నేను అసలు ఎందుకు రామ కృష్ణ ని తప్పుగా అర్ధం చేసుకొని, ఆక్సిడెంట్ అవడానికి help చేశాను, ఏంటో నాకు ఈ పరిస్థితి ఉక్కిరి బిక్కిరిగా ఉంది. హాస్పిటల్ లో తాను జాయిన్ అయినప్పటి నుండి తన చుటూ జరిగిన సంఘటనలు తన గురించి నాకు చెపుతున్నాయా..?, ఇలాంటి మంచి మనిషికి ఆపద రావడానికి నువ్వు ఒక కారణం అని చూపిస్తున్నాయా..? లేక రామ కృష్ణని నేను ప్రేమించడానికి కారణాలుగా, న నా కంటికి కనపడుతున్నాయా..? అర్ధం కావటం లేదు కానీ, ఒకటి నిజం, నేను రామ కృష్ణని మోసం చేశాను. ఇష్టం అయినా వారి ముందు నమ్మకం కోల్పోవడం అంటే, బిడ్డకి తల్లి ప్రేమ కోల్పోయినట్లే, మరు తల్లి వచ్చిన, మరోసారి నమ్మిన, ఆ నమ్మకానికి అనుమానం అనే ఆలోచన అర్ధాంగిగా జీవిత కాలం జీవిస్తూ ఉంటుంది.
రామ కృష్ణ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాడు, కాలం చాలా కంగారుగా కదులుతుంది కారణం ఏంటో అని కనుక్కుంటే రామ కృష్ణ గాయాలు పూర్తిగా తగ్గడానికి అని చెపుతోంది కాలం. కంప్లీట్ గ రామ కృష్ణ రికవర్ అయిపోయాడు, చెప్పాలి అంటే రామ కృష్ణ చాలా స్మార్ట్ ఇంక అందంగా కూడా ఉంటాడు, సూటిగా చూసే చూపుతో, కోపం వస్తే కనుబొమ్మలమీద కోపాన్ని కప్పుతూ, ఓర్పుతో సమాధానం చెప్తాడు, సూర్యుడు కిరణాల వంటి పొడవాటి ముక్కు, ఆడపిల్ల మనస్సు అర్ధం చేసుకునే మగవాడి మనస్సు, ఎటు వంటి మగవాడితో అయినా దమ్ముగా పోటీ పడే మొగతనం, నన్ను ముందు పెట్టుకుంటే సిగ్గుతో ఎరుపు ఎక్కి న బుగ్గకి, ఇంక ఎరుపు రంగు రావాలి అని గుచ్చుకునే గెడ్డం, గుండె బరువు మోసి గట్టిపడిన భుజాల బలంతో, ఆరు అడుగుల మేధావి వాడు, ప్రేమకి పూల తోట అయి పుడమి వాడే, పోటీకి పోతే ప్రాణాలు వదిలే యుద్ధపు పుడమి వాడే, ఇలాంటి వాడిని ఎవరు వదులుకుంటారు, కేవలం అతని గురించి తెలియని వారు, తెలుసుకోలేని వారు తప్ప. ఆక్సిడెంట్ అవడానికి నేను కూడా ఒక కారణం అని రామ కృష్ణ తో చెప్పి, Paris రిటర్న్ అయిపోదాం అనుకుంటున్న, అంతలో రామ కృష్ణ నుంచి కాల్ వచ్చింది, ఇంటికి రమ్మని.
ఎందుకు రమ్మన్నాడు అని ఆలోచనతో, నేను రామ కృష్ణ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో అందరూ మాట్టాడుకుంటున్నారు ఫ్యామిలీ ట్రిప్ అని, చాల హ్యాపీగ ఉన్నారు, అలాంటి సమయంలో నేను ఆ నిజం చెప్పడం కరెక్ట్ అనిపించలేదు, నేను సైలెంట్ గ ఉన్నాను, వాళ్ళ మాటలు వింటూ, ఫైనల్ గ మనాలి వెళదాం అని ఫిక్స్ అయ్యారు, అప్పుడు నేను రామ కృష్ణతో నేను Paris కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రేపు అని చెప్పాను, “నువ్వు కూడా మాతో పాటు ట్రిప్ కి రమ్మని చెపుదాం అనుకొని పిలిచాను, possible అయితే రావచ్చుగా” అని నా కనుల వంక చూస్తూ అడిగాడు రామ కృష్ణ. నిజానికి రామ కృష్ణ చూపులు చాల సూటిగా ఉంటాయి, తన కనులను చూస్తే, పెదవులతో పిలిచినా కూడా, కనులతో రావచ్చు కదా అని ఆశ కనపడింది, నేను ఇంకా నో చెప్పలేకపోయాను సరే వస్తా అని అందరం మనాలి రీచ్ అయ్యాం.
