HOME

2 వ అధ్యాయము


వద్దు అంటున్న వచ్చె  వరం లాంటి శాపం

రాధ… ఎంత మధురమైన పేరు, అమ్మ అనే పదం పై పోటి పడేలా ఉంది. సుమారు నాలుగు నెలల క్రిందట చూసిన అమ్మాయి, ఆమె ఆలోచనలు అవిరి చేసా అనుకున్నాను కానీ ఆ ఆవిరి ఆకాశంలో చేరి మేఘంలా మారి ఈ రోజు  నా ఇంట్లో వర్షం లా కురిసింది. రాధ ని చూస్తున విషయం అమ్మ కనిపెట్టేసింది, నన్ను వెంటనే గదిలోకి పిలిచింది. ఏంటి అమ్మ అంటు అని ఏమి తెలియని వాడిలా వెళ్ళాను, అమ్మ నాతో “”ఏంటి రా అబ్బాయి గారి చూపులు కొత్త భాషలు పలుకుతున్నాయి”” అని అంది, “”కదా…. నేను అదే గమనిస్తున్నా అమ్మా, ఏ బాషా అయ్యి ఉంటుంది”” అని అన్నాను, “”వెధవ కాలేజ్ కి వెళ్ళాక మాటలు బాగా నేర్చుకున్నావ్ రా” అంది నవ్వుతు. అమ్మతో ఒక అక్కలా చనువు గా ఉంటాను కానీ డాడీకి ఎక్కడ ఈ విషయం చెప్తుందో అని లోపల భయం గానే ఉంది, ఇంకా తనని చుడటం ఆపేశాను.

డాడీ నన్ను చూపించి వీడే మా పెద్ద అబ్బాయి అని పరిచయం చేసారు, రాధ “హలో” అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది, నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు తన చేతి వేళ్ళను మళ్ళీ చూసాను, తన చేతి వేళ్ళు, నా విలువని దిక్సూచికలా దర్శనం ఇస్తున్నాయి, ఒక నిమిషం నేను తనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అర్హుడినా అనిపించిది. చివరకి షేక్ హ్యాండ్ ఇచ్చి, రామ కృష్ణ అని చెప్పాను, ఈలోపు రాధ తండ్రి, “” ఏ రామ కృష్ణరా, మంచి వైపు ఒకటే నించునె రాముడివా, చెడుకి మంచికి సారధిలా ఉండి, మంచినే గెలిపించే కృష్ణుడివా?”అంటూ అడిగారు నవ్వుతూ, అప్పుడు నేను, న్యాయం కోసం సీతని అడివికి పంపిన రాముడు అంత మంచి వాడిని కాదు, అధే న్యాయం కోసం కౌరవులను మట్టుపెట్టేల చేసి, మాతృమూర్తి గాంధారి దేవికి కడుపుకోత పెట్టి కర్మఫలం అని చెప్పేవాడిని కూడా కాదు అంటూ సమాధానం ఇచ్చాను, నా సమాధానం కి రాధ చూసినా చూపు చాలా విచిత్రం అయినది.

ఈలోపు రాధ వాళ్ళ అమ్మగారు “”అబ్బో తాతగారిలా మాటకారివే”” అంటూ పెద్ద అబ్బాయిని పరిచయం చేసారు, మరి రెండో వాడు ఎక్కడ అని డాడీ నీ అడిగారూ, “”వాడు వాళ్ళ నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు”” అని డాడీ సమాధానం ఇచ్చారు. సరే అండి ఇంక మేము వెళతాం అంటూ వాళ్ళు బయలు దేరారు, అమ్మ వాళ్ళ ఇద్దరికీ జాకెట్ ముక్క, బొట్టు పెట్టి పంపింది, రాధకి బొట్టు చాలా బాగుంది, ఎంత అంటే, ఆకాశం వీధిలో, ఎర్రచందనం నీళ్లతో వాకిలి వేసినట్టు.

వాళ్ళు వెళ్లిపోయారు, వెంటనే డాడీ “”అయినా నువ్వు ఏంటిరా, పేరు అడిగితే ఆ సమాధానం ఏంటి పెద్ద వాళ్ళతో”అంటు తిట్టారు, ఇంతలో అమ్మ “”వాడు ఏం అన్నాడు అండి, మంచిలో కుడా చెడు ఉంటుంది అని చెప్పాడు”””అ ఇంకా నువ్వు నీ కొడుకే చెప్పాలి గొప్ప గొప్ప విషయాలు”” అని డాడీ అన్నారు. మా అమ్మ నాకు సపోర్ట్ చెయ్యడం, అగ్నికి ఆజ్యం పోయడం లాంటిది. చివరకి “”మీరు ఇద్దరూ మారరు”” అని డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళారు. సాయంత్రం అయింది. అమ్మ దేవుడికి పూల మాల కడుతుంది నేను అమ్మతో, అమ్మ ఈ రోజు వచ్చారు కదా మన ఇంటికి, వాళ్ళది హైదరాబాద్ ఏనా? అని అమ్మని అడిగాను “”అవును రా ఈ ఊరే కానీ ఎక్కడో నాకు గుర్తు లేదు, ఆ అమ్మాయికి కాలేజ్ దూరం అవుతుంది అని మన   ఏరియాకి వచ్చేస్తున్నారు అంట”” అని చెపింది, అవునా….… అని నేను కొంచెం గట్టిగా అన్నాను. అమ్మ వెంటనే  “”ఏరా నీకు ఎందుకు అంత ఆనందం అని అడిగింది” నాకు ఎందుకు ఆనందం నీ గురించి నా బాధ, మన ఏరియా అంటే నీకు అ ఆంటీ తోడుగా ఉంటుంది గా, షాపింగ్ కి వాటికి అందుకోసం అడిగాను అంతే, సరే కాని అమ్మ వాళ్ళ అమ్మాయ్ ఎక్కడా, అదే ఏ కాలేజ్ లో చదువుతుంది అని అడిగాను, నా అదృష్టానికి అదే సమయానికి డాడీ ఇంటికి వచ్చి, నా మాట విన్నారు, “” నన్ను అడగరా నేను చెప్తాను”” అంటూ ముందుకి వచ్చారు, నేను తింగరి వాడిలా అవునా డాడీ, ఎక్కడ చదువుతుందీ అని అడిగాను, దానికి డాడీ “”సిగ్గు ఉండాలిరా ఆ పిల్ల తో పాటు వాళ్ళ అన్న కూడా వచ్చాడు, అతని గురించి అడగచ్చుగా, ఆ అబ్బాయి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏదో పెద్ద కంపెనీ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అంట”” అని అన్నారు, ఇంతలో అమ్మ “”అబ్బా ఆపండి ఇద్దరు, వాడి అల్లరికి, మీ అదమాయించడానికి హద్దులు లేకుండా పోతున్నాయి” అంటు వంట గదిలోకి పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది, కాని కొన్ని సార్లు వచ్చే తుఫానుని అమ్మ తెలియకుండా ఆపేసి తనతో పాటు వంట గదిలోకి తీసుకొని పోతుంది అనుకున్నాను.

రాత్రి భోజన సమయం అయ్యింది, డాడీ ఫోన్ కి కాలేజ్ నుంచి  కాల్ వచ్చింది. రేపటి నుంచి  ఒక వారం సెలవలు, కారణం **** బీప్ ****** బంద్ లు అని చెప్పారు. డాడీ నాతో ఆ విషయం చెప్పారు. నేను సరే అని అమ్మ తో అన్నం పెట్టమని చెప్పాను. డాడీకి, నాకు, అమ్మ అన్నం పెడుతుంది, డాడీ అన్నం తింటు, “”చూడరా చదువుకునే వయసులో చదువు కోకపోతే, నాలా జీవితం మొత్తం కష్టపడాలిరా, నువ్వు కష్టపడ్డా పర్లేదు కానీ నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయ్, నీకు పుట్టే పిల్లలు నీ సంపాదన సరిపోక ఇబ్బంది పడుతుంటే నువ్వు బాధ పడుతు జీవిత బండిని లాగవలసి వస్తుంది ,ఇంకొకరు నీ వల్ల ఎప్పుడు కష్టపడకూడదు”” అని చెపుతు ఉండంగా, ఈలోపు అమ్మ “”సరే సరే బాగా ఆలస్యం అయింది నువ్వు తిని వెళ్లి పడుకోరా”” అని అంది, నేను అన్నం తినేసి నా గదిలోకి వెళ్లిపోయా, అమ్మా, డాడీ మాటలు వినిపిస్తున్నాయీ ఇలా.

అమ్మ: ఎందుకు అండి వాడికి ఈ బాధ్యతలు అన్ని ఈ చిన్న వయసులో చెప్పడం.

డాడీ: చెప్పాలి కుమారి, బాధ్యత మోయవలిసిన వయస్సు కాకపోయిన, బాధ్యత తెలుసుకోవలిసిన వయసు వాడిది.

అమ్మ: వాడు, మీ సంతోషం చూడాలి అని 10వ తరగతి పరీక్షలో కష్టపడి ఆ మార్కులు తెచ్చుకున్నాడు.

