చల్ల గాలికి, చిందులు వేసే చిరు కొమ్మల మాదిరిగా రామ కృష్ణ నవ్వు చూసి ఎంతో ఆనంద పడే మేము, అతని ఆక్సిడెంట్ న్యూస్ విని, సుడిగాలికి చెల్లా చెదురై పోయిన చెట్ల మాదిరిగా మారాయి మా మనస్సులు, రాధ వాళ్ళ ఇంట్లో నేను రాధని కాకపోయినా, కృష్ణుడు బాగుండాలి అని కోరుకునే రుక్మిణి నేను. ఆక్సిడెంట్ న్యూస్ నాకు తెలియగానే. హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యాను. నేను ఉంటున్న చోటు కి ఆ హాస్పిటల్ చాలా దగ్గిర, నేను రీచ్ అయ్యే సమయానికే రామ కృష్ణని అంబులెన్సులో నుంచి దించుతున్నారు, ఒళ్ళు అంత రక్తంతో తడిచిపోయిన కూడ, అతని కన్నులు మాత్రం ఇంకో ఒక చూపు కోసం ఎదురు చూస్తున్నాయి, Emergency లోకి తీసుకొని వెళుతున్న దారిలో, రామ కృష్ణ పేరెంట్స్ కూడ వచ్చారు, అప్పుడు అర్ధం అయింది, రామ కృష్ణ కన్నులు వెతుకుతున్నది అతని ఫాదర్ గురించి, తన ఫాదర్ ని చూసి, చిన్నగా నవ్వుతూ “I am sorry daddy” అని చెప్పి, సృహ తప్పాడు. రామ కృష్ణని emergency రూమ్ లోకి తీసుకొని వెళ్ళారు, అంకుల్ మాత్రం ఒక్క చుక్క కన్నీరు కూడ కార్చలేదు, బహుశా ఆంటీని ఓదార్చడానికి ధైర్యంగా ఉండాలి కాబట్టి ఏమో, లేక రెండో కొడుకు ముందు బాధపడితే, ఎక్కడ అ కొడుకు ధైర్యం కోల్పోతాడు అని ఏమో తెలియదు కానీ, అంకుల్ మాత్రం ఏడవలేదు, అప్పుడు ఒక్క అమ్మాయిగ నాకు అర్ధం అయింది ఏంటి అంటే, మగవాడు కంటి నుంచి కన్నీరు వదిలాడు అంటే అతని వెనుక ఉన్న వారు ధైర్యం వదిలేసినట్లే అని.
ఇంతలో రవి, సుధీక్ష ఇంకా సింధు వచ్చారు, రామ కృష్ణ Accident condition analysis చేయడానికి, వాళ్ళ ఫేసెస్ లో ఆందోళన చూసాక నాకు అందరికి అర్ధం అయింది, రామ కృష్ణ కండిషన్ చాల critical అని, వాళ్ళు ఆపరేషన్ కి సిద్ధం అవుతూ, నాతో మాట్లాడిన మాటలు.
రవి: చిన్నపుడు నుంచి నేను కన్న కల డాక్టర్ ఆవ్వాలి అని, అలాగే సుధీక్ష ఇంకా సింధుది కూడ, కానీ ఈ రోజు మా కల కలగానే మిగిలిపోతే బాగుండు అని పిస్తుంది, వాడి చిరు నవ్వు దూరం అయితేనే తట్టుకోలేని మేము, రక్తంతో తడిచి ముద్దఅయిపోయిన వాడిని ఎలా ముట్టుకోవాలో అర్ధం కావటం లేదు.
సుధీక్ష: డాక్టర్ అంటే దేవుడు అని అంటారు, కానీ దేవుడికి కావలిసిన వాళ్ళు కష్టంలో అంటే అతను కూడ మాములు మనిషే, ఏ నిమిషంలో రాధ హెల్త్ కేర్ అని ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాడో కానీ, వీడికే ఇక్కడ ఇలా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు.
సింధు: వాడు చూసే చూపు అంటే నాకు చాల ఇష్టం, అలాంటిది ఈ రోజు నన్ను చూడకుండా ఆ కనులు రక్తపు మరకలతో మౌనం అయిపోయాయి, ఆ చూపు కోసమైన నేను వాడిని బతికించుకుంటాను, బతికించుకొని తీరతాను.
