తోక చుక్క రాలి భూమి మీద పడినట్లు, రాధ మా కాలేజీకి వచ్చి పడింది, తను నన్ను చూసి తన కనుబొమ్మలతో పలకరించింది, ఇంక క్లాస్ స్టార్ట్ అయింది. బ్రేక్ లో రాధని అందరు పరిచయం చేసుకుంటున్నారు, నిజం చేపాలి అంటే, క్లాస్ లో అందరి కంటే రాధనే బాగుంటుంది. నేను మాట్లాడుదాం అనుకున్న, కానీ నాకు ఎందుకో ధైర్యం సరిపోలేదు. రాధ నా దగ్గరికి వచ్చి లంచ్ కి వెళదామ అని అడిగింది, నాకు ఒక పక్క తెలియని సంతోషం మరో వైపు నా స్నేహితులు ఏమంటారో అని భయం, ఈ లోపు రవి, సుధీక్ష్ మరియు సింధు లంచ్ కి వెళదాం అని వచ్చారు, సింధు, రాధ ని చూసి, హాయ్ రాధా అని పలకరించింది, చాల నార్మల్ గా, నేను సింధు ఇంత కూల్ గా ఉంటుంది అనుకోలేదు, అందరం లంచ్ కి వెళ్ళాము అలా ఆ రోజు క్లాస్ అయిపోయింది.
నేను ఇంటికి వచ్చాను, నేను అమ్మ తో, రాధ మా కాలేజీ అమ్మ, అని చెప్పాను సంతోషం గా. అమ్మ నాతో, “ఒరేయ్ నాన్న, డబ్బు ఉన్న పెద్ద ఇంటి పిల్లర, నువ్వు కొంచెం మాట్లాడి మాట్లాడనట్టు ఉండాలి రా, హద్దులో ఉండకపోతే ఆ సీతమ్మ తల్లికే కష్టాలు తప్పలేదు, మధ్య స్థాయి మనుషులం మనం ఎంత రా” అని అంది, నా మనసుకి బాధ అనిపించినా, అది కూడా నిజమేగా అనుకున్న రాత్రి, 7:30 టైమ్ కి రవి మా ఇంటికి వచ్చాడు “బావ ఈ రోజు సింధు తో మాట్లాడాను రా” దేని గురించి అని అడిగాను నేను “ఈ రోజు రాధ ని చూసాక సింధు ఎందుకో డల్ గా కనిపించింది రా” అని చెప్పాడు, సరే ఇంత కి ఏం మాట్లాడావు అని అడిగితే.
రవి: హాయ్ మేడమ్, ఏంటి ఈ రోజు మాతో కాకుండా, ఒక్క దానివే వెళ్ళిపోయావ్ కాలేజ్ నుంచి.
సింధు: అలా ఏం కాదు రా, కొంచెం తలనొప్పిగా ఉండి వెళ్ళిపోయా, ఏంటి ఇటు వచ్చావ్, లోపలికి రా.
రవి: పర్లేదులే, ఏంటి తలనొప్పి పేరు రాధ నా?
సింధు: అని నీకు చెప్పానా ? రాధా కూడా మనలాగే, రామ కృష్ణ కి ఫ్రెండ్ అంతే
రవి: కానీ నువ్వు అంత కూల్ గా, రాధ తో మాట్లాడతావ్ అని నేను అనుకోలేదు.
సింధు: రవి, నీ మనసులో మాట నాకు అర్ధం అయింది, రామ కృష్ణ తో ఉన్న పరిచయానికి నేను ప్రేమ అని పేరు పెట్టను, ఎందుకు అంటే మనది ఆ వయస్సు కాదు, స్నేహం చిగురించాల్సిన వయస్సులో, ప్రేమ అనుకోని స్నేహాన్ని సమాధి చేయకూడదు, వాడు చూసే చూపు ఇష్టం అని ఎందుకు అన్నాను అంటే, మీ అబ్బాయిలు మనస్సు చెప్పినట్టు నటిస్తారు కానీ, చూపును దాచుకోలేరు, కానీ వాడు అలా కాదు, మనసుని, చూపుని ముడివేస్తూ చూస్తాడు, ఆ ముడిలో నన్ను ఉంచాడు అంతే, వాడు నాతో ఉండాలి అనుకుంట, కాని నా తోడు గా కాదు.