వెళ్ళింది డిసెంబర్ లో కాబట్టి మంచు బాగా పడుతుంది, ఆంటీ ఇంకా అంకుల్ అయితే మళ్ళీ యంగ్ ఏజ్ లోకి వచ్చేసారు, మంచు కొండల మద్య, మనస్సుకి నచ్చిన వాడితో నా మనస్సు ఉషారుగా ఉరకలు వేస్తుంది, కానీ కొన్ని ఆలోచనలు నన్ను ఆపేస్తున్నాయి, మనాలి అంత చూసాం చాల సరదాగా నాలుగు రోజులు గడిచిపోయాయి, ఒక రోజు రామ కృష్ణ Kheerganga Trek వెళదాం అని అందరితో అన్నాడు, కానీ ఎవరు ఒప్పుకోలేదు, ఆంటీ వాళ్ళు మా వయసుకి అంత చలికి ఉండలేము అని, శివ ఏమో వాళ్ళ అబ్బాయి చిన్న పిల్ల వాడు కాబట్టి కోల్డ్ ఇష్యూస్ వస్తాయి అని అంటున్నాడు, అప్పుడు అంకుల్ అన్నారు, నీకు మరి అంతగా వెళ్ళాలి అంటే రుక్మిణిని అడుగు, వస్తా అంటే తీసుకొని వెళ్ళు, లోకల్ గ మేము చూడవలిసిన దేవాలయాలు కొని ఉన్నాయి వాటికి మేము వెళ్తాము అని అంటున్నారు. రామ కృష్ణ కి నిజం చెప్పడానికి నాకు కొంచం టైం దొరికింది అని నేను అనుకున్నాను. మరుసటి రోజు తెల్లవారుజామున స్టార్ట్ అయ్యాం నేను ఇంకా రామ కృష్ణ, అందని తేలని ఆకాశం లాంటి మంచు మా చుటూ, రామ కృష్ణ మనసుల ఉంటే, భరించలేని చలి నాలో ఉన్న నిజంలా నా వైపు వీస్తుంది. Kheerganga స్టే లొకేషన్ కి వెళ్ళాం, మధ్యాహ్నం భోజన సమయానికి కొంచం రెస్ట్ తీసుకొని view చూడ్డానికి వెళ్ళాం, కష్టంగ ఉన్న, ఇష్టంగ ఉండాలి అనిపించే చల్లని గాలి, ప్రతిఒక్కరిలో పసిమనస్సుని ముందుకు తెచ్చే మంచు వర్షం, సూర్య కిరణాలకి కరుగుతూ ఉన్న బంగారపు రంగు మంచు కొండలు, వాటి మధ్య సిగ్గుపడుతూ వచ్చి పోయే సూర్య కిరణాలూ, అన్నం బదులు ఆలు పరాటాలు, మా అమ్మాయిల అందమైన నడుము ఒంపులకన్నా అందంగా ఉన్న దారి మలుపులు. చంద్రుడికి Hi చెప్పడానికి సాయంకాలం సిద్ధంగా ఉంది, నక్షత్రాల మధ్య నల్లని ఆకాశం ఉంది ఏమో అన్నట్టు ఉంది ఆకాశం. ట్రెక్ కి మాతో పాటు ఇంకో మూడు రాండమ్ జంటలు జాయిన్ అయ్యారు అందరూ కలసి క్యాంపు ఫైర్ వేశారు, కొంత మంది పాడుతున్నారు, కొందరు డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, రామ కృష్ణ మాత్రం ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు, అందరూ అడిగారు రామ కృష్ణని ఏం రాస్తున్నావ్ బ్రో అని, రామ కృష్ణ మాత్రం నవ్వి సమాధాం ఏం చెప్పలేదు, అప్పుడు నేను అన్నాను రామ కృష్ణ కవితలు రాస్తాడు అని, అందరూ ఇంకా గోల చేసి ఒక్క కవిత చెప్పమన్నారు అదికూడా రొమాంటిక్ గ నా మీద, వాళ్ళు అందరు మేము couples అనుకుంటున్నారు, నేను అయితే రామ కృష్ణ ఏం కవిత చెప్పడు ఏమో అనుకున్న కానీ, అతని కవిత మంచు వర్షం ల నెమ్మదిగా మొదలు అయింది.
*ఇంధ్రధనస్సుని నీ నడుము ఒంపులో ఒదిగి ఉంచే సొంపులు నీవి…
*నలుపు రంగుని రాణించే రాత్రితో, చెలిమి చేసే కురులు నీవి….
*ఐదు న్నర అడుగుల తనువులో తేనె దాచిన దేహం నీధే…
*వడ్డించే పరువాలను పైట వెనుక పొదుపు చేసిన పరువాల పాల పిట్టా నువ్వే…
*అగ్నిపర్వతం అసూయ పడే అంత మెడఒంపునే వేడి వయ్యారం నీదె…
*హృదయానికి ఊరట కలిగించే, కౌగిళ్ళ కోట ఉన్న నిండు కన్య మనస్సు నీది…
*భూదేవి అందాల బరువుల కన్ననీ నిశ్వాస ఉచ్చ్వాస బరువుల మధ్య స్వేదానికి ఉన్న బరువే ఎక్కువ.
అని చెపుతూ, నా కనుల వంక సూటిగా చూస్తూ చిన్నగా నవుతున్నాడు రామ కృష్ణ, నాకు చాలా సిగ్గు వేసింది. ఆడదాని అందాలు పొగడాలన్న హద్దులు తెలుసుకొని అక్షరానికి అందం అలంకరించాలి అని తెలిసి ఉండాలి, ఆ విషయం రామ కృష్ణ కవిత కి బాగా తెలుసు అని అర్ధం అయింది, ఇంతలో మా రూమ్ stay maintenance person వచ్చి “sir, మీ రూమ్ హీటర్ ఉన్నట్లు ఉండి పనిచేయటం లేదు, హీటర్ లేకుండా ఆ వుడ్ స్టే లో చాల కష్టం, మీకు టెంట్ ఆరెంజ్ చేస్తాను అని చెప్పాడు, రామ కృష్ణ నా వంక చూసాడు, ఆ చూపుకి “నీకు సరే నా..? ” అని అడిగినట్టు అనిపించింది, నేను ఆ maintenance పర్సన్ తో మరి టెంట్ లో చలి వెయ్యదా..? అని అడిగాను, అతను “అంత వెయ్యదు మేడం అని నవ్వుతూ” చెప్పాడు, ఆ నవ్వుకి అర్ధం నాకు అర్ధం కాలేదు సరే అని, డిన్నర్ చేసి పడుకోడానికి వెళ్ళాం, టెంట్ టాప్ లో transparent గ ఉంది, చంద్రుడు వెలుగులో నక్షత్రాలు మా వంకే చూస్తునట్టు అనిపిస్తుంది. అంతుపట్టని ఆశతో వాడు ఉంటే, ఎప్పుడు చెంతకు వస్తాడో అని అంతుపట్టని ఆనందంలో నేను ఉన్న, నా ఆలోచనలు ఎంత అల్లరిగా ఉన్నాయో ఒక్క ఆడపిల్ల మనసుకే అర్ధం అవుతాయి, నా వయస్సు వేడిని వెలిగించడానికి వాతావరణం వద్దకు వచ్చింది కానీ, వాడి వెచ్చని స్పర్శ తోనే స్పOదిస్తాను అని చెపుతోంది నా ఆడతనం. నా మనస్సులో మాట విన్నది ఏమో మంచు వర్షం, -4 °C కి వాతావరణం తీసుకొని వెళ్ళి నన్ను వణికిస్తుంది, నన్ను చూసి హత్తుకున్నాడు రామ కృష్ణ, ఆశ ఆవిరిగా ఊపిరి వదులుతూ మంచుగ మారుతూ మా ఇద్దరిని ఇంకా దగ్గర చేసింది, రామ కృష్ణ వెచ్చటి కౌగిలికి, నా మెడ ఓంపున వేడి తోడు అయి ఇద్దరి కొత్త కోరికలకు నా కురులతో కప్పి, కాస్త నిధానించాము, నా గుండె చప్పుడు వేగానికి, వేగంగా వీచే గాలి కూడా విశ్రాంతి తీసుకునేలా ఉంది, అంతలో రామ కృష్ణ నన్నుఇంకా దగ్గరగా తీసుకున్నాడు, తన కండ్లలో ఉషారు నా ఊపిరిని ఉప్పెణల పొంగిస్తుంది, నిశ్వాస ఉచ్ఛ్వాసాలకు తప్ప మా తనువుల మధ్య మలుపుల రేఖకి కూడా చోటు లేదు, నా అందాలను ఏలుకోమని నేను, నా పరువాలను ప్రేమతో పంచుకుందాం అని తాను, మా మధ్య విరహాలు పొంగుతూ, మొహమాటాలు మంచులా కరుగుతూ, నా సిగ్గుని చిన్నగా తన మగతనానికి ముడివేసి మరిచిపోయి, ముందుకు ముందు పెట్టడానికి వెళ్ళాను, అప్పుడు రామ కృష్ణ నాతో “పరువాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఆడది, పరువం పంచి ఇవ్వడానికి సిద్దపడింది ఈ రోజు, మరి ఆ రోజు నా ప్రాణం తీయడానికి ఎందుకు ప్రయత్నించిందో మరి””, అని అన్నాడు రామ కృష్ణ నాతో. To be Continued on 27th Dec 2024
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta