నాకు రాధ మెసేజ్ కి రిప్లై ఇవ్వాలి అని ఉంది , డాడీ అన్నమాట మళ్ళీ ఒక సారి గుర్తుకు తెచ్చుకున్నాను , రాధతో మాట్లాడటం తప్పు ఎంకాదు కదా అని , మనస్సుకి మేలిముసుగు వేసుకొని , మా messages లలో మాటలు ఇలా సాగాయి .
రామ కృష్ణ: ఆ కృష్ణుడు ఏ గోపికతో ఉన్న ఈ రాధకేగా రిప్లై ఇచ్చేది
రాధ: అవునా , ఇంతకీ రామ్ రిప్లై ఇస్తున్నాడా ?, కృష్ణ రిప్లై ఇస్తున్నాడా ?
రామ కృష్ణ: నిన్ను నవ్వించి ఆటపట్టించేవాడు కృష్ణుడు, నీ ముందు మౌనంతో మెసిలేవాడు రాముడు.
రాధ: అవునా… నాకు ఇద్దరు కావాలి ఐతే.
రామ కృష్ణ: ఏంటి ఎం అన్నావ్ ?
రాధ: ఆట, పాటలో కృష్ణుడిల. నా కోపంలో రాముడిల , కావాలి అంటున్న. అయినా ఆడపిల్ల మాట అర్ధం కానీ అంత అమాయకుడివి కాదు కదా నువ్వు.
రామ కృష్ణ: ఆడపిల్ల మనస్సుని సముద్రం లోతుతో పోలుస్తారు , కానీ సముధ్రాన్ని, సముద్రుడు అని మగవాడిలా సంబోధిస్తారు .
రాధ: వినడానికి బాగుంది , కానీ అర్ధం ఏంటో?
రామ్: పైకి మేము ఎంత పెద్దగా ఉన్న , మా గుండెలోతులదాకా మీరే ఉంటారు , కాబట్టి మీ మాటలకి అర్ధాలు వెతుకోవడం కష్టం.
రాధ: మాటకారివి అనుకున్న, కానీ మనుషులని మాయ చేస్తావ్ నువ్వు కృష్ణుడా .
రామ కృష్ణ: మనస్సు మెచ్చిన మాటలు ముందు పెడితే దానికి మాయ అని పేరు పెడతాను అంటే , మౌనంతో ఒప్పుకుంటాను .
రాధ: నువ్వు గీతకి రెండు వైపులా ఉంటావ్ కృష్ణుడా. దొరకవు , దక్కవు.
రామ కృష్ణ: ఙివితంలో ఎవరో ఒకరికి దొరకాలిగా , అప్పటి వరకు ఎవరికి దక్కకూడదు అని.
రాధ: దొరుకుతావులే నాలాంటి అమ్మాయికి ఎప్పుడో, ఒక ప్పుడు. సరే బాయ్ , అమ్మ పిలుస్తుంది.
అని message పేట్టి వెళ్లిపోయింది , నేను మళ్ళీ మొత్తం చార్ట్ చూసుకున తనకి నచ్చినట్లు మాటలాడిన లేదా అని, నాకు అర్ధం కాలేదు. సింధుకి చూపిదాం అంటే తిడుతుంది ఏమో అని భయం, రవి గాడు బయటకి వెళుతున్నాడు , ఇంకా సుధీక్ష దగ్గిరకి వెళ్ళాను. బావ రాధతో చార్ట్ చేశాను రా ఇందాకే అని అన్నాను ““మంచిది , ఐడియాస్ ఎం అయినా ఇవ్వాలా చెప్పు మనకి కవితలు కోకొల్లలురా”” అంటూ నా మొబైల్ తీసుకొని messages అని చదివాడు ““బావ ఆంటీ ఎం అయినా ఈ మద్య నీకు వంటలు నేర్పుతుందా ఏంటిరా”” అని అడిగాడు, లేదు బావ ఎందుకు ఆలా అడిగావు అంటూ సమాధానం ఇచ్చాను దానికి వాడు “”అంటే ఎం లేదు, పులిహార ఇంత బాగా కలిపితే అనుమానం వచ్చిందిలే, కాకపోతే పసుపు ఏక్కువ అయిపోయిందిరా, ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం కరెక్ట్ గా వేసేస్తావులే, ఇక్కడ గొప్ప విషయం ఏంటో చెప్పనా, నీలాంటోడికి నేను ఐడియాస్ ఇవ్వడం. సరే కానీ ఏంటి మేటర్, రాధ అంటే ఇష్టమా ?”” అని అడిగాడు , లేదు బావ ఏదో కొత్త అమ్మాయిగా సో అడిగాను అంతే అని అన్నాను “”ఈ రోజు చార్ట్ చూపించడానికి వచ్చావ్ , రేపు కహానీ కక్కడానికి వస్తావ్”” అని అన్నాడు , అబ్బో అంత లేదు , నేను వెళతా అని ఇంటికి వచ్చేసా.
తమ్ముడు, మూవీకి వెళదాం అందరం అని డాడీ ని అడుగుతున్నాడు , డాడీ సరే అని రెడీ అవమన్నారు , ఆ రోజు మూవీకి వెళ్లి , వచ్చి మూవీ గురించి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి తమ్ముడు, నేను నా రూంకి వెళ్లిపోయాం. తమ్ముడుకి రాధ గురించి చెపుదాం అనుకున్న కానీ వయస్సులో పెద్దగా తేడా లేకపోయినా, నా కన్నా చిన్న వాడు, నన్ను చూస్తూ కొన్ని నేర్చుకునే వాడు, రాధ అంటే ఇష్టంమో, ప్రేమో నాకే తెలియని స్థితిలో ఉన్న నేను, వాడికి ఇవి అని చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకే గుడ్ నైట్ రా అని చెప్పి పడుకున్న.
మరసటి రోజు సోమవారం, ప్రొద్దునే లేచి రెడీ అవుతుంటే , ఈలోపు తమ్ముడు ““అరేయ్ అన్నయ్య నేను సాయంత్రం బస్సుకి వెళిపోతున్న కుదిరితే తొదరగా రా”” అని అడిగాడు , సరేరా వచ్చేస్తా అని నేను కాలేజ్ కి స్టార్ట్ ఆయ్యాను. క్లాస్ స్టార్ట్ అయింది, నేను క్లాస్ వింటుంటే, రాధ నా పక్కనే కూర్చొని, నా మొబైల్ కి మెసేజ్ చేసింది ““బాబు క్లాస్ Topper , క్లాస్ ని మరి అంత సీరియస్ గ తీసుకోవాలా, బోర్డు వంక తప్ప , పక్కకి కూడా చూడటం లేదు”” అని. నేను రాధ వంక చూసి, మెసేజ్ పెట్టి disturb చేస్తున్నావ్ అని మేడంకి చెప్పాలా అని అన్నాను, ““చెప్పుకుంటే చెప్పుకో నాకు ఎం భయమా ఏంటి”” అని అంది, నేను వెంటనే మేడం అని పిలిచాను , రాధ టెన్షన్ తో భయ పడింది, నేను నవ్వుకుంటూ ““అదే మేడం 3rd స్టెప్ ఫార్ములా మల్లి ఒక సారి చెపుతారా ”” అని అడిగాను. లంచ్ టైం అయింది , నేను రవి వాళ్ళని కలవడానికి వెళ్ళాను, రాధ వచ్చి ““దొంగ సచ్చినోడా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అస్సలు”” అని మాడు మొఖం పెట్టింది, నువ్వేగ రాముడు, కృష్ణుడు ఇద్దరు కావాలి అని అడిగావు. మేడం అని పిలిచి నిన్ను ఆట పట్టించిన వాడు కృష్ణుడు, మేడంకి నీ మెసేజ్ గురించి చెప్పని వాడు రాముడు, అని అన్నాను. రాధ నా కనుల వంక చూస్తూ, తన కనులతో బానే చెపుతున్నావ్ అంటూ చూసి, నచ్చుతున్నాయి ని మాటలు, అంటూ తన చిరునవ్వు చెప్పింది. కన్నుల బాషా అంటే, కంటికి కాదు, మనస్సుకి నచ్చిన వారితో మొదలు అవుతుంది అన్నమాట అనుకుంటూ ఆ రోజు కాలేజ్ గడిచిపోయింది.
ఇంటికి వచ్చి, నేను ఇంకా డాడీ, తముడ్ని Bus stop లో డ్రాప్ చేసాము. వాడిని అడిగాను అంత ఓకే నారా అక్కడ అని ““అంత ఓకేరా అన్నయ , నువ్వు ఎం థింక్ చేయకు”” అన్నాడు, ఇంతలో బస్సు స్టార్ట్ అయింది, నేను, డాడీ తిరిగి ఇంటికి వచ్చేసాము. అమ్మ డల్ గా ఉంది, తమ్ముడు నాన్నమ్మ ఇంటికి వెళ్ళాడు అని. నేను డాడీతో అమ్మ డల్ గా ఉంది అని చెపుదాం అనుకునేలోపు, డాడీ, అమ్మతో, కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు, ఎందుకు అంత విచారం, వస్తాడులే Exams అయిపోయాక అని అంటున్నారు. దానికి అమ్మ ““నేను నా చిన్న కొడుకు కాకులం ఐంతే, తమరు ఏంటో”” అని అంది ““రెండు కాకులని పెంచుకుంటున్న రాజునే నేను అని”” అంటూ అమ్మని నవ్వించడం మొదలు పెట్టారు. నాకు వాళ్ళ ఇద్దరిని చూసినప్పుడు, భార్య భర్తలు లా కనిపించరు, ప్రేమికులా కనిపిస్తారు, దానికి మూలం పెళ్లి అనే బంధమా, లేదా డాడీ కష్టాన్ని అమ్మ అర్ధం చేసుకోవడంమా ?, అమ్మ అర్ధం చేసుకునే మనస్సుని డాడీ తెలుసుకోవడమా? అనుకుంటూ ఆ రోజు ముగిసింది.
కాలేజ్ లో నేను , రాధ చాల దగ్గర స్నేహితులం అయిపోయాము , రోజులు గడిచి పోతున్నాయి ఇంతలో రాధ పుట్టినరోజు వచ్చింది. తనకి ఎం గిఫ్ట్ కొనాలో నాకు అర్ధం కావటం లేదు, సింధుని అడిగాను ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ““చెపుతాను కానీ , రాధ నీకు ఎం అవుతుంది , స్నేహితురాలా , లేక ఇంకా ఏమైనా పేరు పెడతావా”” అని అడిగింది సింధు. ఇప్పటికి అయితే స్నేహితురాలు అని చెప్పాను నేను. ““సరే కానీ నీకు నేను ఒక 7 years నుంచి తెలుసు, ఎప్పుడైనా నాకు ఎం అయినా కొని ఇచ్చావురా అసలు చెప్పు”” అంటూ సింధు అడగగా ““నీకు నేను గిఫ్ట్ ఇవ్వడం అంటే నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకోవడం లాంటిది సింధు”” అని అన్నాను ““అబ్బో ఎం చెప్పావ్ రా చక్కటి కవర్ డ్రైవ్, సర్లే నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ప్రైస్ చుడకు, దానికి ఎంత విలువ ఉండాలో చూడు”” అని అంది , అసలే కన్ఫ్యూషన్ లో ఉన్న, ఈ సింధు ఇంకా కన్ఫ్యూషన్ చేసింది.