అని రవి చెప్పు కుంటూ వచ్చాడు, నిజం చెప్పాలి అంటే నాకు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, సింధు కి ఎలా సర్ది చెప్పాలో అని అర్ధం కాలేదు ఇన్ని రోజులు, “నేను ఇంక వెళతా రా” అని రవి వెళ్ళిపోయాడు.
అమ్మ అన్న మాట ““పెద్ద ఇంటి పిల్ల””
సింధు అన్న మాట ““మనది ప్రేమించే వయస్సు కాదు””
నాన్న చెప్పిన మాట ““చదువుకోవాల్సిన వయస్సులో చదవాలి””
ఇవి అన్ని నా మనస్సులో మెదులుతూ ఆ రాత్రి గడిచింది. మరసటి రోజు, కాలేజ్ లో విద్యార్థులని మార్కుల శాతం వారీగా విభజించారు, రాధ “A” సెక్షన్‌లో, నేను ”C” సెక్షన్‌లో ఉన్నాను, ఆ నిమిషం నేను వాస్తవం కి వచ్చాను, నాకు ఓకే ఒక పని చదువు కోవడం, నా పూర్తి దృష్టి మొత్తం చదువు అనుకోని నా ప్రయత్నం మొదలు పెట్టాను, రోజులు గడిచిపోతున్నాయి, ఆఖరికి సింధు, రవి, సుధీక్ష్ తో కూడా తిరగడం చాలా తగ్గించాను, ఇంకా రాధ సంగతి చెప్పాక్కర్లేదు, తను హాయ్ అంటే హాయ్ అంటున్న అంతే, అలా నెలలు గడిచిపోయాయి.
1st సంవత్సరం ఎండింగ్ కి వచ్చాము, వచ్చే రెండు వారాలలో ఎగ్జామ్స్ డాడీ ఒక రోజు నన్ను కూర్చోపెట్టి “జీవితంని మరీ అంత సీరియస్ గా తీసుకుంటే మనం చేధించేది చెంతకి చేరకపోతే చింతించాల్సి వస్తుంది” అని చెప్తూ నాకు నా ఫ్రెండ్స్ కి సినిమా టిక్కెట్లు ఇచ్చారు. నాన్న మాటలు నాకు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి, ఆ ఆలోచనలు అందుకుందాం అని అలసిపోని కెరటం లా నేను ఉంటె, ఆయన మాత్రం నా కెరటాల కేరింతలను చూస్తు ఉంటారు, టిక్కెట్లు తీసుకున్న “అదేంటి నాన్న 5 టిక్కెట్లు ఉన్నాయ్ మేము నాలుగురమే కదా” అని అన్నాను, నాన్న నాతో “రాధ కూడా మీ బ్యాచేగా అనుకున్నారా అందుకే తీసుకున్నా” నేను ఏం మాట్లాడలేదు ఇంకా, నాన్న నాతో “ఏమయిందిరా ఎంఅయినా ప్రాబ్లమ్ ఆ” అని అడిగారూ, అంటే నాన్న, అమ్మ ఒక సారి నాతో, రాధ పెద్ద ఇంటి పిల్లరా కొంచెం దూరం ఉండు అంది, అందుకే నేను సరిగ్గా మాట్లాడటం లేదు అని చెప్పాను, దానికి ఆయన “పిచ్చి వెధవ మన పరిధిలో మనం ఉంటె పెద్ద ఇంటి పిల్ల ఏంటి పేద ఇంటి పిల్ల ఏంటి రా చెప్పు” అని అన్నారు.
సినిమా థియేటర్ దగ్గరే కలిసాము అందరం, కానీ నాకు రాధ కనిపించలేదు, సింధుతో రాధ ఎక్కడ అని అడిగాను, తను రాను అని చెప్పింది రా అని అంది, నాకు తెలియకుండానే నా మొహం డల్ అయిపోయింది కొంచెం, హఠాత్తుగా రాధ నా ముందు కు వచ్చి సర్ప్రైజ్ చేసింది “కాలేజ్ లో హాయ్, చెప్తే హాయ్ చెప్పి, పక్కకి వెళ్లిపోయే మనిషికి నేను రాకపోతే మొహం డల్ కూడా అవుతుందా” అని అడిగింది, ఈ లోపు సినిమా స్టార్ట్ అవుతుంది నడవండి లోపలికి అని తీసుకొని వెళ్ళింది సింధు” సినిమా చూసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో “రామకృష్ణ సార్ ఈ మధ్య మనతో మాట్లాడం మానేసారు, చదువు బిడ్డ అయిపోయారు” అంటూ నన్ను ఆట పాటిస్తున్నారు, నేను ఆపండి రా అలా ఏం లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ నడుచుకుంటూ ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయాం.
