కాలేజ్ అయిపోయింది రవి, సుధీక్ష ఇంక సింధు పార్టీ అడిగారు, సరే ఇస్తాను అని, అందరం వెళుతున్నాం, రాధ వచ్చి “”పార్టీ కి నాకు ఇన్విటేషన్ లేదా అని అడిగింది”” నేను నవ్వుతూ ఎం మాట్లాడలేదు, రాధ అప్పుడు “”రామ కృష్ణ అంటే అమ్మాయిలతో బాగా మాట్లాడుతాడు అని కాలేజ్ లో టాక్ ఉంది మరి, నాకు తెలిసిన రామ కృష్ణ నన్ను చూసి, భయపడుతూ, మొహమాటంగ, మౌనంలో ఉన్న నవ్వుతో ఉంటాడు ఏంటి”” అని అంది “”టాక్ ఎం ఉంది, ఇద్దరు. మాటలాడుకుంటున్నపుడు మూడో వాడు వింటే అదే టాక్, ఇంకా అమ్మాయిలతో మాటలు అంటావా, అందంగా ఉంటె మాట్లాడుతాం, మా సింధుచూడు ఎంత అందంగ ఉంటుందో తనతో నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా”” అని అన్నాను వెంటనే రాధ “”అంటే మీ సింధు ఒక్కతే అందంగ ఉందా నేను లేనా అని”” మొహం అలిగినట్టు పెట్టింది ”” చార్మినార్ ని, తాజ్ మహల్ ని పోల్చలేం, తాజ్ మహల్ ఈజ్ లవ్ అండ్ చార్మినార్ ఈజ్ ఎమోషన్ దేని గొప్ప తనం దానికే”” అని చెప్పాను, పక్కన నుచి సుధీక్ష గాడు, “”మరి తాజ్ మహల్ ఎవర్రా…” అని అడిగాడు, నేను వాడి వంక ఒక చూపు చూసా, వాడు భయ పడి “”సరే… సరే పార్టీ కి టైం అవుతుంది వెళదాం”” అని చెప్పాడు నేను రాధతో ““can you join with us for party”” అని అడిగి, మాతో పాటు తీసుకొని వెళ్ళాము. డిన్నర్ చెస్తునప్పుడు, రాధతో గడిపిన సమయం, సాయంత్రం సురీడిలా, చూస్తూ ఉండగానే చాల సరదాగా గడిచిపోయింది, ఇంకా తనతో కాసేపు ఉంటావా అని కాలం నన్ను అడిగితే బాగుండు అని అనిపించింది. నేను బిల్ పే చేస్తున్నప్పుడు, సింధు నన్ను పక్కకి తీసుకొని వెళ్లి, నా చేతిలో మనీ పెట్టి నువ్వు పే చెయ్యి అని చెప్పింది, నా దగ్గర ఉన్నాయి మనీ అని చెప్పాను, అబ్బో అవునా మూసుకొని పే చెయ్ అని చెప్పింది, నాకు అర్ధం కాలేదు, సరే అని బిల్ క్లియర్ చేసి బయటకి వచ్చాము, ఈలోపు రవి గాడు, అందరితో “”మన రామ కృషకి ఫస్ట్ టైం ఫస్ట్ మొబైల్ వల్ల ఫాదర్ కొని ఇచ్చారు, కానీ వీడు మనకి ఇంత వరకు నెంబర్ ఇవ్వలేదు, ఇప్పుడైనా నెంబర్ ఇవ్వరా బాబు అంటూ”” అడిగాడు, నేను నెంబర్ చెపుతున్న, రాధ తప్ప అందరూ సేవ్ చేసుకుంటున్నారు, ఈలోపు సుధీక్షకి నేను సైగ చేశా, వాడు రాధతో “”రాధ నువ్వు సేవ్ చేసుకోవటం లేదు ఏంటి”” అని అడిగాడు, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పింది, ఇంకా అందరం ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయాం.
నేను ఇంటికి రాగానే, డాడీతో కాలేజ్ లో జరిగిన అన్ని విషయాలు చెప్పాను, ఆయన అంతా విని, “”కష్ట పడ్డ వాడికి ఎప్పుడు మొదటి స్థానం దక్కడంలో అర్చర్యం ఏమి లేదుర, అయినా స్టూడెంట్స్ ని మార్క్స్ బట్టి డివైడ్ చేయడం ఏంటిరా బుద్ధి లేని ప్రాసెస్ కాకపోతే, సరే వెళ్లి తిను”” అని అన్నారు, నేను మా బ్యాచ్ తో తినేసా డాడీ బయట, వాళ్లు పార్టీ అడిగారు సో ఇచ్చి వచ్చేసాను, “”ఆ సరే ఈ విషయం మీ అమ్మకి చెప్పకు, తిడుతుంది, సైలెంట్ గ వెళ్లి పడుకో”” అని డాడీ పడుకుంటున్నారు, ఈలోపు అమ్మ వచ్చి “”ఆ సైలెంట్ గ వెళ్లి పడుకునే ముందు, ఈ మజ్జిగ తాగి పడుకో”” అని అంది, డాడీ నన్ను చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాకు సింధు మెసేజ్ చేసింది, ““కంగ్రాట్స్ డియర్”” అని ఆ Text చూడగానే, అభిమానానికి ప్రేమ కి మద్య లో మిగిలిపోయిన మెసేజ్ లా అనిపించింది, “”thank you and బిల్ నేను పే చేసేవాడిని కదా నువ్వు ఎందుకు పే చేసావ్”” అని మెసేజ్ పెట్టాను ““రాధ పుట్టిన రోజు వచ్చే నెల, నీ దగ్గర ఉన్న మనీ అంతా బిల్ పే చేస్తే ఏమి గిఫ్ట్ కొంటావ్ ”” అని రిప్లై ఇచ్చింది. నాకు ఎం రిప్లై ఇవ్వాలో అర్ధం కాలేదు అంతలో ఇంకో మెసేజ్ “”ఎక్కువ ఆలోచించకుండా వెళ్లి పడుకోర గుడ్ నైట్ ఇట్లు సింధు”” అని.
మరసటి రోజు సండే కొంచెం లేట్ గా లేద్దాం అనుకున్న కానీ పొద్దునే అమ్మ హడావిడి, ఎం అయ్యింది అని లేచి చూస్తే, తమ్ముడు వచ్చాడు నాన్నమ్మ ఇంటి దగ్గర నుండి, వాడు నా దగ్గరికి వచ్చి “”నువ్వు చేసిన ఎదవ పని వల్ల ఇపుడు నాకు క్లాస్ తీసుకుంటారు డాడీ” అని అన్నాడు, నేను ఎం చేశానురా అని అడిగాను “ఆ పెద్ద పోటుగాడిలా క్లాస్ టాపర్ వచ్చావ్ అంటగా అది సరిపోదు, ఇపుడు డాడీ నిన్ను చూసి, నాకు టాపర్ అఫ్ ది క్లాస్ పైన ఇంకా ఎం అయినా ఉంటె ఆ ప్లేస్ తెచ్చుకోమంటారు, అరెయ్ అన్నయ, అయినా ఇప్పుడు… ఇప్పుడేరా అమ్మాయిలు బయటకి వచ్చి చదువుకుంటున్నారు నువ్వు వాళ్లకి ఆ 1st ప్లేస్ కూడా ఇవ్వవా”” అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు, డాడీ వచ్చారు, ఏంటిరా అప్పుడే వచ్చావు, బస్సు తొందరగా వచ్చిందా ఏంటి? నేను బస్సు స్టాప్ కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్న, ఇంతలో నువ్వే వచ్చేసావ్ అంటున్నారు, “”అన్నయ కి క్లాస్ 1st రాంక్ వచ్చింది అని ఆనందంతో తెలియగానే వచ్చేదాం అనుకున్న డాడీ, కానీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, క్లాస్సేస్ తప్పకూడదు అని రాలేకపోయా”” అని అన్నడు తమ్ముడు “”అవునా చూద్దాం ఎంత బాగా చదువుతున్నావో, రిజల్ట్స్ వస్తాయిగా”” అంటు స్నానానికి వెళ్లారు డాడీ, తమ్ముడు వెంటనే నాతో “”చుసావా నువ్వు రిలీజ్ చేసిన బారి బడ్జెట్ హిట్ రిజల్ట్ మూవీకి, నేను పార్ట్ టూ(2) తీయాల్సి వస్తుంది అంత నాకర్మరా ”” అంటు జోక్ వేస్తున్నాడు.
పేరుకే అన్నదమ్ములం కానీ స్నేహితులం, వాడికి కష్టం కాకుండా నేను కాపలాగ…, నా సంతోషంకి వాడు సారధిగ ఉండే వాడి పేరు శివ, డాడీ మాకు ఆస్తులు ఇవ్వలేదు అనుకుంటారు కానీ, వెలకట్టలేని నా వజ్రం వాడే, వాడిని కాపాడుకొనే బంగారం నేనే.