డాడీ: నేను కాదు అని అనటం లేదు కదా కుమారి, వాడి కాలేజ్ నుంచి, నాకు మొన్న కాల్ వచ్చింది మీ అబ్బాయికి అల్లరి ఎక్కువైయింది అండి, ఎప్పుడు చుసినా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు అని చెప్పారు, అందుకే నేను వాడితో అలా మాట్లాడాను, సరే ఇంక నువ్వు పడుకో ప్రోద్దునే లేవాలి, వాడు ఎలానో ఇంట్లోనే ఉంటాడుగా ఈ బంద్ లు వల్ల, వాడికి నచ్చిన టిఫెన్ చెయ్, నేను మార్కెట్ కి వెళ్లి వాడికి నచ్చిన కూర తీసుకొచ్చి నేను ఆఫీస్ కి ఆలస్యంగా వెళతాను అంటూ పడుకున్నారు.

సూర్యుడు మన కంటికి స్పష్టంగా కనిపించడు, పోని మనం ప్రయత్నం చేసిన చూడలేము అలానే తండ్రి ప్రేమ మనకి కనపడదు, పోని మనం ప్రయత్నం చేసిన ఆయన కనపడనివ్వడు, సూర్యుడు లేకపోతే మానవ జాతికి ప్రాణం ఉండదు,  సూర్యుడు లాంటి తండ్రి లేకపోతే జీవితానికి కి జీవం ఉండదు అనుకోని నేను పడుకున్నా.

మరసటి రోజు 11:00 AM కి, రవి, సుధీక్ష్ ఇంకా సింధు మా ఇంటికి వచ్చారు, అమ్మకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, అమ్మకి కూతురు లేదు కాబట్టి ఆడపిల్లలు అంటే ఇష్టం అనుకుంటాను నేను, సింధు అమ్మ తో మాట్లాడుతుంది. రవి, సుధీక్ష్ నాతో ఏంటి బావ, అత్తా, కోడలు మాట్లాడుతున్నారు అని ఏడిపిస్తున్నారు, నేను వాళ్ళ ఇద్దరిని బయటకి తీసుకొని వెళ్లి, అరేయ్ మీ ఇద్దరికి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం చెప్పడం, సింధు పై నాకు ఆ ఉద్దెశం లేదు, నాకు తను మంచి స్నేహితురాలు అంతే, మీరు ఇద్దరు ఎంతో తను అంతే అని వివరంగా చెప్పాను, వాళ్ళు ఇద్దరు ఇంకా ఏం మాట్లాడలేదు. సరే ఎందుకు వచ్చారు ముగ్గురు ఇంటికి అని అడిగాను “”లోపలికి పోయి సింధునే అడుగు మాకుకూడా తెలియదు”” అని అన్నారు, లొపలికి వెళ్లి సింధు నీ అడిగాను, ఏంటే పొట్టి ఎందుకు వచ్చారు అని, “”ఐస్ క్రీం తినాలి అనిపించిందిరా అందుకే వచ్చాను, వెళదాం అందరం”” అని అంది, మార్నింగ్… మార్నింగ్… ఐస్ క్రీం ఏంటి అని, సరే నడు వేళదాం అని అందరం స్టార్ట్ అయామ్, అమ్మ వెనక్కి పిలిచి, నాకు మనీ ఇచ్చి, తప్పు నాన్న బయట అమ్మాయిలని, పొట్టి… ఏంటే… అంటు అనకూడదు, అని చెప్పింది, నేను సరే అని వాళ్ళతో బయటికి వెళ్ళాను.

బేకరీకి వెళ్ళాక సరదగా కబుర్లు చెబుతూ ఐస్ క్రీం  తింటున్నాం, ఈలోపు రాధ వాళ్ళ నాన్నతో ఆ బేకరీకి వచ్చింది, రాధ వాళ్ళ డాడీ, ””ఏరా రామకృష్ణ ఎలా ఉన్నావ్ నీ ఫ్రెండ్సా ఆ వీళ్ళు”” అని అడిగారు నేను అవునండి అని చెప్పాను , రాధ నాకు హాయ్ చెప్పి, “” How are you Ram”” అని అడిగింది “”Iam Good Radha””  అని చెప్పాను, ఈలోపు సింధు నా వంక కనపడని కోపంతో చూస్తుంది, రైతు, దేవుడిని వర్షం అడిగితే వరద ఇచ్చినట్లు ఉంది నా పరిస్థితి. మా ఏరియాకి షిఫ్ట్ అవుతారు అంట అంకుల్ మీరు అని అడిగాను “”అవును రా”” అని చెప్పారు, రాధని ఏ కాలేజ్ అని అడిగేలోపు, అంకుల్ కి ఎదో కాల్ వచ్చింది, “”సరే రా మేము వెళ్ళతాము”” అని వెళ్ళిపోయారు, రాధ కి నేను ఇంకా బై చెప్పలేదు, సింధు నన్నుచంపేస్తోంది ఏమో అని. సింధు ఐస్ క్రీమ్ పూర్తిగా తినకుండా బిల్ తను పే చేసింది, కోపంగా ఉన్నా ఆడపిల్ల ముందు మౌనమే మంచిది అని నేను ఇంటికి వచ్చేశాను.

ఆ వారం రోజుల బంద్ వల్ల వచ్చిన సెలవులు అన్ని అయిపోయాయి… కాలేజ్ మొత్తానికి స్టార్ట్ అయ్యింది. కాలేజ్ కి వెళ్ళాను, నా క్లాస్ బయట, రవి గాడు, సింధు తో ””Hi Sindhu, how are you”” అని అడిగాడు ””Iam good Radha, ho sorry iam good Ravi”” అని సింధు అంటుంది, ఓరి దేవుడా వీళ్ళు ఆ బేకరీ విషయం ఇంకా మర్చి పొలేదురా బాబు అనుకుంటూ, నా క్లాస్ లోకి వెళుతున్నాను. రవి, సుదీక్ష్ ఇంక సింధు ముగ్గురు BIPC, నేను ఒక్కడినే MPC. క్లాస్ స్టార్ట్ అయ్యింది, 2వ పీరియడ్ లో అనౌన్స్ మెంట్ వచ్చింది “”New Joining”” అని, మళ్ళీ new joining ఎవరు రా అనుకుంటూ చూస్తుంటే.

ఇంద్రధనస్సు లాంటి కనుబొమ్మలతో, కత్తులని కాంతిలా మార్చి, కనులలో కుదించి, వాటికి కారు మబ్బులని కమ్మేసేలా ఉన్న కాటుకతో పధును పెట్టి, శంఖానికి ముత్యం వేలాడినట్టు తన చెవికి జుంకీలు వేలాడుతూ ఉండగ, మేలిమి బంగారం కూడా వెలిసిపోయేలా తన మెరిసిపోయే మెడకు పెట్టుకొని, పువ్వులు పడినకూడా కందిపోయే తన భుజం మీద ఆంతటి బరువు అయిన బ్యాగ్ తో వద్దు అంటున్న వచ్చె  వరం లాంటి శాపంలా  “”May I come in sir”” అంటూ క్లాస్ లో అందంగా అడుగు లోపల పెట్టిన అమ్మాయి పేరు రాధ….      To be Continued on 14th Oct 2022.

Next Chapter

   

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.3 10 votes
Article Rating
Subscribe
Notify of
guest

36 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
G phanindra
G phanindra
2 years ago

Super ra ba so nice love & family story I am waiting for continue the story ALL THE BEST

Sandeep kumar Kontham
Sandeep kumar Kontham
2 years ago

Excellent continuation to chapter one.. but not fulfilled.. I felt it’s like soup before staring full biryani party.. Mr. Ram reduce your suspense and story releasing time also.. any way good one.. continuing the same suspense from chapter 1.. super and excellent..

Madhu
Madhu
2 years ago

Mi worlds ki hands off daddy gurinchi cheparu akada miku nenu fan ayipoyaanu anyway stories Chala bagunay sir continue like that God bless you all the best for your future always be happy

Madhu
Madhu
2 years ago

I am girl not sir😄😄😄

Madhu
Madhu
2 years ago

Sure definitely I am already shared

G phanindra
G phanindra
2 years ago

Super bava

Madhu
Madhu
2 years ago

Good

Pavan
Pavan
2 years ago

Bagundhi anna

Naveen Kumar
Naveen Kumar
2 years ago

Wow such a beautiful chapter, Ram garu the way of expressing the beauty is so nice. I felt I missed lot in college days .
The answer you said to Radha’s father was nice , how you get that poetry …
Again suspence and awaiting for next chapter

Vaishnavi
Vaishnavi
2 years ago

Ram garu,
Nen inthaku mundu yepudu Stories chadavaldu me story ey first chaduvutuna prathi line chala Baga rastunaru and story last daka inthe interesting ga undali ani korukuntuna. All the best!!

Vinod salluri
Vinod salluri
2 years ago

Superrr story sir…I love this story..all the best..

Nagendra
Nagendra
2 years ago

Good one

Ramesh Chavakula
Ramesh Chavakula
2 years ago

Hi Bamardhi…..
Excellent word’s about Dad ….as well as story also very good…. keep it up and waiting for next chapter…..😃

Vengopal reddy
Vengopal reddy
2 years ago

Very impressive

Lingaraj
Lingaraj
2 years ago

Good one sai.

Sanjeev
Sanjeev
2 years ago

Super story

Sampath
Sampath
2 years ago

Super excellent sir.

Shanmukha
Shanmukha
2 years ago

Katha bagundi keep it up