ఇంటికి రాగానే అమ్మ తలుపు తీసి “ఏరా ఇంకో వారంలో పరీక్షలు, ఇపుడు సినిమాకి వెళ్ళావ్, మీ నాన్నని అనాలి రా అస్సలు” అని నాన్న ని తిట్టుకుంటూ అమ్మ వెళ్లి పడుకుంది. ఎగ్జామ్స్ వచ్చేసాయే, అన్ని బాగానే రాసాను, సింధు, రాధ, క్లాస్ టాపర్స్, రవి ఇంకా సుధీక్ష్ నాకన్నా బాగా చదువుతారు, చూద్దాం ఈసారి నా ఫలితాలు ఎలా వస్తాయో అని వెయిట్ చేస్తున్న, ఒక రోజు నాన్న నాతో “పరీక్షల ఫలితాలు కోసం బాగా వేచి చూస్తున్నట్టున్నావు, ఎదురు చూసే కొద్ది సమయం లో సెకండ్స్ ముళ్ళు కూడా స్లోగా తిరగడానికి తోడ్పడుతుంది రా, ఎందుకో తెలుసా, నీ ఓపికను, పరీక్షించడానికి, నీ ఓపికను పెంచడానికి, ఎదురు చూపులో ఆశలు ఆకాశం అంటుతాయిరా అది మనసుకి మంచిది కాదు అని చెప్పారు.
ఫలితాలు వచ్చాయ్, వాస్తవం లోకి వచ్చిన నేను ఉంటే “A” సెక్షన్ లో ఉండాలి అది కూడా టాప్ లో ఉండాలి అనుకున్నా, నేను అనుకున్నటే నేను టాపర్ అఫ్ ది క్లాస్, నాన్నకి వెళ్లి చెప్పాను, ఆయన ఎం మాట్లాడలేదు, టేబుల్ డ్రా లో నుండి ఒక కొత్త ఫోన్ తీసి ఇచ్చారు, నేను వెంటనే నాన్నని కౌగిలించుకున్నాను, వయస్సుకి వచ్చిన ప్రతి కుర్రాడు నాన్నతో భయంగా అంటి అంటనట్టు ఉంటాడు, తండ్రి కౌగిలిలో ఉన్న ధైర్యం, ప్రేమ, అమ్మ ఇచ్చిన ప్రాణం కంటే గొప్పది అని తెలుసుకున్న రోజు ప్రతి కుర్రాడు, నాన్న కౌగిలి కోసం ఇష్టంగా కష్ట పడుతునే ఉంటాడు కావాల్సింది తన కాళ్ల దగ్గరికి వచ్చేలా ఎదుగుతాడు.
మరసటి రోజు కాలేజ్ కి వెళ్ళాను, అందరు విచిత్రంగా చూస్తున్నారు, కొంత మంది ఏదో అదృష్టం వల్ల 1st ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నారు, ఈ విషయం క్లాస్ లెక్చరర్స్ దాక వెళ్ళింది, అప్పుడు, రాజేంద్ర ప్రసాద్ సార్ కోపం గా వచ్చి ఒక మీటింగ్ పెట్టారు స్టూడెంట్స్ తో “అందరు అనుకుంటున్నట్లు వీడు ఎగ్జామ్స్ లో లక్ వల్ల టాపర్ అవలేదు, ఒక రోజు నా దగ్గరికి వచ్చి, సార్ నాకు ట్యూషన్ చెప్పండి నేను ఫీజు ఇవ్వలేను కానీ, మంచి మార్కులు తెచ్చుకొని చూపిస్తాను. అని అడిగాడు, నా టీచింగ్ కెరియర్ లో మీ జనరేషన్ లో ఇలాంటి స్టూడెంట్ నేనూ ఎప్పుడు చూడలేదు “so shut your stupid mouths and congrats him” అని అరిచి వెళ్లిపోయారు. నేను మౌనం గా నా ప్లేస్ లో కూర్చున్నా, రాధ వచ్చి “నేను క్లాస్‌లో సెకండ్ టాపర్‌ని తెలుసా నువ్వు ఫస్ట్ రావడం వల్ల, ఓడిపోవడానికి కూడా విలువ ఉంటుంది అని నీ గెలుపు చూసాకే తెలిసింది” అని కంగ్రాట్స్ చెప్పి వెళ్లి పోయింది, నన్ను మధ్యాహ్నం నుంచి “A” సెక్షన్ లో కూర్చోమన్నారు, “A” సెక్షన్ లో ఉన్నది ఒకటే సీటు అధి కుడా రాధ పక్కన. తన పక్కన కూర్చోడానికి సంవత్సరం పట్టింది, అలాగే నాన్న కౌగిలి పొందడానికి సంవత్సరం పట్టింది. నా ఈ చిన్న గెలుపు ఎవరి కోసం, నాన్న కోసమా ? రాధ కోసమా ? అంటూ ఆ రోజు “A” సెక్షన్లలో గడిపాను.