బాగా ఆలోచించి , తనకి ఆకుపచ్చ రంగు గాజులు కొని గిఫ్ట్ ఇచ్చాను , తాను అవి చూసి “ ఈ గిఫ్ట్ రామ్ ఇచ్చాడా ? , కృష్ణ ఇచ్చాడా ? ”” అని అంది, కృషుడు అయితే , గాజులు కొని ఇవ్వడు, కొని చేతికి వేస్తాడు అని చెప్పాను. ““సరే అయితే నాకు కృష్ణుడు గిఫ్ట్ ఏ కావాలి, సాయంత్రం కలసి, కానుక ఇచ్చే కృష్ణుడా”” అంటూ గాజులు తీసుకోకుండా నవ్వుకుంటూ వెళ్లిపోయింది, నా గుండెలో రైలు పరిగెడుతున్నాయి. సింధు, సుధీక్ష, రవి ముగ్గురు మా మాటలు విన్నారు, సింధు వచ్చి నాతో ““నీకు ఎందుకు వచ్చిన ఓవర్ యక్షన్ మాటలురా , పో ఇప్పుడు evening కలసి గాజులు వేసిరా, నేను గిఫ్ట్ కి విలువ ఉండాలి అన్నా కానీ, మరీ గాజులు చేతికి వేసే అంత విలువ అనలేదురా ఎదవ”” అంటూ తిడుతుంది. ఉరుకోవే అసలే ఎం చేయాలో నాకు అర్ధం కావటంలేదు అని అన్నాను, ఈలోపు రవి గాడు ““evening వాళ్ళ villa లో పార్టీకి ఇన్విటేషన్ ఉంది కదా మనకి, సో అక్కడ టైం చూసి చేతికి గాజులు వేసెయిరా అని అన్నాడు, నేను వాడితో ““అబ్బా ఎం చెప్పావ్ రా general store నుంచి Lays ప్యాకెట్ తీసుకొచ్చేశాయి అన్నంత ఈజీగా. నా సావు ఏదో నేను సస్తా, మీరు నాతో పాటు వచ్చి సావండి పార్ట్ కి. Evening అందరం పార్టీ కి వెళ్ళాం.
రాధ ఇల్లు చాల పెద్దగా ఉంది , ఆ ఇల్లుని villa అంటారంట, నాకు అడుగు లోపల పెట్టడానికే భయం వేసింది, పార్టీలో ఎవరు లేరు అంత కాళిగా ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏమో అనుకున్నాం, రాధ డోర్ ఓపెన్ చేసి మా వైపు వస్తున్నప్పుడు, వెన్నెల వాకిట్లో, ఇంద్రధనస్సు లాంటి ఇంటిలో నుంచి, నక్షత్రం లా నడుచుకుంటూ వస్తునట్టు అనిపించింది నా కంటికి. మా అందరిని పలకరిస్తుంది, నేను ఇంకా పార్టీ స్టార్ అవ్వలేదా అని అడిగాను, ““మీరే పార్టీ , మీతోనే పార్టీ”” అని అంది రాధ. ఈలోపు సింధు ““అది ఏంటి రాధ నీకు ఇంకా ఎవరు ఫ్రెండ్స్ లేరా”” అని అడిగింది ““ఉన్నారు కానీ మీలాంటి ఫ్రెండ్స్ లేరు”” అని లోపలికి తీసుకొని వెళ్ళింది, ఇంట్లో రాధ పేరెంట్స్ కనపడలేదు, నేను రాధని అడిగాను, అంకుల్ ఇంకా ఆంటీ ఏక్కడ అని. ““డాడీ బిజినెస్ పనిమీద out of station, అమ్మ బయటకి వెళ్ళింది వచ్చేస్తుంది 2 hours”” అని అంది. అందరం మేడ పైకి వెళ్ళాం, తనకి కేక్ కట్ చేపించాం. సుధీక్ష, రవి ఇంకా సింధు ఏదో గిఫ్ట్ ఇచ్చారు రాధకి, ఈలోపు రాధ, ““మరి కృష్ణ గిఫ్ట్ ఎక్కడ”” అని అడిగింది. అది వినగానే సింధు ఇల్లు చాల బావుంది మేము చూడచ్చ అని అడిగింది, రాధ వాళ్లతో ““సరే వెళ్లి చూడండి”” అని అంది , నేను కూడా వాళ్లతో వెళుతుంటే , సింధు నాతో ““అరేయ్ పిచ్చోడా నీకోసం మేము వెళ్లిపోతుంటే మాతో వస్తావ్ ఏంటిరా పోయి రాధతో మాట్లాడు”” అంటూ వాళ్ళు కిందకి వెళ్లారు .
నేను, రాధ మేడపైన ఉన్నాం. మాకు తోడుగా చంద్రుడు, గట్టిగా కొట్టుకునే గుండె చప్పుడు వినపడకుండా పక్షుల పలకరింపులు, తెలియని చెమటని చెరపడానికి చిరు గాలి మాతో ఉన్నాయి. నా కానుక ఎక్కడ కృష్ణుడా అని అడిగింది రాధ. నేను వణుకుతూ తన చేతిని తీసుకొని, తన చేతిలో గాజులు పెట్టాను “”ఏ కృష్ణుడో చేతికి గాజులు వేస్తా అన్నాడు”” అంటూ రాధ నా కనుల వంక చూస్తూ అంది, నువ్వు రాధవో, గోపికవో ఇంకా ఈ కృష్ణుడికి తెలియలేదు అని అన్నాను. ““గోపికయితే ఏంటి”” అని అడిగింది, గాజులు కొని ఇచ్చేవాడిని అంతే, “”మరి రాధని అయితే, ఏంటి మరి”” అని అంది, ఈ పాటికి ఆ గాజులు ని చేతికి ఉండేవి అన్నాను. నిశ్శబ్దంకి నీడలా నిలిచింది రాధ. ఇంకా నేను మెట్లు దిగి కిందకి వెళుతుంటే, వెనకనుంచి “”నేను రాదనే కృష్ణ , నువ్వే కృషుడు కాలేకపోతున్నావ్”” అంటూ రాధ అంది. జాబిలి నీడలో జారిన మనస్సులో మాట అనుకుంటూ, ఇష్ట పడుతున్నప్పుడు ప్రతి పదంలో ప్రేమ పొదిగి ఉంటుంది. మనకి మసులుకునే మనస్సు ఉండాలి అంతే. నేను వెనక్కి తిరిగి తన కనుల వంక చూస్తూ , పైకి అడుగు వేస్తూ… To be continued on 4th Nov 2022.
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Wow.. too too too..beautiful story.. No words to explain.. if I want to explain I should become RAM.. 🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻
Thank you sooo much to your beautiful feedback, your comment itself showing how much you have been connected to the story, that gives a high feel to me #Sandeep Garu 🙂
Adhurs.
Thank you #Keshavrao Garu 🙂
This story always gives freshness to me ram garu i am eagerly waiting for next one
Thank you for your feedback #Narendra Garu, We will try to give the same Feel in coming chapters 🙂
Oh RAMayya❤!! Mothaniki nee Krishna leelalu ee kathalo chusam.. Ah Radha nenu ayithe baagundu anenthala kathani andhinchaav!!
Marinni anubhuthulni maalo kaliginchina Ram next chapter kosam vechi chuse… Oh Abhimani😊
Oh andham ayina feedback ki SREEkaram chutaru. matakuda mugaboyi, maro varam kosam vechi chudandi ani chepadam thapa em chepagalam <3
Nice sir every word what a explanation about feelings Radha and Ram Krishna Conversation last topic 😊👌
Thank you so much for great feedback #Lingaappa Garu 🙂
Ram garu
Oka preminche manusu lo unde prathi feeling ni Mee words tho chala baga vevarestunaru ee story na manusuki alukupoyindhi !!
Really Mee story writing ki pedda abimaneni ayipoyanu🙌🏻🥰
Dear Vaishavani Garu :)thank you for nice feedback and mi abimanani andhukunandhuku anandham ga undhi 🙂
Your narration will make readers to do parakayapravesam and feel the content. 👍
Thank you so much for your great words #lingaraj Garu 🙂
Your words are amazing really excellent
Thank you so much #Madhu Garu 🙂
Fabulous
Thank you soo much #Himabindu Garu:)
Ni story chaduvutunte malli premalo padali anipinchela vundi
Thank you so much #Raja Sekhar Jami Garu <3
Supar andi
Thank you for your feedback #Mahesh Garu and please share the story to your Friends and Family 🙂