HOME

6 వ అధ్యాయము


రధం  రహదారిలో  తారల  తళుకులు

నేను మెడ పైకి వెళ్లి రాధ ముందు నించున్న. చంద్రుడి నీడలో చంద్రబింబం లాంటి  తన కనులలో సిగ్గు, జలపాతంలా తన బుగ్గల మీదకు జారిపడి, సాయంత్రం సూర్యుడీల ఎరుపు ఎక్కాయి, శృతిమెత్తని  మృదువాటి  తన  చెయ్యిని తీసుకో అని నా మది మొరపెట్టుకుంటుంది. రాధ  చేతిని  తీసుకున్న వెంటనే, తన  గుండె చప్పుడు తన కనులలో వినపడింది. మెరిసిపోయే తన చేతులకి, గాజులు వేసే క్రమంలో కందిపోతే ఎలా అనుకుంటూ గాజులు వేసాను. నేను రాధని అడిగాను, గాజుల వల్ల చేతులకి అందం వచ్చిందా లేక చేతుల వల్ల గాజులకా?  అని.  ఆ ప్రశ్నకి సమాధానంగా ““చెంప గిల్లుతావు చేతి వేళ్ళతో, సిగ్గుని గిల్లుతావ్ చుసే చూపులతో”” అంటూ సిగ్గు పడి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. నేను కిందకి వెళ్లి నా మనస్సులో మాట చెప్పేద్దాం అని మెట్లు దిగుతుండగా, నా మొబైల్ కి ఊరు నుంచి మామయ్యా కాల్ చేసారు. నేను కాల్ లిఫ్ట్ చేశాను ””బావ గారి ఫోన్ ఎక్కడరా ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తటం లేదు”” అని అడిగారు, నేను ““ఏమో తెలియదు మావయ్య నేను ఇంట్లో లేను”” అన్నాను, ““సరేరా, బాలు బావ, ఆదేరా మీ నాన్నకి పెదనాన్న కొడుకు చనిపోయాడు అంట. నాన్నకి చెప్పి వెంటనే ఊరు వచ్చేయండి”” అని చెప్పి ఫోన్ పెట్టేసారు, నేను డాడీకి కాల్ చేశా, లిఫ్ట్ చేయలేదు. ఇక నేను వెళ్ళాలి అని రాధకి చెప్పి, నా మనస్సులో మాట చెప్పకుండా, పార్టీ మద్యలో నుంచి ఇంటికి వెళ్లిపోతున్నాను, తన కనుచూపులు నా చేతిని, వెళ్ళోద్దు అని కట్టేస్తున్నట్లు అనిపించిది.

నేను ఇంటికి వెళుతున్న దారిలో డాడీ కనిపించారు, డాడీకి మావయ్య చెప్పిన విషయం అంతా  చెప్పాను, డాడీ  నాతో  ““డ్రైవింగ్ లో  ఫోన్  వినపడలేదురా, సరే ముందు ఇంటికి వెళదాం నడు, ఈలోపు మీ అమ్మకి  ఫోన్  చేసి, బట్టలు సర్ధమని చెప్పు”” అని అన్నారు. మా ఇంటికి స్టార్ట్ అయ్యాం, ఆ రోజు రాత్రి ఊరికి బయలుదేరాం. డాడీకి అన్నయ్య అంటే నాకు పెదనాన్న. ఎప్పుడో ఒక పెళ్లిలో చూసాను మళ్ళి చూడలేదు. ఊరు వచ్చాం, పెదనాన్న ఇంటి దగ్గర చాల గొడవ…  గొడవగా ఉంది, చనిపోయిన ఇంటిలో గొడవలు ఏంటా అనుకున్న, ఇంతకీ ఎలా చనిపోయారు  అని అడిగితే, సూసైడ్ చేసుకొని అని చెప్పారు. నాకు ఎం అర్ధం కాలేదు, బాలు పెదనాన్న  అన్నలు, అక్క చెలెళ్లు, దగ్గెర చుట్టాలు ఎవరు రాలేదు, ఎం  అయింది  అస్సలు  అని  అమ్మ  అక్కడ  ఉన్న  వాళ్ళని   అడిగింది. చనిపోయిన   బాలు పెదనాన్న వాళ్ళ కూతురు, వేరే కులం అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది, అందుకే పెదనాన్న వాళ్ళ కుటుంబాన్ని, అందరూ దూరం  పెట్టేసారు, ఏ  మంచికీ, చెడుకి  పిలవడం మానేశారు  అంట. ఆ బాధ తట్టుకోలేక బాలు పెదనాన్న సూసైడ్ చేసుకున్నారు, మరి గొడవ ఇక్కడ దేనికి అవుతుంది అంటే, పెద్ద తాతయ్య ఆ చావుకి కూడా ఎవరిని వెళ్ళవద్దు అని చెప్పారు అంట. పెద్ద తాతయ్య చాల పాతకాలం మనిషి, మా కుటుంబాలు అన్ని తాతయ్య, ఇంకా పెద్ద తాతయ్య చెప్పిన మాటలే విటారు, కానీ మా డాడీకి, ఆ నిర్ణయం నచ్చలేదు, తాతయ్యలు దగ్గెర డాడీకి కొంచెం చనువు ఉంది, ఆ చనువుని దైర్యం    చేసుకొని వాళ్లకి ఎదురు మాటలాడి మొత్తానికి ఒప్పించారు.  ఒక షరత్తు మీద, అది ఏంటి అంటే బాలు పెదనాన్న శవాన్ని, తన కూతురు చూడకూడదు అని.  ఇంకా డాడీ ఎం చెప్పలేక సరే అని, అందరూ కలసి, ఆ కార్యక్రమాన్ని పూర్తి  చేసారు. బాలు పెదనాన్న కొడుకు అభి, మా డాడీని పట్టుకొని ““మణి బాబాయ్ నువ్వు లేకపోతే మా నాన్నని అనాధ శవంలా తీసుకొని వెళ్ళేవాళ్ళం”” అంటూ ఎక్కి, ఎక్కి… ఏడుస్తున్నాడు. అభి అన్నయ వాళ్ళ అమ్మ, అదే పెద్దమ్మ, మా అమ్మ ని కౌగిలించుకొని, డాడీకి చేతులతో నమస్కారం చేస్తూ కృతజ్ఞత చెప్పింది.

మరసటి రోజు, డాడీ నాతో మనం ఇక్కడే కొన్నిరోజులు ఉండాలిసి వస్తుంది, నీకు class’s miss అవుతాయి అనుకుంటే నువ్వు వెళ్ళ వచ్చు అని చెపుతూ ఉండగా, తాతయ్య వచ్చారు. మనవళ్ళని, మానవరాళ్ళని అందరిని పిలిచారు, అందరితో  తాతయ్య ““చూడండి అబ్బాయిలు, అమ్మాయిలు, మీ అక్క అదే బాలు గాడి కూతురు, ప్రేమ వివాహం అందులోనూ కులాంతర  వివాహం చేసుకుంది, దానికి తగిన పరిణామాలు చూసారుగా, కాబట్టి ఒళ్ళు దగ్గెరా పెట్టుకొని  బుద్ధిగా ఉండండి, ఏదో మీ మణి బాబాయ్ నన్ను ఒప్పించాడు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది, ఒక వేళా నేను ఒప్పుకోకుండా ఉంటె అభి, పరిస్థితి ఏంటో కూడా మీకు అర్ధం అయి, ఉంటుందిగ  అందుకే ఇంకా ఎవరు ఇలాంటి పరిస్థితి మీ తల్లి, తండ్రులకి రాకుండా చూసుకోండి” అని  సీరియస్ గ చెప్పి వెళ్లిపోయారు.

