఉంటుందో, చూడాలి అనిపించింది అందుకే ఆలా పిలిచాను సర్, ఇంకో సారి పిలవనులే” అని రుక్మిణి నాతో అంటూ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయింది.
తాను సరదాకి పిలిచిందో, నా సంతోషం కోసం పిలిచిందో కానీ, నా ప్రపంచానికి పేరు ఆ పిలుపే అని రుక్మిణికి తెలియదు. ఇంకా అక్కడ నుండి నా ఫ్రెండ్సని, వాళ్ళ వాళ్ళ ఇంటిలో డ్రాప్ చేసి, నేను ఉంటుంన్న ఇంటికి వచ్చేసాను, Fresh-up అయి, కడుపు నిండ తిని, కార్ తీసుకొని చాల సంతోషంగా స్పీడ్ గా ఆఫీస్ కి కారులో వెళుతున్నాను, గాలి వేగాన్ని వెంటాడుతున్నట్టు వెళుతున్న చాల సంతోషంగా, పది నిమిషాలలో రీచ్ అవుతాను అనగా, కనురెప్పపాటులో నా కార్ ఆక్సిడెంట్ అయింది, నా కంటి ముందు జరిగుతోంది నాకు ఎం అర్ధం కాకపోయినా, నా కనుల ముందు అంత డాడీ ఒకరే కనపడుతున్నారు, నా కథ మొదలు అయినదే డాడీ ని హ్యాపీ గా చూడాలి అని, అయన తప్ప నా వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు, సంతోషం గా ఉంచుతున్నాను కూడా. అప్పుడు నా మనసులోకి రుక్మిణి వాళ్ళ అమ్మగారు అడిగిన ప్రశ్న గురుతుకు వచిన్చది “మీ కథలో ప్రేమ కథ ఎటువంటిది…?” అని, ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు నాకు దొరికింది, నా ప్రేమ కథ ఒక తండ్రి కొడుకుల మద్య ప్రేమ కథ అని.
ఇద్దరు ప్రేమికుల మద్య ప్రేమ మొదలు అవ్వాలి అంటే, అబ్బాయి తెలియచేయడమో లేక అమ్మాయి అర్ధం చేసుకొని కొనసాగడమే జరగాలి, కానీ తండ్రి కొడుకుల మద్య ప్రేమ మొదలు ఎక్కడ అంటే అది కొడుకు పుట్టడం తోనే. ఆ ప్రేమని తండ్రికి చెప్పలేని కొడుకు, అర్ధం ఐన కూడా బయటపడని తండ్రి, ఎంత విచిత్రమో కదా ఈ బయటపడని బలమైన బంధం, ఈ నిమిషంలో నాకు మరో క్షణం ఉందో లేదో కూడా తెలియదు కానీ నాకు అనిపించింది ఏంటి అంటే ప్రాణం పొసే అమ్మ కి చెప్పే మాట, మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే తండ్రి కి చెప్పలేం, ఈ నిమిషం లో నాకు అనిపిస్తుంది, మిమల్ని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్న డాడీ, i love you so much అని చెప్పాలని ఒకటే ఆలోచన, సరిగ్గా అదే సమయానికి నా ఆలోచనలతో బరువు ఎక్కిన నా తల divider కి తగిలింది, ఆలోచనలు పరుగులు తీసే అంత వేగంతో.
రామ కృష్ణకి ఎం అయింది…? ఎలా ఉన్నడొ చెప్పాలి అంటే ఒక పాత్ర కావాలి అందుకే, మన కథలో మన కొత్త కథానాయకి రుక్మిణి కథని కదిలిస్తూ, మీరు కన్ను ఆర్పకుండా చదివేలా చేస్తుంది….. To be continued on dated 15th Nov 2024
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Just finished reading the story Ram 😊 I’m still reeling in that🌈. Can’t wait for the next chapter 🫠Keep Rocking ✨
Thank you so much for reading #SreeVidya Garu 🙂