ఇద్దరం గ్రౌండ్ కి వెళుతున్నాము, దార్లో శ్రీనివాస్ అంకుల్ కనిపించారు, డాడీ కి మంచి స్నేహితుడు, తముడ్ని చూసి “”ఎరా చిన్నోడా ఊరు నుంచి ఎప్పుడు వచ్చావ్”” అని అడిగారు “”మొన్న రాత్రి మీ రెండో కూతురు భావన మెసేజ్ చేసింది అంకుల్, ఇదిగో నిన్న బస్సు ఎక్కి ఈరోజు వచ్చేసా”” అని అన్నాడు, అంకుల్ టెన్షన్ తో “”ఏమి అని మెసేజ్ పెట్టిందిరా అది”” అని అడిగారు, “అబ్బే ఏమి లేదు అంకుల్ ఇంటర్మీడియట్ బెటరా డిప్లొమా బెటరా 10th క్లాస్ తరువాత అని అడిగింది, ఈ డిస్కషన్ కాల్ లో కష్టం, వచ్చి Explain చేస్తా అని చెప్పాను అంతే”” అని అన్నాడు , అంకుల్ సరే సరే అని నిదానించి వెళ్లిపోయారు, నేను అడిగాను తముడ్ని “”నీకు ఫోన్ లేదు కదారా”” అని “”నా సంగతి పక్కన పెట్టు, ఫస్ట్ ఆ భావనకి ఫోన్ ఉందా? , మెసేజ్ అనే సరికి అంకుల్ ఫేస్ లో ఆతృత కనిపించింది, మొన్న క్లాస్ లో టీచర్ ఆతృత అంటే ఏంటి అని అడిగింది, ఇప్పుడు చూడాలి అనిపించింది, అందుకే ఆలా అన్నారా”” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. “”భావన కి, మొబైల్ లేదు అని నీకు ఎలా తెలుసురా”” అని నేను అడిగాను “”ఇదిగో నువ్వు అన్ని ఇలా అడిగితే మేనేజ్ చేయలేక… సారీ చెప్పలేక చాల ఇబ్బందిగా ఉంటుందిరా అన్నయ”” అన్ని అన్నాడు. చాలా అల్లరి చేస్తాడు కానీ హద్దులోనే ఉంటాడు, బహుశా నాతో ఉండే చనువొ, అమ్మ అంటే కనపడని భయమో, లేదా డాడీ పెంపకమో, తెలియదు కానీ, అల్లరి లో హద్దులు మాత్రం దాటడు.
గ్రౌండ్ కి వెళ్ళాం, రవి, సుధీక్ష ఉన్నారు కాసేపు క్రికెట్ ఆడుకున్నాం, ఆ తరువాత అందరం కలసి, సింధు ఇంటికి వెళ్ళాం, తమ్ముడు వాళ్లతో “”నేను మ అన్నయకి చాలా సార్లు చెప్పా మీ ముగ్గురితో తిరగొద్దు అని. ఇప్పుడు చూడండి, వాడు చదువు బిడ్డ అయిపోయాడు, మళ్ళి మా అన్నయ్య మాములు మనిషి ఎప్పుడు అవుతాడో ఏంటో, అని నాకు భయంగా ఉంధి”” అంటూ అందరిని నవిస్తున్నాడు, సమయం చాల తొందరగా గడిచిపోయింది, మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వచ్చేశాం, అమ్మ ఇద్దరికి అన్నం పెడుతూ “”ఎరా చిన్న__, నాన్నమ్మ ఎలా ఉంది, నిన్ను బాగా చూసుకుంటుందా , సమయానికి భోజనం చేస్తున్నావా”” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది, దానికి తమ్ముడు “”ఎంత అయినా మా రక్తమే కదా, నన్ను బాగానే చూసుకుంటుంది, మేము మా నాన్నమ్మ ఒకటే, మీ అమ్మ, అదే మా అమ్మమ్మ అనుకున్నావా ఏంటి”” అని ఆటపటిస్తునాడు దానికి అమ్మ “”ఎం రక్తంరా, వాళ్లకి ఆ వయసులో సాయం కావాలి కాబ్బట్టి, నిన్ను ఉంచుకున్నారు, ఉన్న అందరి మనవళ్ళుని అడిగితే ఎవరు రానన్నారు, చివరికి ఏదో ప్రేమ ఉన్నట్టు నిన్ను తీసుకొని వెళ్లారు”” అంటు చిన్న బోయింది అమ్మ. డాడీ అంతా విని “”కుమారి పిల్లల ముందు ఎం మాట్లాడుతున్నావ్, పిల్లలకి బంధువుల పేరులు తెలియక పోయిన, బంధాల విలువలు తెలియాలి, అంటు ఆ సంభాషణ ఆపేసారు.
