కలిసిన మనస్సులను, కాలం కలుపుతుందో, కలపలేక కన్నీళ్లను వర్షంలా కురిపిస్తుందో అంటూ కదులుతున్న కథ ఇది.
రాత్రి 3:00 గం అయ్యింది, వర్షం పడుతోంది, ఫ్యాను గాలిని గెంటేసేలా చల్ల గాలి గది లోకి గుడచారిలా మెల్లగా వచ్చింది, ఒక కాలు దుప్పటిలో, మరో కాలు బయట, ఈ సరదాకి వయస్సుతో పని లేదు ఏమో అనుకుంటు, ఇంతలో కాఫీ పెట్టుకొని, చల్ల గాలితో చల్లార్చుకుంటూ తాగుదాం అనుకోని, కాఫీ పెట్టుకొని కూర్చున్నా. టైం 4:00 గం కావస్తుంది, నాన్న లెచారు “ ఏంట్రా ఈ టైమ్ లో లెచి కాఫీ తాగుతునావ్, చదువుకొవచ్చుగా, 10వ తరగతి పరీక్షలు ఇంకో రెండు నెలలో ఉన్నాయ్” అంటు, మళ్లీ వెళ్లి పడుకున్నారు, నేను కాఫీ తాగుతు వర్షాన్ని చుస్తు ఉండిపోయా. ఉదయం అయిపోయింది, నాన్న ఏదో ఆలోచనతో రెడీ అవుతున్నారు, డబ్బు పట్టుకొని, బయటకు వెళుతున్నారు, నేను వస్తా డాడీ అంటూ ముందుకి వెళ్ళాను “వద్దు రా నేను వెళ్లి వచ్చేస్తా నువ్వు మార్కెట్ కి వెళ్లి కురగాయాలు తీసుకొని రా ” ఈలోపు అమ్మ వచ్చి “తీసుకొని వెళ్లండి, వాడికి ఎందుకు వెళ్తున్నారో తెలుస్తుంధి” అని అంది, నాకు అర్ధం కాలేదు, కానీ ఏదో నేర్చుకోబోతున్న అనుకోని, ఫాస్ట్ గా రెడీ అయ్యి నాన్న తో పాటు వెళ్ళాను.
నాకు తెలియని కొత్త చోటు, మొత్తానికి ఎవరో ఇంటికి వెళ్ళాము, లోపలకి రమ్మంటు, ఇద్దరికి మంచి నీళ్ళు ఇచ్చారు, నాన్న వాళ్ళకి డబ్బు ఇస్తు ఉండగ మిగిలిన డబ్బు ఎప్పుడు ఇస్తారు అంటూ ఒక ఆంటీ, మధ్య వక్తితో ఆడిగిస్తున్నారు, నాన్న బయటకి కనపడట్లేదు కానీ లోపల చాలా ఇబ్బంది పడుతు బయటకి సమాధానం చెప్తున్నారు, నేను తల దించుకొని ఏం చేయాలో తెలియక నీళ్ళు తాగుతున్నాను, ఈ లోపు అప్పుఇచ్చిన ఆంటీ వాళ్ళ కూతురుని గదిలో నుచ్చి తీసుకొచ్చి, నా కూతురు ఉంగరాలు అమ్మి మరి డబ్బు ఇచ్చాను, ఇంత వరకు ఇవ్వలేదు అంటు గట్టిగ మాట్లాడుతున్నారు, డాడీనీ అలా గట్టిగ కేకలేస్తుంటే నా కంటి నుండి కన్నీరు రాకుండా ఆపడం మొదటిసారి నేర్చుకున్న చోటు అధీ. నాన్న ఏధో సర్ది చెప్పి తొందరగా ఇచ్చేస్తా అని, ఉంటాను అంటూ లేచారు, నేను గ్లాస్ టేబుల్ మీద పెట్టి, ఆ అమ్మాయి వేళ్ళ వంక చూస్తు ఇంట్లో నుంచి బయటకి వస్తు, నా మదిలో ఒకటి అనుకుంన “జీవితం లో ఆప్పు ఎప్పుడు చేయకూడదు అని, అమ్మ అన్న అర్ధం కాని మాట గుర్తుకు వచ్చింది, ఆప్పు చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అని.
బస్టాప్ పక్కనే, వచ్చి బస్ కోసం వేచి చూస్తు ఉంటే, ఇలోపు “అంకుల్ మీ కళ్ళద్దాలు” అని గట్టిగ పిలుస్తూ, ఆ అమ్మాయి వచ్చింది. నేను తన చేతి వెళ్ళను చూసి వదిలేసిన అమ్మాయ్. తల ఎత్తి ఆ అమ్మాయ్ కన్నులని చుసాను, అప్పుడే నెమ్మదిగా వర్షం పడుతోంది, వర్షం వేగంగా పడితే కందిపోయే సునీతమైన సౌంధర్యం ఆమెది, అందుకే వర్షం వేగాన్ని తగ్గించి మెల్లగా తనని తాకడానికి పడుతుంది అనుకుంటూ, చంటి పిల్ల వాడు చందమామ ని చూస్తు ఉన్నటు నేను తన కనులని చూస్తూ ఉండిపోయా, డాడీ కి కళ్ళద్దాలు ఇచ్చి తాను తిరిగి వెళుతున్నప్పుడు, మనస్సుకి ఉరి వేయాలి అంటే తన పొడవాటి జడ చాలు అనుకుంటూ చూస్తుండగా, తన చేతి వేళ్ళ వంక నా కనులు పోయాయి, మనకి అప్పు ఇచ్చి అందనం మీద కూర్చునది వాళ్ళు, అప్పు తీసుకొని కన్నీరు, కనపడకుండా కదులుతున్న కుర్రాడిని నేను. ఇష్ట పడ్డ ధానికి విలువ ఉంటుంది అని ఒకటే తెలిసిన నాకు, ఇష్ట పడాలి అంటే కూడా విలువ ఉండాలి అని ఆ రోజు తెలిసింది.
కాలం విచిత్రం అయినది, మనస్సు బాధ పడెలోపు ప్రయాణాన్ని పరిచయం చెస్తుంది, బస్ వచ్చింది ఒక సీట్ కాళిగా ఉంది, నాన్న నన్ను కూర్చోమని, ఆయన నిల్చునారు, కుర్చున కొడుకు మనస్సులో “నాన్న ఇంకా ఎప్పుడు ఇలా బాధ పడకుండా చేయాలి” అని, నిలుచున్న నాన్న మదిలో “అబ్బాయి బాధ పడ్డాడో ఏమో” అని, కాలం మా మనస్సులని చదువుతున్నట్లు అనిపించి. ఒకే పట్టాలు మీద రెండు రైలు ప్రయాణం ఎలా అని ఇప్పుడే నాకు అర్ధం అయింది.
మొత్తానికి తిరిగి మా ఇంటికి వచ్చాము “ఇద్దరు వెళ్లిపోతే కురగాయాలు ఎవ్వరు తెస్తారు” అని విసుకుంటుంది అమ్మ, వెళ్ళమని చెప్పింది అమ్మే, వెళ్లి వచ్చాక విసుకునేది అమ్మే. నాన్న నవ్వుకుంటూ లోపలికి వచ్చారు, నేను ఈ ఆడవారు ఏంటో అర్ధం కారు అనుకుంటు, నాన్న ఓపికను చుసి అలవాటు చేసుకుంటే మంచిది ఆడవారి విషయంలో అనిపించింది. గడియారంలో సెకన్లు ముల్లులా సాగిపోతోంది కాలం, ఈలోపు 10వ తరగతి పరీక్షలు రానే వచ్చాయి, స్కూల్ లో ప్రిన్సిపల్ నాకు హాల్ టికెట్ ఇచ్చి, నువ్వు అసలు పాస్ అవుతావా ఏంట్రా అన్నటు చుస్తున్నారు. నేను పాస్ అయితే కారణం మీరు మాత్రం కాదు, నా కష్టం వల్ల అని అన్నటు చుస్తున్నాను నేను, అంతలో ఫీజు కట్టని విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వాలి అంటే వాల పేరెంట్స్ ని తీసుకుని రమ్మన్నారు. అలా అయితే నేను కూడా ఫీ డ్యూ ఉన్నా కదా అని, ప్రిన్సిపల్ నీ అడిగాను. “Your father fee paid amma chanti….” అంటూ సమాధానం ఇచ్చారు, ఇలాంటి ఇంగ్లీషు మాట్లాడే మా ఇంగ్లీషునీ గాలిలోకి ఎగరేసాడు అని నేను నా ఫ్రెండ్స్ నవ్వుకున్నాం, ఒక్కరికి, ఒక్కరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొని, ఇంటికి స్టార్ట్ అయ్యాం, దారిలొ మా క్లాస్ అమ్మాయిలు కనిపించారు, గత వారం ఇచ్చిన స్లామ్ బుక్ ని, నింపి తిరిగి ఇస్తున్నారు, నా స్లామ్ బుక్ ని ఓపెన్ చేసి చుసాను, సింధు అనే అమ్మాయి “నువ్వు చుసే చుపు చాలా బాగుంటుంది” అని రాసింది, నాకు వెంటనే ఆ చేతి వేళ్ళ అమ్మాయి కనులు గుర్తుకు వచ్చాయి, కానీ ఆమె పేరు కూడా తెలియదు, పొనీ నాన్న ని అడుగుదాం అంటే, డోర్ వెనక స్టాండ్ కి ఉన్న బెల్ట్ కొత్తది అని గుర్తు వచ్చింది, ఈలోపు సింధు నా సమాధానం కోసం వేచి చుస్తుంది, కానీ నాకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు, కానీ చెప్పకుండా వెళ్ళితే బాగోదు అని, “అందాన్ని అందరు చుస్తారు, కానీ అందానికే నేను చూసే చూపు నచ్చడం అరుదు అని చెప్పాను. చెప్పిన తరువాత అస్సలు చెప్పింది నేనెనా అని నాలో నేను ఆలోచనలో పడ్డాను, నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు, కానీ నేను సింధు రియాక్షన్ కోసం భయంతో వేచిచూస్తున్న, సింధు మాత్రం నవ్వుతు నాకు చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయింది.
ఇంక ఎవరి ఇంటికి వారు బయలుదేరాము, నాకు మాత్రం నాన్న ఫీజు ఎలా కట్టారో అని ఆలోచన ఒకటే, ఇంటికి వెళ్లి అమ్మ ని అడిగాను “ఒకసారి మీ నాన్న గారితో వెళ్ళావ్ కదరా అప్పు తీర్చడానికి అని చెప్పింది” నాకు అర్ధం అయింది, నా ఫీ కోసం నాన్న అని మాటలు పడ్డారా, నాన్నకి ఎలా సాయం చేయాలి అని ఆలోచన మొదలయింది, ఆ ఆలోచనతో అలా ఆ సూరీడు అస్తమించాడు. మరుసటి రోజు పొద్దునే నాన్న ఆఫీస్ కి రెడీ అవుతున్నారు, నేను ఆయనని చుస్తు ఒకటే అనుకున్నాను, నా జీవితానికి వెలుగు ఎప్పుడు వస్తుంది అంటే ఆయన వెలకట్టలేని మనస్పూర్తి నవ్వు, నా కారణంగా చూసాకే అని. ఈ 10వ తరగతి పరీక్షలలో, 1st class మార్కులతో నాన్న ని హ్యాపీ చెయ్యాలి అనుకున్నాను. డాడీ బ్రేక్ ఫాస్ట్ తింటూ, “ఎగ్జామ్ సెంటర్ ఎక్కడరా ” అని అడిగారు ఇక్కడ పక్కనే డాడీ అని చెప్పాను, అయన ఆఫీస్ కి వెళ్ళగానే. నేను ఫ్రెండ్స్ తో కంబైన్డ్ స్టడీస్ చేద్దాం అని వెళ్లాను, మాటల మధ్యలో నా ఫీ గురించి ఫ్రెండ్స్ కి చెపాను, అందరు ఒక నిమిషం మౌనంగా ఉండిపోయారు, ఇంతలో నా ఫ్రెండ్ రవి గాడు “మీ బాబు గారు నీ కోసం అని మాటలు పడితే.. నువ్వు ఏమో నీ మాటలతో అమ్మాయిలని పడేస్థునావు” అని నిశ్శబ్ధంగా ఉన్న వాతావరణాన్ని నవ్వుతో నింపేశాడు. కానీ నాకు ఆ నిమిషం సింధు గుర్తుకు రాలేదు, ఆ చేతి వేళ్లను చుసిన అమ్మాయి గుర్తుకు వచ్చింది, నాన్న ఇంత కష్ట పడుతుంటే నేను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను అనిపించి ఆ నిమిషం నా మనసు పై తొలిమెట్టు ఎక్కుతున్న ఆ అమ్మాయి ఆలోచనలను అవిరి చేసేసాను.
పరీక్షలు పూర్తి అయ్యాయి, చిచ్చుబుడ్డి వెలిగించి వెలుగు కోసం వేచి చూసే పిల్లవాడి మాదిరిగా నేను ఫలితాలు కోసం వేచి చూస్తున్నాను, రానే వచ్చింది ఆ రోజు, నాకన్న ముందు నా ఫ్రెండ్స్ నా ఫలితాలు చుసి నీకు 78% మావా అంటూ ఇంటికి వచ్చారు, మొక్క గాలి ఎంతో పక్కన ఉన్నా వృక్షానికి తెలియదా అనుకోని, ఆపండిరా మీ జోకులు అని నేనే వెళ్లి రిజల్ట్స్ చూసుకున్నా, నిజం గానే 78%. ఈ రిజల్ట్స్ చెప్తే, మా నాన్న ఫేస్ లో ఆనందం, ఆశ్చర్యం రెండు ఒకే సారీ కనపడుతాయి అనుకున్నాను. వెళ్లి చెప్పాను, కంగ్రాట్స్ రా అని చెప్పి, వెంటనే, ఆడ పిల్ల పెద్దమనిషి అయితే ఎలా చెపుతారో అలా మా నాన్నచుట్టాలకి ఫోన్ చేసి చెప్తున్నారు, మా అమ్మ ఏమో, గణేశ అంత ని దయే అంటూ పూజ చేస్తుంది, ఈ తతంగం అంతా అయ్యేటప్పటికి సాయంత్రం అయింది. ఊరి నుంచీ మామయ్య నాన్నకి ఫోన్ చేసి “ఏరా బావ నీ కొడుకుకి 78% అంటా నా కూతురికి 94%” అని చెప్తూ వచ్చాడు… నాకు ఫోన్ చేసిన మామయ్యని ఎం తిట్టాలో అర్ధం కాని పరిస్థితి. నాన్న మాత్రం “పోనీలే బావ, కూతురిని ఇంటి పట్టున పెంచుతున్నావ్ అందుకే 94% వచ్చింది.. వీడు మొగ పిల్లవాడుగా, హద్దులో ఉండే అల్లరి, ఆటలతో 78% తెచ్చుకున్నాడు, కుదిరితే ఆడపిలని కూడా గేమ్స్ లోకి పంపించు బావ” అని సమాధానం ఇచ్చారు, నాకే ఆ రిప్లైకి మతిపోయింది, అవతల మామయ్య పరిస్థితి ఏంటో మరి. నాకు నచ్చిన వంటలు వండిచారు నాన్న, చల్లని చంద్రుడు నీడలో, అలసిపోకుండా వెలిగే సూర్యుడు లాంటి మా నాన్నతో పడుకున్నా ఆ రోజు ఆనందంగా.
శెలవులు అన్ని అయిపోయాయి, మొత్తానికి ఇంటర్ కాలేజ్ స్టార్ట్ అయింది, స్నేహం దొరక్కపోయినా పర్లేదు, చెడు స్నేహం చేతులు కలపకూడదు అనుకోని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను. రోజులు సరదగా గడిచిపోతున్నాయి, ఇంతలో, అప్పు ఇచ్చిన ఆంటీ వాళ్ళ ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చారు, చాలా సరదగా మాట్లాడుతున్నారు, పోయిన నెలలో నాన్న బాకీ మొత్తం ఇచ్చేసారు, డబ్బుతో మర్యాద ఒకటే కొనచ్చు అనుకున్న కాని అభిమానం, సరదాలను కుడా సంపాదించచ్చు అన్నమాట. ఆ అమ్మాయ్ నీ ఎవరైన పేరు పెట్టి పిలుస్తారో అని ఎదురుచూస్తున్న, కాని పిలవటం లేదు, నన్నుచుసి ఎదో మొహమాటం కొద్దీ నవ్వింది. సింధు నాతో మాటలు కోసం ఎదురు చూస్తుంటే నేను ఈ అమ్మాయి పేరు కోసం కిందా మీదా పడుతున్న, ముందు వచ్చే వర్షం కన్న, వెనక వచ్చే ఇంద్రధనసే ఇష్టం అన్నట్టు ఉంది నా పరిస్థితి, మొత్తానికి తనని పిలిచారు ఎలా అంటే నాకు ప్రతి సారీ , కొత్త విలువలను తెలిపిన మొదటి పరిచయం అయిన తన పేరు రాధ, నా కధకి కథనాయకి, తనని పొందాలి అనుకునే కృష్ణుడినా? సీత కోసం వేచి చుసే రాముడినా? అనుకుంటూన్న నేను రాం… రామ కృష్ణ నా పేరు.
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Nice story
Good story
Thank you sir 🙂
Nyccc story
Waiting chapter 2
Thank you Veerendrnath Garu
by next week end, you can you read the story 🙂
Your ability of using all the words and vocabulary at the right moment is very impressive brother🥰
Thank you so much Syam Krishna brother
Your precious feedback means a lot to me. It’s like fuel to a vehicle to run towards next chapter 🙂
Your story title connected to my heart
Amazing story and waiting for the next part!!
Vaishnavi Garu,
Thank you so much for your valuable feedback, By next weekend I will release next part.
Nice one, interesting and curious for the 2nd chapter Krishna garu.
Thank you Naveen Garu.
We will continue the same and more interesting and curiosity in upcoming chapters 🙂
As per the above chapter we can call you as Krishna and actions also looks like Rama and Krishna, let’s justify in upcoming chapter.
What’s the Radha age ?
The answer by your father to your Mavayya during the marks discussion was inspiring .
When was chapter 2 Krishna garu 🙄
Hi Naveen Garu,
Thank you for your response and Radha age comes under Intermediate age group. Next Friday 2nd chapter will release and the flow continues 🙂
Nice story 👍
Thank you Ramesh Garu 🙂
Nice one
Thank you so much for feedback sir 🙂
Good start sai. It took me my school days and i truly enjoyed it. Congratulations for your passion towards telugu script. Keep going and iam waiting for the next chapter.
Thank you for valuable feedback sir and its a pleasure to me that my story had taken you back to your golden school days 🙂
ANNAYA SUPER nene ram ramakrishna finishing super annaya
Thank you brother 🙂
It was very good story bava it feels like a very natural story and it tells a good emotional feelings
Thank you so much for your great feedback Bava 🙂
Super bava
Thank you bava 🙂
Good story waiting for next please give soon
Thank you Madhu Garu, you can read the next chapter on coming Friday 🙂
Nice one
Thank you Lakshmi Prasanna Garu 🙂
Hello Sudheesh Varma 🙂
Thank you so much for your feedback and you catch the main point that Chapter ends with same chapters name itself and same process will continue in next chapters also 🙂
Nice story bro
Thank you sister 🙂
Good sai… congratulations for your passion,keep going on all the very best your bright future…..
Thank you Bhargavi 🙂
Nice story. Keep it up Sai and all the best..
Thank you Sir 🙂
Wonderful story which is taking me back into gadgets free world. While reading feels like I was in that rain. truly connected story.. awaiting for another chapter.. keep continue all the very best. God bless you..
Thank you for your lovely comment and its a pleasure that you involved in the story Sandeep Garu 🙂
“This put a smile on my face and warmed my heart.” All the best ☺️ Keep going ✌️
Thank you so much for your valuable feedback Sravan Garu 🙂
Nice bro, telugu vocabulary is so good &awesome.Waiting for 2nd chapter. Al the best for remaining part. 👍
Tqsm Sister for your feedback, next chapter will be released on 14th Oct, 2022
సాయి నువ్వు అద్భుతమైన కథ రాశావు. అది చదువుతున్నప్పుడు, చదువుతున్నట్టుగా లేదు ఆ కథలోనే, ప్రయాణం చేస్తున్నట్లుంది.
Thank you #Ravi Garu for Travelling with our story 😍 miku intha kana manchi anubhuthi Karamaina kathani nenu mi prayanam lo nenu parichayam chesthanu 😊😊
Good narration
Thank you for comment #Sreelatha Garu 🙂
Very nice , thiyyani pakam gari tinnattu vundi ni modati episode
Thank you so much for your sweet feedback. Maa modati episode lo andham aina aksharalatho mudi vesina matalu khana, mi abhiprayam andham ga theliparu #Raja Sekhar Jami Garu 🙂
NICE
Thank You @Surya Pavan Garu 🙂
Impressive 😍
Thank you so much for your lovely feedback #Vyshnavi Garu 🙂