To be continued on 21st Oct 2022.
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Nice story as usual. Keep continue to surprise your fans like me..Mr. Ram.. All the very best.
Thank you for sweet comment #Sandeep Kumar Kontham Garu 🙂
As expected chala bagundi ram garu.
Thank you #Vaishnavi Garu 🙂
Nice…. waiting for next chapter
Thank you #Ramesh Garu, next chapter will be on 21st Oct 2022 🙂
Super sai
Sucess vadi kosam
we will let know in coming chapters #Sanjeev Garu 🙂
Nice update..waiting for next episode..
Thank you for comment #Vinod Salluri Garu 🙂
I am really impressed with your writing style.Nice story sir,
Thank you so much for your comments #Lingappa Garu 🙂
It’s very good story , assalu next episode kosam waiting anna
Nanna kosama radha kosama ?
Telusukovali 🤔
Thank you so much sister, you will get the answer in upcoming chapter.
Good one
Thank you for your comment # Nagendra Garu 🙂
Raadha ra(a)maneeyam…..
Radha Ra(a)maneeyam, నేను అల్లె అక్షరాల పదాల కన్నా, మీరు చదివి, అందించే అభిప్రాయం లాంటి అభరణమే ram(a)maneeyam #Lingaraj Garu <3
Superb story Ram garu….next ento telsukovalani chala eager ga undi….e rojullo kuda ela stories tho meru baga connect avuthunnaru bcoz there is a superb content called “Mixed Emotions (Prema, badha, kopam, istam, gelavali ane kasi)” in that story…..👌👌👌👌👌. Ela ayena “Nanna” support tho “Radha” ni geluchukovali….I became 1 of ur fans….Keep writing….keep impressing…. All d best Ram garu….
Thank you for Reading, Feedback and noticing everything #Anusha Readdy Garu 🙂 kadhile ee kaalam lo na kalam mi andhari abhimanam pondhali ani korukuntunanu 🙂
Ram ki prematho Superrrr superrrrr🤩 mi autograph kavali adrustam untey ee life lo okasarii ayeena Manalani kalluputundii anii korukuntunna….Really heart touching
Thank you so much for your lovely feedback #Raj Garu, please check your E-Mail inbox from info@ramkocherllakathalu.com with a Special Note 🙂
compare to last 2 stories… words are very touching in this chapter. the below are favorite from chapter 3rd.
తండ్రి కౌగిలిలో ఉన్న ధైర్యం, ప్రేమ, అమ్మ ఇచ్చిన ప్రాణం కంటే గొప్పది అని తెలుసుకున్న రోజు ప్రతి కుర్రాడు, నాన్న కౌగిలి కోసం ఇష్టంగా కష్ట పడుతునే ఉంటాడు కావాల్సింది తన కాళ్ల దగ్గరికి వచ్చేలా ఎదుగుతాడు.
it’s my pleasure to see such a nice feedback like this #NAgesh Garu 🙂
I am eagerly waiting for next chapter…
Thank you for interest on the story #Narendra Garu :), we will release the next chapter on 21st Oct 2022
When will you release continuation Ram garu
Thank you for the showing interest #Narendra Garu 🙂 Next chapter will release in next weekend 🙂
Superb dedication towards studies… 👍 “hardwork meets always success. ” anedi superbga describe chesav. I am impressed for your thoughts. Keeping going bro continue valuable. Thoughts.Awesome waiting for more surprises in the story. 😍👍
Dear #Ashwini Sister 🙂
Thank you for noticing everything in the chapter and story interest flow will become much more in coming chapters 🙂