సాయంత్రం 4 గం కావస్తుంది, తమ్ముడు నా మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నాడు, నేను మాత్రం, రాధా మెసేజ్ చేయలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఆలోచిస్తున్న, ఈలోపు డాడీ వచ్చి నాతో ““ఆరే నీకు ఫోన్ ఇచ్చినప్పుడు చెపుదాం అనుకున్న, కానీ మరిచిపోయా, నువ్వు మంచిలో కూడా చేడు ఉంటుంది అని గమనించిన వాడివి, నీకు ఇచ్చిన ఈ మొబైల్ లో ఎంత చేడు ఉంటుందో, నీకె తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకటి గుర్తు పెట్టుకో, మంచి చెడు రెండు, రూపాయీ కాయిన్ కి ఉన్న బొమ్మ, బొరుస్సు లాంటివి, పక్క పక్కనే ఉన్న ఎప్పటికి కలవవు అలాగే నీ చేతి లో ఉన్న ఈ మొబైల్ చెడు వైపు ఉంటె, నువ్వు వాడే అవసరం మంచి వైపు ఉండాలి, ఇది నా అనుభవం తో చేప్పిన మాటలురా పట్టించకోకపోయినా పర్లేదు కానీ గుర్తు పెట్టుకో”” అని అన్నారు వెంటనే నా మొబైల్ కి ఒక మెసేజ్ “”హాయ్ కృష్ణుడా, నేను రాధనీ, నువ్వే మెసేజ్ చేస్తావేమో అని వెయిట్ చేశా, ఏ గోపికతో బిజీ ఉన్నావ్”” అని, ఆ మెసేజ్ చూసిన తరవాత, అనుభవం మాట వినాలా, ఆకర్షణ వైపు అడుగు వేయాలా, అనుభవమా? ఆకర్షణా? అర్ధం కాకుండా 18 ఏళ్ళ వయస్సు ఉన్న కుర్రాడిని నేను.
To be continued on 28th Oct 2022.
NEXT CHAPTER
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Nice chapter agin. Going deep into story taking me into a different world .. thanks ram.
Thank you so much #Sundeep Garu 🙂
Nice story
Thank you #Veeresham Garu 🙂
As usual superb….👌👌👌👌
Thank you #Anusha Garu 🙂
Nice one
Thank you #Nagendra Garu 🙂
Nice……few lines are awesome…..I am waiting for the next Chapter
Thank you #Ramesh Garu 🙂 we will release the chapter in next weekend 🙂
Chala Intersting ga undhi story chadhuvuthuntey nice
Thank you #Manisha Garu 🙂
Good Narration Ram.. eagerly awaiting for coming episodes..
Thank you #Shiva Kumar Garu 🙂
Real life lo iddare brothers madaya una relation ey ee story lo chupincharu kadha ram garu😂
Anyway story ni chala Baga continue chestunaru!!
vasthavam lo una vishayalani vivarinchanu anthe #Vaishnavi Garu and Thank you 🙂
Dear Ram… Kathani kalla mundhu kattipadesaru❤edho theliyani anubuthi.. Cheppaleni bhaavalu
– mee next chapter kosam vechi chuse oh Abhimani😌
Dear Sree Garu 🙂
Kathani mi kallatho kana manasutho chadhivaru kabati kattipadesanu emo, theliyani anubuthi ni thelipinadhuku, cheppaleni bhaavalu maa dhaka cherichinanduku chala Thanks 🙂 and next chapter is on dated 28th Oct 2022 🙂
Every chapter is so exciting bro. Your vocbulary skills are so good. In this chapter dad’s support towards you.encouraging part. So good, good luck for next chapter bro 👍😍.
Thank you so much #Ashwini Sister 🙂
What a story.. Just now completed all the chapters
I can see the characters in front of me yaar while reading… Brilliant story 📕
I can see the emotions, bonding, responsibilities, love, care, friendship, values, respect, feelings, what not..
Finally, for each episode the ends you are giving 🔥.. I am not getting the words…Congratulations to Mr. Ram😍the hero behind the story..
*Specifically…fan of Uncle Role*❤️
Oka Goppa thandri aasthule kadhu.. Viluvalni kuda nerputhadu.. #Fida🙌🏻
Thank you sooo much for your valuable complements # Sree Garu 🙂
వెలకట్టలేని నా వజ్రం వాడే, వాడిని కాపాడుకొనే బంగారం నేనే…..wow… nice one sai.
Thank you #Lingaraj Garu 🙂
Super
Thank you # Madhu Garu 🙂