HOME

7 వ అధ్యాయము

ప్రేమిస్తాడా…!?

రామ కృష్ణ అడిగిన ప్రశ్నకి, శివ చిన్నగా నవ్వుతూ, ఆక్సిడెంట్ చేపించింది ఎవరో కాదు, రాధ వాళ్ళ అన్నయ్య అని చెప్పాడు. రామ కృష్ణ అడిగాడు శివ ని , “ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు కొట్టలేదుగా వాడిని… ?” శివ  అంటున్నాడు “పట్టుకున వెంటనే కొట్టలేదు, అలా అని ప్రాణం పోయే అంతలా కొట్టలేదు, బ్రతికే ఉన్నాడు, భోజనం పెట్టి వచ్చాను” అది విన్న రామ కృష్ణ “నువ్వు వాడిని కొట్టడంలో నాయ్యం ఉంది వాడు ఆక్సిడెంట్ చేపించడంలో పగ ఏం లేదు కానీ కోపం ఉంది అంతే, కోపం తీరేటట్టు చెపితే మనస్సు మారుతుంది, వాడిని వదిలెయ్” అని చెప్పి శివ ని పంపించేశాడు, అంతే ఇంకా ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్టాడలేదు అంత వయస్సు వచ్చిన అంకుల్ కానీ, అంత బాధ పడిన ఆంటీ కానీ ఎవరు ఏమి మాట్టాడలేదు, ఒకరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నిలబడి ఉండటం అంటే ఏంటో వాళ్ళ మౌనం నాకు అర్ధం అయ్యేల చేసింది. వయసుకొచ్చి, బాధ్యతలు తీసుకునే పెద్ద కొడుకు అంటే ఇంటి యజమాని బరువు తీసుకోవడం లేదా అదమాయించడం  కాదు, పరిస్థితులను బట్టి పాదం ముందుకు సాగాలి, తనతో ఉన్న వారిని అదుపు చేయడం కాదు, ఆపద రాకుండా చూసుకోవాలి అని, ఆ నిమిషం రామ కృష్ణని ఇంకా  వాళ్ళ ఫామిలీ ని చూసాక అర్ధం అయ్యింది.

 మహాసముద్రం అంత లోతు అనుభవం ఉన్న తండ్రి.

ఆప్యాయత అంతటా ఉండే ఆకాశం లాంటి అమ్మ.

అల్లరి చేయడానికి, ఆపద వస్తే ఆవేశంగా ముందుకు వెళ్ళగలిగే అలాంటి తమ్ముడు.

వాళ్ళని వదలకుండా నాలుగు వైపులా ఉండే ఒడ్డు లాంటి పెద్ద కొడుకు ఎంత  అందమైన  ఫామిలీ కదా.

 రామ కృష్ణతో అందరూ మాట్లాడారు ఇంకా ఒక్క వారంలో discharge అయిపోవచ్చు అని చెప్పారు, కష్టాలు సుఖాలు చూసే రెండే రెండు చోట్లు ఏంటి అంటే గుడి ఇంకా హాస్పిటల్ ఏమో. మధ్యాహ్నం diet lunch నేను తీసుకొని వెళ్ళాను రామ కృష్ణ కోసం, ఎవరు లేరు రూమ్ లో, మా  మనస్సులు ఇంకా మౌనానికి  ముగింపు చెప్పి, మాటలు మొదలయ్యాయి ఇలా.

రుక్మిణి: ఏంటి రూమ్ అంత డార్క్ గ పెట్టుకున్నావ్ ? 

రామ కృష్ణ: వెలుగుకి విలువ ఇచ్చేది చీకటి చేరాకనే కదా!

రుక్మిణి: చెప్పింది కరెక్ట్ ఏ, కానీ వెలుగు విలువ తెలియాలి అంటే చీకటి చెరిగిపోవాలి కదా.

రామ కృష్ణ: కాదు అని నేను అనటం లేదు, వెలుగు విలువ తెలుసుకోవాలి అనుకున్నపుడు   విలువైన వ్వక్తులు మన వెంట ఉండాలి అనుకుంట ?

రుక్మిణి: అవును విలువైన వ్వక్తులు లేనప్పుడు, వెలుగుకి విలువ ఉండదు, కానీ చీకటి వెనుక వెలుగులు అనేకరకాల ఒకటి వెళ్ళిపోయింది అని ఉండి పోతే నిండు చందమామని చూడగలమా, నెల వంక దగ్గరే నిలిచిపోవలసి వస్తుంది. 

రామ కృష్ణ: చెప్పింది చాల బాగుంది, చీకటిని చెరుపు అయితే.

రుక్మిణి: ఇదిగో నీ మనస్సు తలపులకి, ఈ తలుపులకి curtains తీస్తే చాలు, వెలుగు నీ ముందే ఉంటుంది నువ్వు చూడాలి అంతే.

రామ కృష్ణ: బానే చెపుతున్నావ్, ఆకలి వేస్తుంది, అమ్మ ని పిలు తినిపిస్తుంది.

రుక్మిణి: చేయి విరిగిన కూడా ఆటిట్యూడ్ ఏం తగ్గలేదు, ఫుడ్ ఎవరు తీసుకొచ్చారు నేనేగా,  నేనే తినిపిస్త ఆగు.

రామ కృష్ణ: రాముడికి తినిపిస్తున్నావా ? కృష్ణుడికి తినిపిస్తున్నావా?

రుక్మిణి: రాముడిలా ఒకటే సీత అని చెప్పి, కృష్ణుడిలా అందరిని ఆకట్టుకునే రామ కృష్ణ కి తినిపిస్త.

రామ కృష్ణ: సమాధానం తోనే ఆకలి తీర్చేలా ఉన్నావ్, సరేలే తినిపించు.

రుక్మిణి: good, మంచి వాడివే కాకపోతే చాలా మొండి వాడివి, సరే నిన్ను ఒకటి అడగాలి, అడగమంటావా?.

రామ కృష్ణ: వద్దు అన్న కూడా వినవుగ, పోనీ నేను ఇక్కడి నుండి వెళ్లిపోదాం అన్న కూడా వీలు అవదు, ఇంకా ఎందుకు లేటు అడుగు.

రుక్మిణి: అంటే….  నీకు.. ఇంకా…..

రామ కృష్ణ: అంత లాగకు, ఏంటో అడుగు..

రుక్మిణి: అంటే, నీకు ఇంకా రాధ కి మధ్య ఏమైనా romance అయ్యిందా అని !?.

రామ కృష్ణ: అనుకున్నా, నువ్వు అంత లెన్త్ లాగినప్పుడే అనుకున్న, ఇలాంటిది ఏదో ఒకటి అడుగుతున్నావు అని.

రుక్మిణి: అబ్భా చెప్పచు గా..?

రామ కృష్ణ: అంటే ఏదో ఉందిలే, నీకు క్లియర్ గా  కావాలి అంటే 1st Session లో 8th Chapter చదువుకో.

రుక్మిణి: నాకు ఎందుకులే, readers కి ఒక మంచి Pure romantic చాప్టర్ చదవాలి అంటే చదువుతారు, సరే కానీ రామ కృష్ణ నిన్ను సీరియస్ గా ఒకటి అడగాలి అడగొచ్చా?.

రామ కృష్ణ: అన్నం పెట్టడానికి వచ్చినట్టు లేదు, అనుమానాలు తీర్చుకోవడానికి వచ్చినట్టు ఉంది నిన్ను చూస్తుంటే, సరే అడుగు.

రుక్మిణి: ఎందుకు అని, రాధ  వాళ్ళ అన్నయ్య ని  ఏం అనద్దు అని చెప్పావ్, నిను చంపుదాం అనుకొని ఆక్సిడెంట్ కూడా ప్లాన్ చేసి అమలు చేసాడు, అయినా కూడా వాడిని వదిలేసావ్ ఎందుకు?

రామ కృష్ణ: ఏ మనిషి అయినా ఎవరీకైన హాని తలపెట్టాడు  అంటే, పగ వల్ల కాదు, తాను ఇష్ట పడిన విషయంలో అన్యాయంమో, అపాయమో  వచ్చినప్పుడే, ప్రాణానికి ప్రాణంగా ఇష్ట పడిన తన చెల్లి చావుకి కారణం నేనే అని అనుకున్నాడు, ఈ రోజు అదే పోలికలు ఉన్న ఇంకో అమ్మాయితో సంతోషం గా ఉన్నాను అంటే కోపం వచ్చి ఉంటుంది, అందుకే అంటారు కోపంలో ఇంకా సంతోషంలో నిర్ణయాలు తీసుకోకూడదు అని. నేను వాళ్ళ అన్నయ్యతో తరువాత మాట్లాడుతా, తనకి అర్ధం అయ్యేలా !

రుక్మిణి: నీ ఆలోచనలు, నువ్వు అర్ధం చేసుకునే విధానం చాలా కొత్తగా ఉంటుంది నాకు ఎప్పుడు, ఇంకా ఒక last question, ఇంకా ఏమి అడగను ఇది ఫైనల్ please please చెప్పు.

రామ కృష్ణ: సరే ఇదే ఫైనల్ ఇంకా, అడుగు.

రుక్మిణి: ఎందుకు నీకు రాధ  అంటే అంత ఇష్టం ఎందుకు, అసలు ఏం ఉంది తనలో.

రామ కృష్ణ: *చిరు గాలి ఎప్పుడు తన చెంత ఉంటుంది ఆ స్వచ్ఛమైన మనస్సుకి ఉక్కపోత రాకూడదు అని, 

*వెలుగు ఎప్పుడు ఆమె వెంటే ఉంటుంది ఆమె కనులలో కాంతిలా కొలువు ఉందాం అని,
*పచ్చటి పైరగాలి పక్షులని పలకరిస్తూనే కూడా మౌనం గానే ఉంటాయి, తన పలుకులు విందాం అని

*కష్టం అనే మాట ఆమె కనుసైగలో కూడా ఉండదు, పట్టుదలతో కష్టాన్ని కరిగించి ప్రశాంతతని పంచుతుంది.

*అర్ధం చేసుకోవడంలో సీత మ్మతల్లీ కన్నా గొప్పది, ఆట పట్టించడంలో సత్యభామ కన్నా చలాకి అయినది,
* నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన పిచ్చిది.

* డబ్బు పొగరు లేని యువరాణి, ఇష్ట పడింది దక్కించుకోవాలి అనుకునే మహారాణి. 

*ఇష్టం అని చెపుకోకుండానే ఒకటై నిలిచాయి ఇద్దరి మనస్సులు. ఒకటై నిలిచాము అని పెద్దలకు చెప్పిన వేళ ఇద్దరం ఒకే లోకం లో నీలాలేకపోయాం. ఎంత ఇష్టం ఉంటే ఏం ఉంది, తన చావుకి నేను చిరునామాగా, నా చిరునవ్వు తీసుకొని వెళ్ళిపోయిన ప్రేయసిగా  మిగిలిపోయాం విడి విడి గా, భూమి ఇంకా ఆకాశం మాదిరిగా, కలవలేని బంధం అయిన కావాలి అనుకున్న అనుబంధం మాది
రుక్మిణి: ఇంత బాధ పెటుకున్నావ్ గా మనసులో, చాల మంది అబ్బాయిలు అమ్మాయి దూరం అయిపోతే, చెడు అలవాట్లు చేసుకుంటారు, మరి నువ్వు డ్రింక్ కూడా చేయవు ఎందుకు.

రామ కృష్ణ: మనస్సున మనశ్శాంతి లేని మనిషికి అలవాట్లు అంటితే, అంతమే తీరం అవుతుంది. కన్న తల్లికి కడుపుకోత మిగులుతుంది అందుకే అలవాటు చేసుకోలేదు.

అని చెప్పుకుంటూ వచ్చాడు రామ కృష్ణ, ఏ అబ్బాయిని  అయినా తాను ప్రేమించే అమ్మాయి ఎందుకు ఇష్టం అని అడిగినపుడు, అమ్మాయి అందం కోసం చాల చెప్తారు, కానీ రామ కృష్ణ మాత్రం రాధ  అందం గురించి అణువంత కూడా ప్రస్తావన తీయలేదు, పరువానికి పాన్పుకి ముడి వేసి ప్రేమ అనుకొని ముందుకు వెళుతున్న ఈ రోజుల్లో, ప్రాణానికి మనస్సుకి ముడివేసాడు వీడు, రామ కృష్ణ ఇంతలా ప్రేమించడానికి రధా అంత అలా ఏం చేసింది, రామ కృష్ణ వాళ్ళ అమ్మ గారు చేప్పినట్లు నేను రాధ లా ఉన్న కాబట్టి నాతో మాట్లాడుతున్నాడా ?, అదే నిజం అయితే, ఆక్సిడెంట్ అవడానికి నేను కూడా సహాయపడ్డాను అంటే అసలు రామ కృష్ణ నన్ను ప్రేమిస్తాడా…? ప్రేమించగలడా…! 

To be Continued on 14th  Dec 2024

                                                                                                        Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments