ప్రయత్నిచకుండా ఓటమిని ఒప్పుకోకుర, ఒక వేళా అవకపోతే దాని గురించి ఆలోచించకు, ఎందుకంటే నువ్వు కోరుకున్నది మనిషిని, వస్తువుని కాదు, ఇంక ని తాతయ్యల గురించి అంటావా, అది నేను చూసుకుంటాను, కానీ రాధ వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడలేను, అర్ధం చేసుకొని అడుగు ముందుకు వేస్తావ్ అనుకుంటున్నాను అని చెప్పి నన్ను ఇంటికి తీసుకొని వెళ్లరు.
నైట్ 10:00 అయింది, రాధ message “”నాకు ఇంట్లో పెళ్లి సంబందాలు చుస్తునారు, నువ్వు వచ్చి మాటలాడు”” అని, maybe డాడీకి తెలుసు అనుకుంట రాధకి సంబందాలు చుస్తునారు అని, అందుకే నాకు చెప్పారు ఏమో అనిపించింది. తరువాత రోజు రాధ వాళ్ళ అన్నయ్యా ని కలుద్దాం అని, వాళ్ళ అన్న ఆఫీస్ కి వెళ్లి call చేశా కొంచెం పర్సనల్ గ మాట్లాడాలి అని “”సరే wait చెయ్ ఇపుడే వస్తా”” అని చెప్పి, ఒక 10 mints లో వచ్చారు, నేను చెప్పింది, చాల ఓపికగా విన్నారు ““నాకు రాధ మీ ఇద్దరి గురించి మొత్తం చెప్పింది కృష్ణ, నాకు నచ్చిన విషయం ఏంటి అంటే నీలో, తనకి ఆశలు రేపకుండా నువ్వు దూరం అయి, settle అయ్యాక వచ్చి మా familyతో మాట్లాడుదాం అనుకోవడం నాకు బాగా నచ్చింది, ఏ sister కి అయినా, నీలాంటి ఒక మంచి husband గ రావాలి అని కోరుకుంటాడు, ఏ అన్నయ్యా అయినా, కానీ ఇది జరగదు. ఇదే matter న sister కి చెప్పుదాం అని నేను try చేశాను, తాను విన్న కానీ అర్ధం చేసుకునే stage లో లేదు, నువ్వు దూరం ఆలోచించే మనిషివి, నచ్చ చెప్పుతావో, నువ్వు నాకు నచ్చలేదు అని చెపుతావో ని ఇష్టం”” అని చెప్పి వెళిపోయాడు.
ఇప్పుడు రాధ కి ఎం చెప్పాలో ఏంటో అని, రాధ కి కాల్ చేసి మీ father తోనే మాట్లాడుతా అని చెప్పాను, నిజం చెప్పాలి అంటే గొడవలకి గొళ్ళెం తీస్తున్న రెండు కుటుంబాల మధ్య అని అనిపిస్తుంది, కానీ తప్పటం లేదు, ప్రయత్నం లేకుండా ఓటమిని ఒప్పుకోకూడదు అని ఒక అడుగు ముందుకు వేసి, అదే రోజు రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంకుల్ నను చూసి ““ఎరా రామ కృష్ణ, ఇలా వచ్చావ్ ? Job వచ్చింది అంటగా, ఎంత package?”” అని అడిగారు “13 lakhs” అని చెప్పాను ““పర్లేదురా బనే వచ్చింది, మీ నాన్న పడ్డ కష్టానికి నువ్వు ఎదో ఒకటి సాధిచావ్, సరే ఏంటి ఇటు వచ్చావ్”” అంటూ అడుగుతూ, రాధ ని పిలిచారు. నేను చెప్పాలా వద్ద అనుకుంటూ, చెప్పడానికి ధైర్యం సరిపోక, చివరికి రాధ అంటే నాకు ఇష్టం అంకుల్, నేను అన్న కూడా రాధ కి అంతే ఇష్టం, మంచి job వచ్చాక ఈ విషయం మీకు చెప్పుదాం అనుకున్న, రాధ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పాలి అంటే, మీరు మీ అమ్మ గారిని ఎంత ప్రేమగా చూస్కుంటారో, నేను కూడా మీ అమ్మాయిని అంత ప్రేమగా చూసుకుంటా అంకుల్ అని చెప్పాను. ““చూడు రామ, నీ స్థానం లో ఇంకా ఎవరు అయినా ఉండి ఉంటే, పరిస్థితి ఇంకోలా ఉండేది, మంచి కుర్రాడివి కాబట్టి మంచిగా చెప్తున్న ఇక్కడితో వదిలేయ్”” అని అన్నారు, నేను అంకుల్ ని convince చేయబోతుంటే ““నీ బతుకు ఏంటో తెలుసా, నా భార్య డబ్బులు ఇవ్వకపోతే, చదువుకోలేని స్థితి నీది “” అని అన్నారు, నేను ఏమి మాటలాడలేదు, ఒక సారి నేను చెప్పింది అర్ధం చేసుకోండి అంకుల్ అని అంటుంటే ““మీ బాబు పంపించాడా ఆస్తికి ఎర వేయమని”” అని అన్నాడు, రాధ కి ఫాదర్ ప్లేస్ లో నువ్వు ఉన్నావ్ కాబట్టి నేను కూడా అదే మంచిగా చెపుతున్న, నీ కూతురిని ఇష్ట పడ్డ కాబట్టి ఓపిగ్గ ఉన్నాను, లేకపోతే నీ స్థానంలో ఇంకా ఎవరు అయినా ఉంటే, నువ్వు నోరు జారిన మాటకి సాయం చేసిన నాలి కని, ఆ ఆలోచన అందించిన తలని నరికేసేవాడిని ఈ పాటికి, మా నాన్న గురించి నువ్వు అన్న మాటకి, మర్యాదగా మాట్లాడి అని అన్నాను, రాధ ఈ లోపు అడ్డువచ్చింది, వాళ్ళ అన్నయ్యా కూడా office నుంచి వచేసాడు ఇంటికి. గొడవ పెద్దది అయిపోయింది నా అనుమతి లేకుండానే, గొడవ మద్యలో, రాధ వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు చావనైనా చస్తా కానీ మీ పెళ్లి కి ఒప్పుకోను అని, నాకు అసహ్యం వేసి నేను వాళ్ళ ఇంటి బయటకి వచ్చేసాను, రాధ నాతో ““అంత కోపంగ మాట్లాడితే ఎలా కృష్ణుడా, ని ఓపిక అంత ఏమి అయిపోయింది”” అని అంటుంది, మరి ఏమి చేయమంటావ్, మీ నాన్న పిచ్చి పిచ్చిగ మాట్లాడుతుంటే ఉరుకోమంటావా ?, నా బతుకు గురించి మాట్లాడుతుంటే బరించాను, ఎవరి కోసం నీ గురించి, కానీ మా నాన్న గురించి తప్పుగా మాట్లాడుతే ఆ భగవంతుడితో అయినా బరిలోకి దిగుతా. చూడు రాధ, అయన నాకు నేర్పిన ప్రేమే నీ దాకా వచ్చింది, ఇప్పుడు sudden గ నీ కోసం మా నాన్నని తిడుతుంటే నేను చూస్తూ ఊరుకోను, ఎప్పటికైనా మా నాన్న తర్వాతే నువ్వు, కాదు నువ్వే నాకు ఎక్కువ అని చెప్పాను అంటే, ఆ నిమిషం నుంచి నేను నిన్ను ప్రేమించడం ఆపేసినట్టే అని చెప్పి కోపంగ మా ఇంటికి వచ్చేసాను.
వారం గడిచింది నేను కాలేజ్ కి వచ్చేసాను, రాధ వాళ్ళ parents, మా family తో మాట్లాడడం మానేశారు, జీవితం కష్టలని ఎరగా వేసి, నా కన్నీరుని చూద్దాం అంటూ మారుతుంది. “ఈ రోజు ఉదయించే సూర్యుడే రేపు ఉదయిస్తాడు కానీ, ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉండదు, ఏ కష్టం కైనా ఆయుష్షు కొంత కాలమే, మన కన్నీరుతో దానికి ఆయుష్షు పెంచకూడదు” అనే మాట గుర్తుకు వచ్చింది. రాధ నాకు వారానికి ఒక సరి కాల్ చేయడం మొదలు పెటింది, కాల్ చేసిన ప్రతి సరి ““ఏదో ఒకటి చెయ్ కృష్ణుడా”” అని చెపుతూనే ఉంది, నేను రాధతో “ఎంత కాదు అనుకున్న మన parents కి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకునే దాకా మనం వేచి ఉండడం తప్ప మనం ఎం చేయలేము, చేయకూడదు కూడా, నా గురించి రెండు సంవత్సరాలు వేచి ఉన్న దానివి, నీకు ప్రాణం పోసిన వాళ్ళు, ఒపుకోడానికి సమయం ఇవ్వవా ?” అని అన్నాను. నెలలు, రోజుల మాదిరిగా గడిచిపోతున్నాయి, రాధ వాళ్ళ ఇంట్లో తన పెళ్లి కోసం pressure ఎక్కువ అయిపోతుంది, నేను అప్పుడప్పుడు రాధ వాళ్ళ అన్న కి call చేసి అడుగుతూనే ఉన్నాను, వాళ్ళ అన్న నాతో ““నీ బాధ నాకు అర్ధం అవుతుంది కృష్ణ, కానీ నేను చెపుతున్న మా parents వినటం లేదు, కానీ నేను try చేస్తూనే ఉన్న”” అంటూ మాకు support గానే ఉన్నాడు, ఈ గొడవలు, ఆలోచనలతోనే B-Tech 4th year ending వచ్చేసింది, ఇంకో రెండు వారలులో final year exams, ఒక రోజు సడన్ గ మార్నింగ్ 6:30 కి రాధ వాళ్ళ అన్నయ కాల్ చేసాడు “”రామ కృష్ణ, నువ్వు urgent గ హైదరాబాద్ ర, Flight ticket book చేశాను, నీకు send చేశాను కూడా””, అని అన్నాడు, ఎం అయింది అండి అంత సడన్ గ ? ఎం అయినా emergency ఆ? అని అడిగాను ““నువ్వు first ర”” అని చెప్పి కాల్ కట్ చేసాడు, రాధ వాళ్ళ father ఏమైనా చేసుకున్నాడా అని భయం వేసింది, తమ్ముడు కి కాల్ చేశాను వాడు phone lift చేయటం లేదు, పోనీ రాధ కి కాల్ చేద్దాం అనుకుంటే, తన మొబైల్ తీసేసుకున్నారు తన దగ్గర నుంచి. సరే అని flight లో హైదరాబాద్ రీచ్ ఆయను, రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తమ్ముడు అక్కడే బయట ఉన్నాడు, phone lift చెయ్యవు ఏంటి ర ? అని అడిగితే, మొబైల్ ఇంట్లో మరిచిపోయాను, అని చెప్పాడు, ఎం అయింది, ఇక్కడ ఉన్నావ్, రాధ వాళ్ళ father కి ఎం అయినా అయిందా అని అడిగాను, వెళ్లి నువ్వే చూడు అన్నాడు, అరచేతిలో చెమటలతో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, రాధ వాళ్ళ అన్నయ్య నన్ను లోపలికి తీసుకొని వెళ్ళాడు, నిశ్శబ్దం పాతుకు పోయింది ఆ ఇంటి చుట్టూ, లోపలికి వెళుతున్నాను, రాధ వాలా ఫాదర్ కి ఎం అయినా అయితే, ఆ regret felling నాకు బతికినంత కలం ఉండిపోతాది అని ఒకటే ఆలోచనతో అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాను, రాధ చనిపోయి ఉంది అక్కడ, నేను పరిగెత్తుకుంటూ వెళ్లి, చంటి పిల్ల వాడు తల్లీని నిద్ర లేపినట్టు, చావు అంటే ఏంటో తెలియనట్టు తనని లేవమంటున్నాను, తన తల న వడిలో ఉంది, ఎటు వంటి ఊసులు చెప్పకుండా, మౌనం ఎంత భయకరమో, నా కంటి నుంచి ఒక్క చుక్క కన్నీరుకూడా రాలేదు, బహుశా నేను ఇంకా అది వద్దు అనుకుంటూ వదిలేసిన కల అనుకొని ఏమో, ఈ లోపు రాధ వాళ్ళ అన్నయ్య వచ్చి నా బుజం మీద చేయి వేసి, ఒక లెటర్ ఇచ్చాడు, ఏడుస్తూ.
ఏం కృష్ణుడా, కోపంగ ఉందా నా మీద…? నేను బ్రతికి ఉంటే ఈ పని చేసినందుకు నువ్వే నన్ను చంపేసేవాడివి ఏమో, మన ఇన్ని సంవత్సరాల పరిచయం లో అతి కొన్ని కలయికల ప్రయాణంలో ఉన్న జ్ఞాపకాలు నీ గుండెల నిండా నింపుకున్నావు కృష్ణుడా, తుడిచేసేయి… ఏలా అంటే నా వల్ల నీకు ఇప్పుడు వచ్చే కన్నీరులా. నాన్నకి చెప్పాను కృష్ణుడా, అయన వినడానికి కూడా ఇష్ట పడటం లేదు, అమ్మ విన్న కూడా అర్ధం చేసుకోవటం లేదు, అన్నయ్య కి అర్ధం అయినా, ఎం చేయలేని పరిస్థితి, నువ్వు ఏమో మన parents కి విలువ ఇచ్చి, నన్ను ఓపికతో ఉండమన్నవ్, నేను ఓపికతో ఉంటూనే ఉన్నాను, కానీ ఇంకో 4 రోజుల్లో మా నాన్న నాకు పెళ్లి fix చేసారు, నీకు తెలియకుండా. నా మనస్సులో నిన్ను ఉంచుకొని, వేరే ఇంకొకరిని, నా పక్కన ఉహించుకోలేను. నీకు కొన్ని రోజుల్లో exams ఉన్నాయి, నిన్నుdisturb చెయ్యడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు తప్పటం లేదు. చాల భయంగ ఉంది కృష్ణుడ, నా ఈ కనులు చూడని రేపటి వెలుగులతో, నిన్ను చీకటి దుఃఖం లోకి లాగేస్తున్నా, నన్ను క్షమించు కృష్ణుడా. నువ్వు కూడా రాముడిలా, పెద్దల మాట వినాలి అని నన్ను దూరం పెట్టేశావ్, కృష్ణుడిలా, నీ తల రాతలో నన్ను చేర్చుకోలేకపోయావు. కనిపించవు కానీ మొండి వాడివి కృష్ణుడా నువ్వు. డబ్బు, కులం అనే అమావాస్య, ని చందమామామ ని మాయం చేసిన అంత మాత్రాన, తారల్ని చూడటం మానేయకు, వచ్చిన వాటిని వదిలేయాకు, వెలివేయకు. నీకు నేను ఎప్పుడు చెప్పని మాట, నువ్వు నన్ను ఎప్పుడు అడగని మాట, మనం ఎప్పుడు అనుకోని మాట, ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు, I love you, రామ కృష్ణ. మన ప్రేమ మూడు లేఖలో ముగిసిపోయింది కృష్ణుడా, ఇంకా ఉంటాను, శాశ్వతంగ….
ఇట్లు, నీకు దక్కలేని , నువ్వు దక్కిచుకోలేని
నీదైన నీ రాధ కృష్ణ.
లోలోపల ఏదో కోల్పోయాను అని స్పష్టంగ నా మనస్సుకి తెలుస్తుంది, దానికి సాక్ష్యంగా నా కన్నీళ్ళు బయటకి వచ్చాయి, నా ఒడిలో తాను వద్దు అనుకోని వదిలేసిన దేహం, నాకోసం విడిచి పెట్టిన ఉత్తరమే అందరికి కనిపిస్తున్నాయి, కానీ ఆ రెండిటితో పాటు, ఒంటరి తనని కూడా వదిలి వెళ్లిపోయిన విషయం ఎవ్వరికి అర్ధం కాలేదు, ఒక మా డాడీ కి తప్ప, ఒక నిమిషం చివరిసారిగా తన చేతి వెళ్ళాను చూసాను. ““ఆ చేతి వేళ్ళు పట్టుకొని నువ్వు నడవలేవు, అందుకే నీకు ముందే రాధ ముఖం కన్నా తన చేతి వేళ్లను చూపించాను”” అని విధిరాత నాకు చెపుతున్నట్టు అనిపించింది. తాను ఇంకా లేదు రాదు అనే ఆలోచన, నాలో ఓడిపోయినా యుద్ధం పూర్తి చేసుకున్న పుడమిల, నిశ్శబ్దంతో నిండిన రక్తపు ద్వారాల మరీనా నా మనస్సుని నేను మోయలేకపోతు భరించలేని భావాన్ని రేపింది. తనని తీసుకొని వెళిపోతున్న వేళా…
నచ్చింది… నవ్వించాను…
కష్టం అయినా… ఇష్టంల మార్చాను…
మొదటి కౌగిలి కాలనీ, ఇలలో చూపించింది, అంతకు మించిన ప్రేమ ఎం ఉంటుంది అనుకున్నాను…
మోయలేని మధురమైన స్మృతుల్ని, ముళ్ళతో ముడి వేసి, మనస్సుపై విసిరేసింది…
మోస్తూ ముందుకు వెళ్లబోయే వేల…
నా కంటికి కునుకు ఉండదు…
నా దిండు కన్నీరు కోసం వేచి చూడని రోజు ఉండదు…
ప్రశాంతత కోసం ప్రతి క్షణం పౌరుడిలా పోరాడటం తప్పదు…
అమ్మ ఒడిలో కూడా ఒంటరి తనం…
నాన్న దైర్యం తోడు ఉన్న నా బతుకులో ఏదో భయం…
చుట్టూ సంతోషం ఉన్న గుర్తించలేకుండా ఉంది, నా గుండెలో వేధించే గాయం…
మాటకారితనంతో ముందుకు పోయే నా మాటలు, ఇకపై మౌనంతో స్నేహం, ఆ పై శిధిలం…
నా ప్రయాణాలలో రాధ పాదాల పరిమళాలు, వాటిని పొమ్మని చెప్పలేని నా ప్రాణం ని పతనం చేయలేని పరిస్థితులు…
మరిచిపోలేని తన మాటలు మందు నా వ్యసనం…
నా నరాలలో నిలిచిపోయి, నా నుంచి దూరం పోలేని తన నవ్వు నా నిషా…
ఒంటరి తనం లో ఒదగడం, చీకటి గోడల మధ్య ఆ ఒంటరి తనంతో నలగడానికి సిద్ధంగ ఉన్న, ఈ దేహం, కోరికలు కోసం కాదు, పాతిపెట్టే మట్టి కోసం, మౌనంగ మనస్సులో ఎదురు చూస్తూ, ఏడూ సంవత్సరాలు గడిపేశాను, నా పెళ్లి కోసం అమ్మ ఈ ఏడూ ఏళ్లలో ఎన్నో సార్లు గొడవ పెట్టుకుంది నాతో, ఒక రోజు మల్లి అమ్మ నా పెళ్లి టాపిక్ తీసుకొచ్చే ముందు తముడ్ని పంపించింది, వాడు రావడమే నాతో ““నీకు తెలుసు కద రా అన్నయ్య, రాధని పొందడం 50-50 chance ఏ ఉంది అని, అయినా కూడా ఎందుకు అంత పిచ్చిగ ప్రేమించి, మరిచిపోకుండా ఉండడం”” అని అన్నాడు. నేను వాడితో “మనకి ఒక 14, 15 ఏళ్ళకి చావు అంటే ఏంటో తెలుస్తుంది, ఏదో ఒక రోజు మన అమ్మ, నాన్న, వదిలి వెళ్లిపోతారు అని తెలుసు, అయినా మనం గుడ్డిగా ప్రేమిస్తాం, వెళ్లిపోతారు అని తెలిసిన కూడా గుడ్డిగా ప్రేమిస్తే. వచ్చే అవకాశం ఉంది అని 1% తెలిసినపుడు నువ్వు అన్నాట్టు పిచ్చిగ ప్రేమించడం తప్పు అంటావా ?, అని అంటుంటే. అమ్మ బయటనుంచి నా మాటలు విని, నా ముందుకి వచ్చి ““ఇంకా ఎంత కలం ఇలా”” అని అడిగింది గొడవ పెట్టుకుంటూ.
అమ్మ… నీకు సమాధానం చెప్పి… చెప్పి… నాకు ఓపిక అయిపోయింది, సరే ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతా ఇది కొంచెం పచ్చిగానే ఉంటుంది కానీ ఇలా చెప్పితేనే నువ్వు నను మల్లి మల్లి ఈ ప్రశ్న అడిగి నువ్వు బాధ పడి నన్ను బాధ పెట్టావు, తప్పుగా అనుకోకు, నాకు తప్పటం లేదు, తల్లీల కాకుండా, ఒక అక్క గానో, ఒక స్నేహితురాలి గానో అర్ధం చేసుకొని సమాధానం చెప్పు “నాన్న మనస్సులో నువ్వు లేకుండా, నీ ఒంటి మీద నాన్న చేయి వేస్తే ఎలా ఉంటుంది అమ్మ నీకు” నేను పెళ్లి చేసుకొని అలాంటి పరిస్థితిని ఇంకో అమ్మాయికి ఇవ్వమంటావా ?, తల్లి మనస్సుతో కాకుండా, ఆడ దాని మనస్సుతో సమాధానం చెప్పు” అని అన్నాను, అనుభవం మీద పడ్డ అమ్మకి నా నిర్ణయం అర్ధం అయి ఏడుస్తూ నిలిచిపోయింది. ఏ కష్టం ని తలుచుకుంటూ ఈ కొడుకుని కన్నవో, ఆ కష్టం నా కట్టే కాలే అంతవరకు తోడుగా ఉంటుంది, అయినా నేను ఒంటరి కాదు, జంటగా, జారిపోయిన జీవితం, చేదుగా తోడుగా ఉందిగా అమ్మ. నన్ను అడగడం మానేసి తమ్ముడి పెళ్లి సంగతి చుడండి అని చెప్పాను.
నా గురుంచి డాడీ కి తెలుసు కాబట్టి ఇప్పటికి వరకు నన్ను అడగలేదు ఆయన న పెళ్లి గురించి, ఈ జన్మకి ఎం అయినా నాకు బాధ ఉంది అంటే, ఏ కొడుకు ఇవ్వలేని గుండె బాధ బతికి నంత కాలం నా ఒంటరి తనంతో డాడీ కి ఇస్తున్నాను.
Reporter (సహానీ): మరి తార ఎం అయింది sir, మిమ్మలి ఇష్టపడింది గా?
రామ కృష్ణ: మొన్నే Masters complete చేసింది, ఈ సంవత్సరం marriage చేసుకుంటుంది ఏమో, రాధ వెళ్లిపోవడంతో, మా ప్రేమ తనకి అర్ధం అయింది, నాతో పెళ్లి కోసం అడగడం మానేసింది.
Reporter (సహానీ): ఇంత పెద్ద Multinational Company కి మీరు CEO, ఇన్ని వేల కోట్ల ఆస్థి చివరికి ఎవరికీ సొంతం sir?
రామ కృష్ణ: ““చింపితే చిరిగిపోయే నోటుకి, బలమైన బంధాలు కూడా బలాదూర్”” నేను డబ్బు కి respect తప్ప value ఇవ్వను, డబ్బు కి value ఇచ్చే మనుషులని, న మనస్సు దాక రానివ్వను అందుకే రాధ Educational and Health care Foundation ki 60% and 30% for all my Staff.
Reporter (సహానీ): మిమ్మలిని Interview చేసి మీ Love story తెలుసు కోవడం valentine’s day రోజున, I felt so happy sir and my personal last doubt ఎం అనుకోవద్దు, ఒక ఆడ పిల్ల మనస్సులో నుంచి వచ్చిన Question ఇది.
రామ కృష్ణ : సరే అమ్మా, సహానీ.
Reporter (సహానీ): ఒక్క అమ్మాయి కోసం ఇంతలా ఉంటారా, ఏ మగవాడు అయినా ?
రామ కృష్ణ: కంటికి నచ్చిన అమ్మాయి కాకుండా, మనస్సు కి నచ్చి, మనస్సుపూర్తిగా మరువలేకుండా ఉంటె , ఉంటారు.
The End
To The Story But Not For the Love & Pain
రచయిత: మన రామ కృష్ణ చేప్పినట్టు, కంటికి నచ్చిన అమ్మాయి కాకుండా మనస్సుకి నచ్చి, మనసుపూర్తిగా మరువలేక ఉన్న ప్రతి అబ్బాయి కి ఈ కథ సొంతం, అన్నట్లు ఇప్పటి వరకు, చదువుతున్న మీ అందరికి ఈ కథ పేరు చెప్పలేదు కదా, కథ పేరు “”మూడు లేఖలు“”
Your Writer Signing Off
Ram Kocherlla
S/o Mani kumar Kocherlla
Until Next story arrives, Please do support me by reading my Poetries click here
# Author: Ram Kocherlla: Thank you so much for each and every one who read and Shared the Story without you this success will not possible to me.
InFrame: Your Writer Ram Kocherlla
——————————————————————————
Shiva Kocherlla: Hero behind the website, he created the weekly posters, and he is the total website domain in-charge. Without him, this story unable to reach the readers since starting, Thank you so much to Shiva Kocherlla.
InFrame: Shiva Kocherlla
Outstanding story 👍
Thank you so much for your feedback #Pawan Sekhar Garu 🙂
Super Ram
I dint expect the ending
Naku aite adupu vanchinanta Pani aindi
Thank you for feedback #Sanjeev Garu 🙂
Nice writing skills Mr. Ram..continue the same.. we will wait for another story from your pen.. I think you should have a pen name as “Radha”.
Shiva your support is wonderful.. god bless you both.. continue the same.
Thank you so much for your feedback #Sandeep Kumar Garu from Ram and Shiva also.
Manasu baruvu ekkindi Ram me climax chadivaka, taggataniki rendu mudu rojulu padutundi emo..
Na matalu muditho Mi manasuki baruvu andhichinandhuku mandhinchandi and thank you so much for your lovely Feedback #Shiva Kumar Garu 🙂
Dear Ram garu,
Prathi week me story chaduvutunapudu chala happy ga undedhi but eroju first time Mee story chaduvutunte kallalo nellu vachai nenu ee story nii Kalla tho kakundha manusu tho chaduvutunanu may be nduke emo badha ga undi
Story ending manusuki badha ga una oka manchi Prema Katha ni chupincharu Real life lo kuda oka RamKrishna lanti abbai unte bagundu anipistundi..!
Miru rasina ee katha na heart lo yepudike ala gurtuku undi pothadi❤️
Ithulu
Mee abimanuralu 🙂
Dear #Vaishnavi Garu, Rama Krishna tho patu travel chesi, ah katha ki mi heart lo place ichinandhuku thank you so much 🙂
mi kaniru tho na katha ki velakataleni sanmanam chesinandhuku Thank you soo much 🙂
Mee writer Ram Kocherlla
Speechless story Ram. Asalu aa twist enti last lo. unexpected. Entha appreciate chesina saripodu. Superbbbbbbbbbbbb. 🥺🥺🥰🥰
Dear #Preeti vadhinamma, mi andham aina feedback ki eni sarulu thanks chepina saripodhu, Thank you so much 🙂
Nice Ram. Expected some Romantic glimpses but you gave a surprising end. Truly loved your script with some wonderful statements. Congratulations.
Thank you soo much #Lingaraj Garu 🙂
Gunde baruvaindhi, thelikunda ne Kallalo neeru alalu ga paruthunnay. Brilliant story Ram!
Mee Katha tho Navvincharu, viluvalni theliparu, edpincharu, mantra mughdulni chesaru! Inni Rojula ee adbhutha MUDU LEKHALU Prayanam lo mammalni Kattipadesinandhuku.. Chala Thanks!!
-Marenno adbhuthalani mee Kalamtho srushtinchalani, meeru entho ethuku edhagalani Aasisthuu @Mee fan girl🫰🏻❤️
#Sree Garu, alalu ga pare mi kaniru naku anandham kaligisthunayi, endhuke ante nenu alina matalu mudi mi manasuni mantra mughdulni chesanu antunaru kabati and inni rojulu nunchi nenu rasina Katha tho prayanam chesinandhuku chala chala Thanks @your Writer Ram Kocherlla
Elanti end estavanukoledu
anukoni mugimpe katha kathanam # Veerendranath Garu 🙂
Fantastic story.ending lo matharam edupu vachesidi ram garu.marchipoleni story raseru.super ram garu
Thank you so much for reading the story and feedback #Siva Ramya Garu 🙂