నాకు ఇక్కడ అర్ధం కానిది ఏంటి అంటే, ఇదే ఇద్దరు తాతయ్యలు, ఒక సారి మా ఊరిలో బాగా డబ్బు ఉన్నపెద్దమనిషి కొడుకు ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే, జంట బాగుంది  అని  చప్పట్లు కొట్టిన వాళ్ళు, ఇప్పుడు బాలు పెదనాన్న విషయంలో ఇంత కఠినంగ ఎలా ఉన్నారు.  అని నాకు అర్ధం కావటం లేదు. నన్ను ఆ ప్రశ్న పిచ్చి వాడిని చేసింది, ఆఖరికి నాకు అర్ధం అయింది ఏంటి అంటే డబ్బు. శవంకి, మృత దేహనికి మధ్య మాట మార్పుకి మూలం, నా మనస్సుకి అర్ధం అయింది.

ప్రేమకి, పెళ్ళికి డబ్బు కావాలి అని తెలిసిన నాకు, ప్రేమ పెళ్ళికి పలుకుబడి కూడా ఉండాలి అని తెలిసింది, వయస్సుకి మించిన అనుభవాలు, అనుభవంకి మించిన ప్రశ్నలు నాలో తలెత్తుతున్నాయి. సమాదానాన్ని శోధిస్తుంటే, డబ్బు అనే సమాధానం దగ్గెర నా ప్రశ్న దహనం అయిపోతుంది.

నా కుటుంబ పట్టింపులకు రాధ నా జీవితంలో ఉంటుంది కానీ నా జీవితం అంత కాదు. ఒక వారం అక్కడే గడిచిపోయింది, తిరిగి హైదరాబాద్ వచ్చేసాము, బాలు పెదనాన్న విషయం నన్నుచాల Disturb చేసింది, కొత్త విషయాలని తెలిపింది, ఒకటి దక్కాలి అంటే ఒకటి వదులుకోవాలి, అది మానవ జీవిత నైజం, కానీ వదులుకునేది ఙివితం మొత్తం మదిలో మెదులుతు ఉంటుంది అంటే, దక్కించు కోవలిసింది దూరం పెట్టడమే మంచిది. బాలు పెదనాన్న కూతురు విషయంలో ఇలా కాదు, తండ్రిని దూరం పెట్టలేదు, ప్రేమించిన వాడిని దూరం పెట్టలేదు, తాను తీసుకోలేక, తీసుకున్న నిర్ణయం వల్ల, తండ్రి చివరి చూపు దక్కలేదు. తన కట్టే కాలే అంత కాలం, తన   మనస్సు మీద మోస్తూనే ఉండాలి, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మరి రాధని పొందడం ఎలా?, ఎం  చేయాలి? పోనీ రాధకి జరిగిన విషయం చెప్పుదాం అనుకున్న, కానీ మగవాడి మనస్సులో ఉన్న ఆలోచనలు నన్ను ఆపేసాయి. రాధని పొందాలి అంటే నేను బాగా సెటిల్ అవ్వాలి అది ఒక్కటే దారి, రాధ వాళ్ళుపెద్ద ఇంటి వాళ్లే, నా కుటుంబం కూడా అదే స్థాయికి చేరాలి. భవిష్యత్తులో సుఖాల చిరునామాలు, ప్రస్తుతంలో కష్టాలా కొలిమినుండే కదులుతాయి    అని అందరూ అంటారు అది నిజమే అనిపించిది.  అయినా రాధ నా మనస్సుకి నచ్చింది కానీ నా ప్రాణంకి ఇంకా అలవాటు అవ్వలేదు కాబట్టి, రాధని దూరం పెట్టడం కష్టం ఏమో కానీ అసాధ్యం మాత్రం కాదు, అని నా మొబైల్ అమ్మకి ఇచ్చేసాను, రాధకి నాకు మాటల సారధి అదే కాబట్టి.

కాలేజ్ కి గుండె ధైర్యం చేసుకొని వెళ్ళాను, రాధ నావంక చూసే చూపు ప్రేమ పలికిస్తున్న, నా మనస్సు మాత్రం నాతో “”ఇష్టం పెంచి, ప్రేమ అందించి వచ్చే రోజుల్లో వీలు అవటం లేదు అని  చేప్పి బాధ పెట్టడం కంటే ఇప్పుడు దూరం పెట్టడమే మంచిది రాధకి”” అంటూ నా మనస్సు  చెప్పింది. రాధ నా వద్దకు వచ్చి, ““ఎం కృష్ణుడా గోపికలనే విడిచి వెళ్ళిపోతావ్ అనుకున్న కానీ రాధని కూడా విడిచి వెళ్ళిపోతావ్ అనుకోలేదు ””అంటూ నా వంక  చూస్తుంది, నేను మనస్సులో  “”జరిగేది ఇంకా అదే రాధ”” అనుకోని, హాయ్ చెప్పి క్లాస్ లోకి వెళ్లిపోయాను. రాధని కొంచెం…  కొంచెంగా… దూరం పెడుతున్న విషయం రాధకి అర్ధం అయింది, నెలలు గడిచిపోయాయి. ఇంటర్ 2nd ఇయర్ Exams కూడా అయిపోయాయి, రవి, సుధీష్ ఇంకా సింధు ముగ్గురు MBBS foreign countries లో చేదాం అని వాళ్ళ చిన్ననాటి కల, వాళ్ళు దానికోసం busy… busy…గా ఉన్నారు, నేను ఇండియాలో మంచి కాలేజ్ లో సీట్ రావాలి అని EMCET లో good score కోసం  ప్రిపేర్ అవుతున్న. రాధని చూసి దాదాపు రెండు నెలలు అయిపోయింది అనుకుంటూ గడుపుతున్న రోజులో EMCET ఫలితాలు వచ్చాయి, నాకు చెన్నైలో సీట్ వచ్చింది, తమ్ముడు ఇంటర్ ఎలాగో ఇక్కడే చదువుతున్నాడు, నేను చెన్నై వెళ్లిన,  అమ్మ , నాన్నలకి  తోడుగా  ఉంటాడు అని, నేను డాడీని ఒప్పించి  చెన్నై వెళ్లడానికి సిద్ధం అయ్యాను, రవి ,సుధీక్ష  ఇంకా  సింధు వాళ్లకి కూడా అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యాయి MBBS చేయడానికి, వాళ్లు నా కన్నా మూడు  రోజుల ముందు Britain  వెళుతున్నారు, మొత్తానికి వాళ్ళు వెళ్లే  రోజు వచ్చింది, నేను airport కి  వెళ్ళాను.

చూపుల   భాషలో  మౌనం  మాటలాడుకుంటుంది  మా  నలుగురి  మధ్య, సింధు  నాతో  ““మంచి  కాలేజ్  లో  సీట్  వచ్చింది  అనుకుంట  నీకు”” అన్ని అడిగింది, నేను అవును అన్ని చెప్పి, ““రాధ వస్తుందా  airport కి””  అని  అడిగాను  ““నేనే  రావద్దు  అని  చెప్పాను  నువ్వు  దూరం  పెట్టె   కొద్దీ,  ఆ  పిల్ల  నీమీద  ఆశలు  పెట్టుకుంటూ  పోతుంది, నువ్వు  మాట్లాడం  మానేసావు  అంటే  గట్టి  కారణం  ఉంటుంది,  ఆని  నేను  అడగలేదు  కానీ  నాకు  ఇప్పుడు  చెప్పు అస్సలు ఎందుకు  రాధ ని  దూరం  పెట్టావు”” ఆని  అడిగింది  కోపంగ  సింధు.

 “నా ఈ ప్రయత్నం తనని పొందడానికే, నా ఈ కష్టం తనతో కలసి ఏడూ అడుగులు వేయడానికే, ప్రతి కథలో ఎంత పెద్ద రాజు అయినా, ప్రతిసారి యుద్ధం లో ఒక్కడే రాజ్యం ని గెలవలేడు, వాడికి కూడా సైన్యం కావాలి, అలాగే నా కథలో రాజ్యం అంటే రాధ, యుద్ధం అంటే నా ప్రేమ, సైన్యం అంటే నాకంటూ నేను గొప్పగా ఏదో ఒకటి సాధించడం. గెలుస్తానో గెలవనో తెలియని యుద్ధంలో పడ్డాను, ఎప్పటిలా తనతో కలసి ఉండి తన ఆశలని ఎర వేస్తూ అడుగు ముందుకు వేసి చివరికి వదిలేస్తే దాని పేరు మోసం అంటారు. మోసం కన్నా మనస్సు బాధ పడడమే మంచిది అనిపించింది నా మనసుకి. నా గురించి వేచి చూస్తుందో, విరక్తి పెంచుకుంటుందో కాలానికే వదిలేసాను”” ఆని చెప్పాను, దానికి సింధు““మరి ఇది అంత రాధకి చెప్పచుగ””  ఆని అన్నది  ““ఆడ  పిల్ల మనస్సు తామరాకు పై  నీటి  బొట్టు లాంటిది ఒకొక్క సారి, ప్రేమలో ఉంటె పరిస్థితులను పట్టిచుకోరు, అందులో అక్కడ రాధ పంతం పట్టి కూర్చుంటుంది”” ఆని అన్నాను.

వాళ్ళ flight కి టైం అయింది, మా వీడుకోలులో విడిపోతునం అనే విషాదం వచ్చి వాలింది, దానికి మళ్ళి కలుస్తాం కదా ఆని కన్నీటితో కడిగి, send-off ఇచ్చి ఇంటికి వచ్చాను. స్నేహితులు లేనపుడు జీవితం అస్సలు అయినా ఒంటరి తనంలా అనిపించింది. నేను చెన్నైకి వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను, ఒక రోజు రాధ వాళ్ళ నాన్నగారు, మా డాడీతో ఏదో పని ఉంది ఇంటికి వచ్చారు, మాటల మధ్యలో నా కాలేజ్ వివరాలు అన్ని అడుగుతూ, ““నేను నా కూతుర్ని B-tech చేయమన్నానురా కానీ అది Degree చేస్తా అంటుంది సరే తన ఇష్టం ఎందుకు కాదు అనడం ఆని నేను ok ఆని చెప్పేశా”” ఆని నాతో అంటూ, డాడీని తీసుకొని ఎక్కడికో వెళ్లారు. నేను  చెన్నై వెళ్లవలి సిన రోజు వచ్చింది, మొట్ట మొదటి సారి అమ్మ, నాన్నని వదిలి దూరంగ  వెళ్లడం ఇదే మొదటి సారి, నన్ను drop చేయడానికి స్టేషన్ కి అందరూ వచ్చారు, రోజుకి ఒక సారైనా కాల్  చెయ్, సమయానికి తిను, ఎవరితో గొడవలు పెట్టుకోకు అంటూ అమ్మ చెపుతుంది, హాస్టల్  జీవితం అందం అయినది, దానిని హద్దులో ఉంచి ఎంజాయ్ చెయ్ ఆని డాడీ అంటున్నారు, తమ్ముడు మాత్రం, నువ్వు వీళ్లకి నన్ను బలి చేసి, నువ్వు చెన్నై చెక్కేస్తున్నావ్ రా అన్నయ  అంటూ అక్కడ ఉన్న వాతావరణాని నవ్వుల మయ్యాం చేసాడు. ట్రైన్  స్టార్ట్ అయింది, నాకు  మాత్రం నా కుటుంబాని పైస్థాయికి తీసుకొచ్చి రాధని పొందడానికి నా జీవిత పరుగు మొదలు  అయినట్టు అనిపించింది.

చెన్నైకి చేరుకున్నాను, కాలేజ్ హాస్టల్ కి వెళ్లగానే నా ఇంటర్ ఫ్రెండ్ విశాల్ కూడా అదే కాలేజ్. ఏంటి బావ చెప్పలేదు అస్సలు ఆని నేను వాడిని అడిగాను, వాడు నాతో ““నాకు ముందే తెలుసురా నీకు ఈ కాలేజ్ లో సీట్ వచ్చింది ఆని, వచ్చాక surprise ఇద్దాం ఆని చెప్పలేదు”” ఆని  అన్నాడు, హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి, ఇద్దరికి ఒకే రూమ్ మాట్లలాడుకున్నాం, రూమ్ లో అన్ని  సర్దుకొని, డాడీకి కాల్ చేశా  ““విశాల్ కూడా మా కాలేజ్ ఆని చెప్పి, ఇంట్లో అందరితో మాట్లాడి , రేపటి కాలేజ్ స్టార్టింగ్ డే గురించి ఆలోచిస్తూ పడుకున్న. పొద్దునే  కొత్త  ఆరాటంతో, పాత  బాధ్యతతో లేచి రెడీ అయి  కాలేజ్ కి వెళుతున్నాను, చాల పెద్ద క్యాంపస్ , క్లాస్ కి వెళుతున్న  దారిలో, ఒక వైట్ apron వేసుకొని భూమికి నాలుగు అడుగులతో, కనుబొమ్మలను ఇంద్రధనుస్సులా ఎగరేస్తూ, పొగరుని కాటికాల కళ్ళకి రాసుకొని, గులాబీకి గుబులు తెప్పించే  ఎర్రటి పసి పిల్ల పెదవుల రంగుతో తన పెదవిని పంటి  క్రింద పెట్టి . రధం  రహదారిలో  తారల  తళుకులు లాగా   రధం  లాంటి  రాధ  వైపు ఒకటే  చూసే  నన్ను, తారాల   తన  వైపు  చూసేలా  ““అరేయ్  చిన్న””  అంటూ  పిలిచినా  అమ్మాయి  పేరు  తార.

**మన  కథకి  రెండో  కథనాయకో, లేదా  ఆలస్యంగా విచ్చేసిన  అసలైన  కథనాయకో వచ్చే  అధ్యాయాలే ఆధారం** To be continued on 11th Nov 2022.

NEXT CHAPTER

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.5 8 votes
Article Rating
Subscribe
Notify of
guest

16 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sandeep kumar Kontham
Sandeep kumar Kontham
2 years ago

So heavy story but beautiful story.. keep it up ram..💐💐💐

Sree
Sree
2 years ago

Yudham geliche RAMudo😍
Maguvala manasu dhoche KRISHnudo❤… thelaka mundhe kathani ila maluputhippave Ramayya!!

Radha sonthamo? Thara sonthamo…??

Paathra edaina.. Gelupu evaridhi ayina Sare… Mee kosam(next chapter) eduru chuse Radha (Abhimani☺)

Vaishnavi
Vaishnavi
2 years ago

Reality lo una vishayalu story lo kanipistunai Mee story lo prathi okati na heart ki connect avutundi!!
Antha bagundi madaya lo ee Tara evar andi ram garu😂

Madhu
Madhu
2 years ago

Wow mind blowing words really I am big fan of you lovely storie 😍😍😍😍

Lingaraj
Lingaraj
2 years ago

Nice Ram. You left us in Chennai. We will be waiting there till next chapter.

Veeresham
Veeresham
2 years ago

When 7th part will come

Veeresham
Veeresham
2 years ago

Thank you sir I like this story

Ashwini
Ashwini
2 years ago

Super bro nee thoughts ki hands off. Awesome sentence formation. Again new character this is amazing. 👍super twist in the story. Lets see further chapters who will win your♥️.