అని బాధ పడుతూ, ధైర్యం తెచ్చుకొని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారు. ప్రతి సైనికుడు ప్రాణం మీద ఆశతో యుద్ధనికి వెళ్ళడు కానీ, అలాంటి ప్రాణాన్ని బతికిస్తా అని యుద్దానికి వెళ్ళే ఒక డాక్టర్ ఎంత గొప్పవాడో కదా. రామ కృష్ణ అమ్మ గారు, ఆ హాస్పిటల్ లో చిన్నగా ఒక గుడి కట్టించారు, ఆంటీ ఆ గుడిలోనే కూర్చొని దేవుడికి వేడుకుంటున్నారు, అంకుల్ ఇంకా శివ ఇద్దరు బెస్ట్ డాక్టర్స్ ఇంకా ఎవరైనా అవసరమా అని కనుక్కుంటు చాల టెన్షన్ గ ఉన్నారు, ఇంతలో రామ కృష్ణ కంపెనీలో వర్కర్స్, ఎంప్లాయిస్, అందరూ హాస్పిటల్ బైట రామ కృష్ణ బాగుండాలి అని దేవుడిని వేడుకుంటున్నారు, ఇంత మంది చేత ప్రేమించబడ్డానికి రామ కృష్ణ అంతలా ఎం చేసాడు, ఒకరిని మోసం చేయడానికి ఇష్టపడడు, ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తారు, డబ్బుని ప్రేమించడు, అనిటికి మించి కష్టం తెలుసుకొని కన్నీరు తుడిచేవాడు, కనురెప్పల మాదిరిగా కావలిసిన వాళ్ళని కాపాడుకునే వాడు రామ కృష్ణ.
దదాపు నాలుగు న్నర గంటలు ఆపరేషన్ తరవాత, డాక్టర్స్ ఐన వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు బయటకి వచ్చి చెప్పింది ఏంటి అంటే Abdominal head chest దాటుకుంటూ ఒక glass peace వెళ్ళి గుండెకి దగ్గరలో రెండు ముక్కలుగా break అయిపోయింది అని చెప్పారు “అది విన్న శివ “”మరి ఇప్పుడు ఎలా”” అని అడుగుతుండగా, సింధు చెప్పుతుంది ఇలా “ఆ glass peace లో ఒకటి left cornary artery top లో రెండు pipes మధ్యలో ఇరుక్కుపోయింది, వాడి బ్రెయిన్ మాత్రం ఆక్టివ్ గా ఉంది బతకాలి అని చాల గట్టిగా అనుకుంటుంది, ఇప్పడు మనకి తార అవసరం చాల ఉంది”” తార వరల్డ్ లో highest heart surgery success rate ఉన్న డాక్టర్ అని సింధు చెప్పగానే, శివ అంటున్నాడు “నేను ఆల్రెడీ ప్లేన్ ఆరెంజ్ చేశాను, తార is on the way, ఇంకో రెండు గంటల్లో హాస్పిటల్లో ఉంటుంది”, అని చెప్పాడు. రాముడికి ప్రాణం ఐన సీతని కాపాడానికి, లక్ష్మణుడు ఎంత కష్టపడడో తెలియదు కానీ, రామ కృష్ణని కాపాడానికి ఉన్న అని దారులని, శివ ముందే అమలు చేసి పెడుతున్నాడు.
అన్న దమ్ములు అంటే అవసరానికి కాదు, అవసరం రాకుండా కూడా ఒక అడుగు ముందు ఉండాలి అని శివ చేతలతో తెలియచేసాడు. అందమైన భూలోకం లాంటి ఆ కుటుంబానికి, వెలుగుని అందించే సూర్య చంద్రులు లాంటి ఇద్దరు కొడుకులు, అవసరాన్ని బట్టి పాత్రలను పంచుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తారు, కానీ ఈ రోజు, ఆ సూరీడు, చంద్రుడు రెండు పాత్రలను శివ ఒక్కడే మోస్తూ ముందుకు సాగుతున్నాడు.
రెండు గంటలు తర్వాత తార హాస్పిటల్ కి వచ్చింది, చీర కట్టుకొని నడుచుకుంటూ వస్తుంది, తన నడక చాల పవర్ ఫుల్, కాన్ఫిడెంట్ గా ఉంది. గులాబీ ఒంటి రంగుతో, పచ్చని రంగు చీర కట్టుకొని నడుస్తూ దారిలోనే రిపోర్ట్స్ అని చూస్తుంది, నన్ను చూస్తూ క్రాస్ అయి వెళ్లి, మళ్ళి వెనక్కి తిరిగి నా ముందుకు వచ్చి ఇలా అంది “ఆ హార్ట్ లో ఉన్న రూపం నువ్వే, నీకు అప్పచెప్పి రెండు రోజులు కూడా అవలేదు, వాడిని కాపాడుకోలేక పోయావు, అందుకే అంటారు ఏమో, నెల వంకకి ఎన్ని రూపాలు ఉన్న, నిండు చందమామ ఒక్కటే అని” అంటూ సింధు తో మాట్లాడుతూ వెళ్ళిపోయింది. నిజానికి తార చాల అందంగా ఉంది, ఇంతటి అందాన్ని కూడా లెక్కచేయలేని రామ కృష్ణ మీద నాకు చాల ఇష్టం పెరిగింది, అంతే కోపం తార మీద కూడా వచ్చింది, ఆక్సిడెంట్ నవల్లే అయినట్టు మాట్లాడింది, ఆహ్ మరసటి రోజు ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతున్నారు.
తార వల్ల రామ కృష్ణ బతికితే, తార ని lifelong మరచిపోకుండా, కృతజ్ఞతతో ఉండాలి కానీ తరని గురుతు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే, నాతో పాటు తారకి కూడా రామ కృష్ణ మీద ప్రేమ ఉంది కాబట్టి అంతకు మించి నాకన్నా కొంచం,అందంగా ఉంది. దదాపు ఆరు గంటలు ఆపరేషన్ తరవాత, తార ఏడుస్తూ బయటికి వచ్చింది, నా గుండె వేగానికి, తార వైపు వేసే అడుగులు తడపడ్డాయి. అంకుల్ అడిగారు ఏO అయింది రా తార అని, ““ఈ స్టుపిడ్ రామ కృష్ణ వల్ల నేను కొని గంటలు నుంచి ఏడుపు ఆపుకున్న అంకుల్, ఎక్కడ ఆపరేషన్ చేసేటపుడు ఎమోషనల్ అవుతాను ఏమో అని, ఆపరేషన్ సక్సెస్ బతికేసాడు మీ పెద్ద కొడుకు, ఇంకా న కళ్ళల్లో స్టోర్ చేసిన వాటర్ ఇప్పుడు బయటకి రాకుండా ఆపడం కష్టం”” అని అంటూ ఆనంద భాష్పాలు అందరితో పంచుకుంటుంది, ఆ good news విన్నాక రామ కృష్ణ వాళ్ళ మదర్ అయితే తారని ముద్దులతో ముంచి ఎత్తారు, అప్పుడు తార అంటుంది ఆంటీతో “మీ కొడుకుతో పెళ్ళి అయి ఉంటే వాడు ఇచ్చేవాడు మీరు ఇస్తున్నారు ఆంటీ ముద్దులు, పర్లేదు ఈ ముద్దులు కూడా ప్రేమతోనే గ”” అని అందరిని నవించింది, అంకుల్ మాత్రం అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని నేను వెతుకుంటూ వెళ్తే, హాస్పిటల్ లో ఉన్న గుడికి వెళ్ళారు, అక్కడ అంకుల్ ఒంటరిగ కూర్చున్నారు, కొన్ని గంటలుగా తనకి తాను సద్ది చెప్పుకొని, పక్కవారికి ధైర్యం చెపుతూ ఆపుకున్న కన్నీళ్ళు బయటకి వచ్చాయి అంకుల్ కి. అంకుల్ ని చూసినపుడు, అనిపించింది నాకు, గెలిచినా ఓడిన మగవాడి కన్నీరు కట్టుకున్నది కూడా ఒకొక్క సారి చూడలేదు అని, మగవాడి కన్నీరు కనుకోవాలి అంటే కటిక చీకటిలో లేదా ఒంటరి తనం లోనే అని. లోకాన్నీ చూసే విశ్వనికి కూడా కనపడని అంతటి విలువైన మగవాడి కనీరు విలువ ఎంత ? ఈ ప్రపంచం చూసి సుమారు హేళన చేసే అంత !
To be continued on 22nd Nov 2024
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Getting tears to me bro
Super 👍