HOME

6 వ అధ్యాయము

తెలిసిందా ఎవరో ?

కృష్ణుడు దక్కించు కోలేని ప్రేమ.

రుక్మిణి రాణిస్తున్న ప్రేమ.

రాముడికి దక్కిన కూడా నిలబడని ప్రేమ.

లవ కుశలు కు లభించిన ప్రేమ.

ఒక చోట ఓడి ఇంకో చోట గెలిచిన ప్రేమకి చరిత్ర ఉంటూనే ఉంది. రెండో సారి గెలిచిన ప్రేమకి  గతం ఉంటే, మరి ఆ గతంలో మొదటి ప్రేమ ఎంత వరకు. మనిషి మారెఅంత వరకా? లేక మనిషిని మరిచిపోయే అంత  వరకా ?.

రామ కృష్ణ ఫాదర్ అలా ఒంటరిగా కూర్చొని ఉన్నారు, నేను వెళ్ళి అంకుల్ తో మాట్లాడుదాం అనుకునే లోపు, రాధ వాళ్ళ ఫాదర్ వచ్చారు, రామ కృష్ణ ఫాదర్ తో మాట్లాడనికి, వాళ్ళమాటలు ఇలా సాగుతున్నాయి

రాధ  (ఫాదర్): నమస్తే సర్, దేవుడు ఉన్నాడు, మన వాడికి ఏం కాలేదు.

 

రామ కృష్ణ (ఫాదర్): నమస్తే సర్. అవును దేవుడు ఉన్నాడు అందుకే తన ఉనికి చాటి చెప్పుకోవడం కోసం కష్టం ఇచ్చి, ఇచ్చిన కష్టంలో ఉన్న కన్నీరు కొద్దిపాటిగా తుడిచి, నేను ఉన్నాను అని చెప్పుకుంటాడు ఏమో అనిపిస్తుంది సర్ రోజు రోజుకి, ఇంతకీ ఇదేనా రావడం ?

 
రాధ  (ఫాదర్): రెండు రోజుల నుంచి, ఇక్కడే హాస్పిటల్ లోనే ఉన్నాను, మీ ముందుకు వచ్చే దైర్యం సరిపోలేదుఅండి, అందుకే కలవలేదు.

 

రామ కృష్ణ (ఫాదర్): అలా అంటారు ఏంటి సర్, మీరు ఏం తప్పు చేసారు ?

 

రాధ  (ఫాదర్): నా మూర్ఖపు పట్టుదల వల్ల, నా కూతుర్ని పోగొట్టుకున్నాను, మీ కొడుకు జీవితంలో సంతోషాన్ని లాక్కున్నాను, అంతకు మించిన తప్పు ఇంకా ఎం చేయగలను ఈ జన్మకి

రామ కృష్ణ (ఫాదర్)” ఒక తండ్రిగా వాడికి కావలిసిన అవసరాలను తీర్చాను ఒక మద్య తరగతి వాడిగా. నా పెద్ద కొడుకు, చిన్నప్పటి నుండి, నన్ను పెద్దగా అడిగింది ఏమి లేదు సర్, అలాంటి వాడికి ఒక అమ్మాయి నచ్చి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడు నాన్న అని వాడు నన్ను అడిగే లోపే నేను వాడితో అన్నాను, రాధ వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడాను  అని, ఎందుకో తెలుసా సర్, నేను మిమ్మలిని అడిగిన కూడా ఒప్పుకోరు, మీకు అర్ధం అయ్యేలా చెప్పిన కూడా ఒక్క నిమిషం ఆలోచన కూడా చెయ్యరు, అది నాకు బాగా తెలుసు, నా బాధ మిమల్ని వచ్చి అడగడం కాదు సర్, నా కొడుకు అడిగే మొదటి కోరిక అది, నేను తీర్చలేని చివరి కోరిక కూడా అదే అవుతుంది కాబట్టి, ఎప్పుడు ఏమి అడగని వాడు, అడిగిన ఒక్కటి కూడా తీర్చలేకపోతే ఒక తండ్రి గా ఉండే ఆవేదన మీకు చెప్పక్కర్లేదు, కలి కాలన్ని నడిపే డబ్బునే వాడు ప్రేమించడం మానేసి గౌరవిస్తున్నాడు, అలాంటి వాడికి ఇంకో అమ్మాయి ని పెళ్ళి చేసుకొని ప్రేమించు అని ఏం చెప్పగలను, ఒక వేళ పెళ్ళి చేసిన కూడా కాపురానికి దేహం ఒక్కటే కాదు గ, మనస్సు కూడా ముందుకు రావాలి గా, అందుకే మనశ్శాOతి లేని వాడి మనస్సుని చూసి నేను మౌన మార్గం తీసుకున్నాను, అంతే కానీ మీరు చేసిన తప్పు ఏం లేదు సర్, మీరు అలా ఏం అనుకోకండి.

రాధ (ఫాదర్): మనస్సులో ఎంత బరువు పెట్టుకున్నారు సర్, దానికి కారణం నేనే అని అర్ధం అవుతుంది, ఆశలు ఆవిరి అయిపోయి, ప్రాణం ఒకటే ఉన్న జీవాన్ని సర్ నేను. “క్షమించండి” అని అడగడం తప్ప ఏమి చేయలేను, 

   

రామ కృష్ణ (ఫాదర్): తప్పు ఇక్కడ ఎవరిది కాదు సర్, రెండు కుటుంబాల మద్య పరిస్థితులు అంతే, మనిషకి ఉన్న మనస్సు, పరిస్థితులను పట్టించుకోదు. పరిస్థితులకి మనుషులతో పట్టింపు ఉండదు, అందుకే కాలానికి జీవుడి జీవితం అంటే ఎప్పుడు లోకువే, లోకానికి ఎదురు వెళ్ళే వాడికి బంధాలు కూడా తక్కువే.

రాధ (ఫాదర్): మీరు చెప్పేది నిజమే సర్, ఇంతకీ మీరు రుక్మిణి ని చూసారా?, ఆచ్చం మన రాధలా  ఉంది.

 

రామ కృష్ణ (ఫాదర్) : చూసాను, రామ కృష్ణ పారిస్ వెళ్ళక ముందే తార నాకు చెప్పింది ఆ అమ్మాయి గురించి, ఆ విషయం తెలిసినప్పుడు, ఎక్కడో చిన్న ఆశ కలిగింది, ఇంతలో వీడి ఆక్సిడెంట్, అందుకే అంటారు ఏమో. భరించే వాడికే బాధలు, ఓర్చుకునే వాడికే ఓటమిని ఇస్తాడు దేవుడు అని.

 

వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటునప్పుడు, నేను ఇంకా ముందుకి వెళ్ళాను, రామ కృష్ణ ఫాదర్ కి  వాటర్ బాటిల్ ఇవ్వడానికి, అంకుల్ వాటర్ తాగి, “రామ కృష్ణని ఎప్పుడు చూడచ్చు అంట అమ్మ  కనుక్కునావా ?” అని అడిగారు, ఆల్రెడీ శివ చుడ్డానికి వెళ్ళాడు అంకుల్, మిగిలిన వాళ్ళు రెండు రోజుల తరువాత చూడచ్చు అని చెపుతున్నారు అంకుల్” అని చెప్పాను, అప్పుడు అంకుల్ నాతో “తార అన్న మాటలకి నువ్వు ఏమి ఫీల్ అవకురా, అయినా తార చెప్పినట్లు, నిండు చందమామ ఒకటే ఉంటుంది కానీ అది ఒక రోజు మాత్రమే ఉంటుంది, నెలవంక నీల ఉంటుంది, నెల చివరి వరకు ఉంటుంది,  రామ కృష్ణ ఆ ఒక్క రోజులో ఉండిపోయాడు, ఇంకో 29 రోజులు ఉన్నాయి అని నీకు ఇష్టం ఉంటే వాడితో చెప్పు”  అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు

అంకుల్ మాటలు విన్నాక ఇప్పుడు అర్ధం అయింది నాకు అసలు రామ కృష్ణకి ఇన్ని మాటలు ఎలా వచ్చాయీ అని, ఆచ్చం అంకుల్ లాగా చాల తెలివిగా మాట్లాడుతాడు రామ కృష్ణ కూడా, ఎందుకు అంటే, Indirect గ నన్ను, రామ కృష్ణ ని పెళ్ళి చేసుకుంటావా ? అని అడిగారు, ఎలా అంటే రామ కృష్ణ తగ్గిపోకుండా, నేను ఇబ్బంది పడకుండ. అసలు ఎంత అందం గ అడిగారు, ఒకరు ఇబ్బంది పడకుండా మాట్లాడాలి అంటే బాధ విలువ తెలిసి ఉండాలి, అలంటి వారే మనస్సు నొచ్చుకోకుండా మనస్సు మెచ్చుకునేలా మాట్లాడుతారు.

ఒక ఆడపిల్లకి ఎటు వంటి అబ్బాయి భర్తగా కావాలి అనే ప్రశ్నకి సమాధానం అంత సులువుగా దొరుకుతుందా ? నిజానికి ఆ ప్రశ్నకి, ఆడపిల్ల ఎదిగే చుట్టు పక్కల వాతావరణంకి గట్టి సంబంధం ఉంటుంది, ఉదాహరణకి ఒక అమ్మాయికి చిన్న తనం నుంచి తండ్రి లేకపోతే, ఆ ప్రేమ వచ్చే భర్త తనపై చూపించాలి అనుకుంటుంది, అలాగే ఒక్కోక్క అమ్మాయి జీవితం ఒకలాగా ఉంటుంది, వచ్చే భర్త ఆ లోటు పాటులను గమనించి, సైనికుడిలా సరిచేసి ఆ కోరికను అమ్మాయికి సొంతం చేసే వేళ, ఆ సైనికుడు సేద తీర్చడానికి సరసం అనే సామ్రాజ్యానికి ఉన్న ప్రేమ తలుపులని తెరుస్తుంది, ఇది ఒక రకమైన సృష్టి ధర్మం, చెట్లకి, నదికి ఉన్న సంబంధం లాంటిది. ఆ బంధానికి మనం పెట్టుకునే పేరులు అనేకరకాలు, పెళ్ళి, కాపురం, కలసి జీవిచడం, కష్ట సుఖాలు పంచుకోవడం లాంటివి. మరి రామ కృష్ణ నేను చేసిన తప్పును క్షమించి సరిచేస్తాడా అని ఆలోచనలో పడి ఉన్న నాకు పొద్దు పోతున్న సమయంలో, రామ కృష్ణ మదర్ నాతో, “రేపు గుడికి వెళదాం అనుకుంటున్న, నువ్వు కూడా వస్తావా అని అడిగారు, నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే వస్తా ఆంటీ అని చెప్పేసాను, ఎంతో ఆతృతగా, నా ముఖంలో ఆతృత చూసి ఆంటీ చిన్నగా నవ్వుకున్నారు, అప్పుడు నేను ఆంటీతో, అంటే ఆంటీ నాకు గుడి అంటే ఇష్టం అని ఏదో కవర్ చేశాను, నిజానికి ఆంటీతో మాట్లాడితే రామ కృష్ణ గురించి కొంచం తెలుసుకోవచ్చు అని నేను అంత ఆతృత పడ్డాను.

మరుసటి రోజు తెల్లవారు జామున నేను లేచి రెడీ అయి, కార్ లో రాధ వాళ్ళ ఇంటి నుంచి రామ కృష్ణ ఇంటికి వెళ్ళాను, ఇళ్లు చాల పెద్దది, విల్లా అనుకున్న కానీ పెద్ద కోట ల ఉంది ఆ ఇల్లు, అప్పుడు అనిపించింది నాకు, ఈ ఇంటికి కోడలు అంటే యువ రాణి ల మసలుకోవాలి అని. నేను రామ కృష్ణ స్థాయికి  సరిపోతానా అని మొదటి సారి అనిపించింది ఎందుకు అంటే విన్న వైభవం కన్న వీక్షించే వాస్తవానికే విలువ ఎక్కువ కాబట్టి,  నాలో నేను ఏదో ఆలోచించుకుంటూ అడుగులో అడుగు వేస్తూ లోపాలకి వెళ్ళాను, హాల్ లో ఆంటీ ఉన్నారు, పని వాళ్లకి ఏదో తీసుకొని రమ్మని చెపుతూ, నా వంక చూస్తూ “అరే రుక్మిణి వచ్చేసావా, నేనే  వచ్చి, నిన్ను పిక్ చేసుకుందాం అనుకున్న, సరే సరే వచ్చేసావుగా, ఒక్క 10 నిముషాలు, స్టార్ట్ అవుదాం అని చెప్పారు, నేను హాల్ లో ఉన్న ఫొటోస్ ఇంకా అవార్డ్స్ చూస్తున్న, రామ కృష్ణ, ఇంకా శివ కి బిజినెస్ లో వచ్చినవి, ఇంతలో ఆంటీ నాతో వెళదామా రుక్మిణి అని అన్నారు, సరే ఆంటీ అని చెప్పి, ఇద్దరం కార్ లో స్టార్ట్ అయ్యాం.

దారిలో  నేను ఆంటీ ని అడిగాను, ఏంటి ఆంటీ సడన్ గా టెంపుల్ కి వెళదామన్నారు అని అడిగాను, రామ కృష్ణ ఆరోగ్యము అంత చక్కబడిపోతే, గుడిలో అన్నదానం చేస్తా అని మొక్కుకున్న రుక్మిణి, అందుకే అక్కడ పనులు అన్ని మన వాళ్ళ చూసుకుంటున్నారు వంటలు దగ్గర ఉండి వడ్డిద్దాం అని వెళదాం అనుకున్న, నాకు తోడుగా నువ్వు ఉంటే బాగుంటుంది అనిపించి పిలిచాను అని చెప్పారు, ఇద్దరం గుడికి రీచ్ అయ్యాం, చాల మందికి అన్నదానం చేసారు, అంత అయ్యేటప్పడికి మధ్యాహ్నం 2:00 అయ్యిOది, ఇద్దరం కాసేపు గుడిలో కూర్చున్నాము, మా మాటలు ఇలా సాగుతున్నాయి.

ఆంటీ: చాల ఓపిగ అని పనుల్లో ఇన్వల్వ్ అయ్యావు ఈ రోజు రుక్మిణి నువ్వు.

రుక్మిణి: దేవుడి పనులు కదా ఆంటీ, వద్దు అన్న కూడా ఓపిక వచ్చేస్తుంది.

ఆంటీ: నా  రామ కృష్ణుడు జీవితం లో అదే ఓపిక లేక ఒక అమ్మాయి వెళ్లిపోయింది, నా రామ కృష్ణుడుని ఒంటరి వాడిని చేసి.

రుక్మిణి : ఓపిక  లేక  వెళ్లిపోయింది అని మనం అనలేము ఏమో ఆంటీ, ఇంకొకరితో ఉండలేక వెళ్ళిపోయింది ఏమో అని కూడా అనవచ్చు అనుకుంటా ఆంటీ.

ఆంటీ: ఒకరు ఇష్టం ఉంటే, వాళ్ళ గత గమ్యంలో ఉన్న పరిచయాలను పాటించుకోరు అని నిన్ను చూసాకే అర్ధం అవుతుంది.

రుక్మిణి: ఇష్టం ఉంటే అర్ధం చేసుకుంటారు, కానీ అర్ధం చేసుకోవడం ఆగిపోతే, అలుసు అయిపోతారు. అదే ప్రేమిస్తే, పట్టించుకోరు, పరిగణణలోకి తీసుకోరు. పరిగణణలోకి తీసుకొని ప్రయాణాలు ఎన్ని ఉన్నా లేనట్లే.

ఆంటీ: మనస్సు మార్చుకున్న మనిషిని, 

           మాట వినని వ్యక్తికి, 

           మార్చడం, మందలించడం కన్నా మరిచిపోవడమే మంచిది.

రుక్మిణి: రామ కృష్ణ మీద ప్రేమ పెంచుకోవద్దు అని చెపుతున్నారా ఆంటీ … ?

ఆంటీ: పెంచుకున్న ప్రేమ, అభిమానంగా మార్చుకోమంటున్న, ఎందుకు అంటే రామ కృష్ణ గురించి నాకు తెలుసు కాబట్టి. నీతో గడిపిన మూడు రోజులు, మాట్లాడిన నాలుగు మాటలు అన్ని నీతో కాదు, వాడి మనస్సులో మిగిలిపోయిన రూపంతో, అందుకనే, చెపుతున్నాను రుక్మిణి నువ్వు బాధ పడతావు ఏమో అని ముందే తెలియజేస్తున్నా.

రుక్మిణి: మనుషులు కలవడానికి కారణాలు చాల రకాలు, రూపం, అవసరం, ఇష్టాలు, etc.. అన్నిటిలో ఎక్కువ ఓట్లు పడేది రూపానికే, నా రూపం ఎలాగో  రామ కృష్ణ మనస్సులో ఉంది, ఇంకా నేను ఆ మనస్సుకి నచ్చినట్టు మసులు కోవడమే మిగిలింది ఆంటీ, మగవాడి ఇష్ట ప్రకారం నడుచు కోవడం అంటే సర్వస్వం వదులు కునట్టు కాదు, అతనికి సర్వస్వం మనమే అయినట్టు. ఆడదాని మౌనంలో ఉన్న కన్నీరు మాటని అర్ధం చేసుకునే మగవాడు, మగవాడి మొరటు మాట వెనుక ఉన్న బాధని అర్ధం చేసుకున్న ఆడది, ఒక జంట అయితే, జీవితానికి బ్రతకాలి అనే కోరిక వస్తుంది ఆంటీ.

అని నేను చెప్పగానే, ఆంటీ నన్ను గట్టిగా హత్తుకొని నాతో ““స్వార్ధంతో అడుగుతున్నానో, లేక తల్లీ ప్రేమ చంపుకోలేక అడుగుతున్నానో నాకు తెలియదు కానీ, రామ కృష్ణ ని వదిలి వేళ్ళకు రుక్మిణి, వాడి చిరునవ్వుకు నీ పరిచయం ప్రాణం పోసింది”” అని అంటూ కంట తడి పెట్టుకున్నారు.

రెండు రోజుల తరవాత,రామ కృష్ణ ని చూడచ్చు అని  డాక్టర్ చెప్పారు, అందరం హాస్పిటల్ కి వెళ్ళాం,  రెండు రోజుల ముందు శివ, మాట్లాడాడు రామ కృష్ణతో, ఇప్పుడు అందరం కలిసి చుడ్డానికి వెళ్ళాం, రామ కృష్ణ అందరిని చూస్తూ, శివని ముందుకు రమన్నాడు, శివ ముందుకి వెళ్ళాడు, అప్పుడు రామ కృష్ణ, శివ ని అడిగాడు… “ ఆక్సిడెంట్ చేపించింది ఎవరో కనుక్కోమన్నాగా.. తెలిసిందా.. ఎవరో ?” అని.

To be continued on 6th Dec 2024

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.8 5 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments