HOME

7 వ అధ్యాయము


ఇష్టం  అని  చెప్పుకోకుండానే  ప్రేమికులం అయ్యం

చిన్న  పిల్లకి  చెడ్డి  వేసినట్టు ఉంది, ఇది  నన్ను   చిన్నా  అంటుంది  ఏంటిరా   అని  తన  వైపు  వెళ్ళాను, తీరా  చూస్తే  ఆ  అమ్మాయి, మా  తమ్ముడు  కంగారు పెట్టి  Tease చేసిన  శ్రీనివాస్  అంకుల్  పెద్ద  కూతురు, తను  నన్ను గుర్తు పట్టలేదు  కానీ  నేను   తనని  గుర్తు పట్టాను, తన  ముందుకు  వెళ్లి   నిలుచున్న  ““ఎరా  సీనియర్స్ కి  good morning చెప్పే  అలవాటు  లేదా, ఎం  పేరురా  నీది“” అంటూ  పొగరుగా  అడిగింది, ఆడపిల్లకి  అంత  పొగరు  ఉండకూడదు,  అనుకుంటూనే  ఆ  పెదవుల  రంగుకి  ఆ  మాత్రం  ఉండాలి  అనుకుంటూ   “నా  పేరు  రామ  కృష్ణ , మా  అంకుల్  పేరు  శ్రీనివాస్ , మాది   Hyderabad madam అని  చెప్పాను   నవ్వుతూ ” తన  పక్కన  ఉన్న ఒక అమ్మాయి, ““మీ  అంకుల్  అంత  తోపుగాడా  , మీ  father  పేరు  చెప్పకుండా   మీ  అంకుల్  పేరు  చెపుతున్నావ్  ఫస్ట్“” అని  అంటుంది, “”అవును  madam  ఎంత  తోపో  మీ  friend తార  కి  తెలుసు  ఒక  సారి  అడగండి”” అని  అన్నాను , తార కి  మేటర్  మొత్తం  అర్ధం  అయింది , “”మీరు  మణి  కుమార్  అంకుల్  అబ్బాయి  ఆ””  అని  అడిగింది  నన్ను, నేను  అవును  Madam, Good morning అండి, సీనియర్స్  కి  ఇంకా  ఏమైనా  చెప్పలా, పోనీ  సీనియర్స్  వాళ్ళ Father కి  ఫోన్  చేసి  ఏమైనా  చెప్పలా అని  అడిగాను, తాను  వెంటనే  ““ఊరుకోండి మేము  సీనియర్స్  ఏంటి,  ఏదో  కొత్తగా  కనపడ్డారుగా  క్యాంపస్ లో  అని  పిలిచాము  అంతే,  మీరు  మెల్లగా  క్లాస్  కి  వెళ్ళండి, మేము  కూడా  వెళ్తాము, bye””  అంటూ  వెళ్ళిపోతున్నారు ““తార  గారు , నేను   శ్రీనివాస్  గారికి  కాల్  చేసి  good morning చెప్పకూడదు  అంటే  మీరు  నాకు  ఒకటి  చెప్పాలి  అండి” అని  అన్నాను, తార  వెంటనే, నోటిలో  తిట్టుకుంటూ, Sorry రామ్ గారు అని  చెప్పింది   నేను  రామ్  కాదు  అండి  రామ  కృష్ణ  అని  చెప్పాను , తాను  కోపంగా  సరే  రామ  కృష్ణ  గారు  Sorry  అని  చెప్పి   పరిగెట్టుకుంటూ  వెళ్లిపోయారు , నాకు  తార  కోపంలో  ఉన్న  ముఖం  చూసిన  వెంటనే  రాధ  గుర్తుకు  వచ్చింది.

క్లాస్  కి  వెళ్ళాను, కొత్త  పరిచయాలు  పలకరిస్తూనా, మా  విశాల్  గాడు  సరిపోతాడు  అనిపించింది  నాకు. క్లాస్ కి Professor వచ్చారు  ““welcome to the new life, ఇక్కడికి  ప్రతి  year, ఎదో  గొప్పగా  సాదిద్దాం అని  కొంత  మంది, just  పాస్  అయి  జాబ్  వస్తే  చాలు  అని  కొంత  మంది వస్తారు, but 5% of the students, 1st type ఉంటారు, అని  అన్నారు, Professor నా గురించే  చెపుతున్నారు  అనిపించింది  నాకు, మొదటి   రోజు Professor మాటలతో, కొత్త  పరిచయాలతో ఆ  రోజు  కాలేజ్  పూర్తి  అయింది  నాకు. నైట్ ఇంటికి  ఫోన్  చేసి  మాట్లాడి పడుకున్న.

మరుసటి రోజు, campus మొత్తం  చూద్దాం  అని  నేను విశాల్  ఇంకా  కొంత మంది  ఫ్రెండ్స్  పొద్దునే  కాలేజ్ కి  వెళ్ళాము, మా  campus మొత్తం  చూసాము, మా  కాలేజ్ లో  medical campus కూడా  ఉంది  అది   కూడా  చూసి  వద్దాం  అని  వెళ్ళాం, అక్కడ  తార  గెంతులు  వేస్తూ , అల్లరి  చేస్తూ  తన  ఫ్రెండ్స్ తో  మాట్లాడుతుంది, నేను  తనని  చూసి తండ్రి  పోలికలు  ఎక్కడికి  పోతాయిలే  అనుకోని,  Hi తార  గారు  అంటూ  పలకరించాను, పక్క నుండి  తన  స్నేహితురాలు, ““వద్దే, వాడు  జాదుగాడిలా  ఉన్నాడు  నీతోనే  ఒక్క రోజులో  రెండు  సార్లు  Sorry చెప్పించాడు”” అంటూ  తనని  ఆపేసారు, తాను  నాకు  Hi చెప్పి అక్కడి  నుండి  వెళ్లిపోయింది. తార  అని  ఏ  నిమిషం  లో  పేరు  పెట్టారో  కానీ, తను  అలాగే  ఉంటుంది , చల్ల గాలి  వచ్చి , వాలాలి అనిపించే ఒంపులతో, తన  పేరులో  ఉన్న  మెరుపుని, తన  కనులలో కలిపి, ఆభరణాలు  బదులు, అణువు… అణువు  అంత  అందాన్ని అలంకరించుకొని, కళ్ళలో కరుణ, పెదవుల పద్దలో పొగరు  కల్పిన  అమ్మాయి  తాను.

రోజులు గడిచిపోతున్నాయి, Freshers day వచ్చింది, కాలేజ్ వాళ్ళు చాల programs  పెడుతున్నారు, నేను  కవితల  పోటీలలో  పేరు   ఇస్తూ  ఉండగా, తార  నా దగ్గరకు వచ్చింది. చెప్పండి  తార  గారు  అని  అన్నాను, దానికి  తార  నాతో  “”అబ్బ  ఆపుతావా,  ఏదో  సరదా కి  చేశాను  నేను, నువ్వు  అదే  పట్టుకున్నావు  ఏంటి”” అని  అంది, అవును  నేను  అదే  పట్టుకున్నాను , సరదా  నువ్వు  వదిలేసావు, నేను  సరదా  ని  సాగిస్తున్నాను“” అని  అన్నాను, “అబ్బో  బాగానే  మాట్లాడుతున్నావ్, సరే  కానీ  నేను  Salsa dance  వేయాలి  అంట,  అందులోని  చీరలో ” అంటూ  చెప్పుతుండగా నేను  ““మంచిది, dance సరిగ్గా లేకపోయినా, సూపర్  అని  అరవాలా, సరే  నేను  నా  ఫ్రెండ్స్  అరుస్తాములే“” అని  చెపుతుండగా.  అది  కాదు  రామ  కృష్ణ  అని  అంది, ““మరి  ఏంటో  చెప్పు  అన్నాను, ““నాతో  salsa dance వేస్తావా?“” అని  అడిగింది , నేను  ఎం  మాట్లాడలేకపోయా, అయినా  నీకు  ఫ్రెండ్స్  ఉన్నారుగా  ఇంకా  ఎవరినైనా  అడగోచ్చుగా  అని  అన్నాను  “”నువ్వు  ఉంటే  కొంచెం  comfort గా ఉంటుంది  అని  నా  మనస్సుకి అనిపించింది, పైగా   తెలిసిన  వాడివిగ“” అంటూ  చెప్పుకుంటూ వచ్చింది,  నేను  తన  ఇబ్బందిని అర్ధం  చేసుకొని  తనతో   సరే  అని  డాన్స్  వేయడానికి   ఒప్పుకున్నాను.

తాను చీర   కట్టుకొని  వస్తుంటే , చంద్రుడు  చల్లగాలిని తన  కొంగు   చాటు    నడుములోకి   పంపించాడు, నల్లని    మేఘాల    మధ్యలో  తార, తారాల  తల… తల…   కనిపిస్తుంటే, తెల్లని మెత్తని   మేఘం లాంటి    నడుముపై    నల్లని   నక్షత్రంలా    తన  పుట్టు   మచ్చ   కనిపించింది, పాపం  తాను  ఆ  పుట్టుమచ్చని దాచలేక , చీరని  చుట్టుకోలేక  పడుతున్న  ఇబ్బంది  చూడాలి, చంటి  పిల్ల  కి  చీర  కట్టినట్లు   అనిపించింది ““తాను  నా  ముందుకు వచ్చి  నిల్చుంది. నువ్వు  చీకటిలో  మెరిసే  తారావే  అనుకున్న  కానీ  వెలుగులో  నల్లని  నక్షత్రాన్ని  కూడా  మెరిసేలా  చేస్తావ్”” అని  నవ్వుతూ  అన్నాను , తార  వెంటనే  నా  వంక  చూసి, “”దొంగ చూపులోడా, చూసి  సచ్చవా, నువ్వు  చూస్తున్నావు అని కూడా  నాకు  తెలియలేదురా, అమ్మాయి  చూపుకి దొరకని  చూపులు నీవి, నడు  ఇంకా  వెళ్లదాం”  అని , dance వేయడానికి  తీసుకొని వెళ్ళింది , ఆ    వెలుగుల  చీకటి  లో  తన  పేరు  మల్లె, తాను  తారల  మెరిసిపోతుంది, నా  ఉపిరిని  ఆపేసేలా  తన  ముంగురులు  నా  మది  మీద  పడుతున్నాయి, రవి  వర్మ  బొమ్మకి, బాపు  గారి  ఒంపుల  అక్షరంతో  సంతకం  చేసినట్టు, తన  అందం  అయినా  బొమ్మలాంటి  రూపంకి  బాపు  గారి  అక్షరంలో  ఒంపుల  మల్లె  , తన  వలపుల, ఒంపుల  వయస్సు  వేడి  నా  వేళ్ళకి  తెలుస్తుంది, నా  మనస్సుకి  రాధ  వెంటనే  గుర్తుకు  వచ్చింది , నేను  తార తో  ఒక్క నిమిషం  కూడా  ఇంక  ఉండలేకపోయాను, I’am sorry అని  చెప్పి   తనని  వదిలి  వెళ్లిపోయాను , ఒంటరిగా  garden లో  కూర్చున్నాను, ఈ లోపు  కవితల  పోటీలో  పేరు  ఇచ్చిన వారిని  పిలుస్తున్నారు, నన్ను  పిలిచారు, నా  కవిత  అందరికి  చెపుతున్నాను  ఇలా.

ఈ దూరం  దారులను  తెరిచింది , నీకు  దగ్గర  అవ్వడానికి …

దగ్గర  అవుతావో ?, దక్కకుండా  పోతావో ?

 

నీ  ఊసులతో  ఉదయించే  ఉదయం…

నీ  జాడ  లేక .. నీ  ఆలోచనలతో  అస్తమిస్తుంది …

 

నీ  కబురులతో  కదిలే  కాలం … నువ్వు  కానరాక …

వర్షం  నింపుకున్న  మేఘంలా … కనపడని  కన్నీరు నింపుకుంటున్నాయి  కనులు …

 

నీ  అలికిడి  లేని  చోటు…

నా  ఆనందం  అదృశ్యం  అయిన  చోటు…

నీతో  మాట్లాడిన మాటలు  మరువలేక .

నీతో  మరో  సారీ  మాట్లాడలేక

మనస్సులో   నిశ్శబ్దంతో, స్నేహం  చేసే  అక్షరాలు.

అర్ధం  లేని , అంతు  లేని , అంతం  కానీ , కత్తులు  అవసరం  లేకుండ  కనపడని  కన్నీటి యుద్ధం  చేస్తుంది….

నా  కవిత  వినగానే , అబ్బాయిల  కన్నా, అమ్మాయిలు  ఎక్కువగా   అరవడం  మొదలు  పెట్టారు, events  అన్నిcomplete  అయిపోయాయి , తార  ని  అడిగాను , ఎలా  ఉంది  కవిత  అని , నువ్వు  చుసిన   నల్లని  నక్షత్రం  కన్న, నేను  విన్న   కవితకి  కాంతి  ఎక్కువగ  ఉంది  అని  చెప్పింది, అల్లరి  పిల్ల  కదా  ఆకతాయి  తనంతో  చెప్పింది  ఏమో  అనుకున్న, Next day కాలేజ్ కి   వెళ్ళాను, lunch break లో  తార  వచ్చింది, నేను  “”Hi doctor, ఏంటి  ఇలా  వచ్చారు, medical checkup ఏమైనా  conduct చేస్తున్నారా””  అని  అడిగాను, ““నువ్వు  డాన్స్  మధ్య లో  నుంచి   ఎందుకు  వెళ్లిపోయావ్  అని  అడిగింది. రాధ  గురించి  చెప్పే  అంత  close  అవ్వలేదు తార  నాకు, అందుకే  “మరి  అంత  అందాన్ని అంత  దగ్గెరనుంచి చూడ్డం నాకు  ఊపిరి  ఆడనంత పని అయింది””  అందుకే  వెళ్ళిపోయాను అని  cover  చేసి  చెప్పాను. ““అబద్ధంని, నీ అంత  అందంగా  చెప్పావ్  నాకు  నిజం   కావాలి  చెప్పు  ఎందుకు  వెళ్లిపోయావ్  అని  అడిగింది  మళ్ళి”” సరే  చెపుతా, నేను  అడిగింది  ఇస్తానంటే చెపుతా,  అని  అన్నాను , నేను  ఎం  అడుగుతానా అని  తనకి  కొంచెం  భయం  వేసి, “”సమాధానం  నీ  దగ్గెరే పెట్టుకో””  అని  వెళ్లిపోయింది, విశాల్  వచ్చి  నాతో  “అరేయ్  బావ  ఒక  వేళ  తార  అడిగింది  ఇస్తాను  అంటే  ఎం  అడిగేవాడివిరా”” అని  అన్నాడు, ఏమి  అడిగేవాడిని  కాదు , ఆ  ప్రశ్న  వేయకపోతే  ఆ  పిల్ల  వెళ్ళదు   అందుకే  ఆలా  అన్న,  అని  చెప్పి, class కి  వెళ్లిపోయాం.

కాలం నా  గమ్యం  వైపు  వేగంగా  వెళ్లిపోతుంది , B-Tech 2nd year exams కుడా  అయిపోయాయి, నేను  holidays  కి  ఇంటికి  వెళ్ళాను, అమ్మ  నాతో  ఏంటి  రా  ఇంత  సన్నగా  అయిపోయావు, పోయిన  ఏడాది  వచ్చినపుడు  కొంచెం బాగున్నావ్  అంటూ, నాకు  నచ్చిన  వంటలు   అన్ని  చేస్తుంది, ఇంటికి  వచ్చి  రెండు  రోజులు  అయ్యింది, రాధని  చూసి  రెండు  సంవత్సరాలు  అయ్యింది, అని  వాళ్ళ   villa వైపు  వెళ్ళాను, తాను  కనపడలేదు, ఇంతలో  డాడీ  call చేసి    ఎక్కడ  ఉన్నావ్ రా  అని  అడిగారు, ఇక్కడే  పక్కనే  ఉన్నాను  డాడీ , ఏమి  అయినా  కావాలా  అని  అడిగాను, ఒక  సారి  office కి  రారా, అని  అన్నారు, నేను  అక్కడ్నుంచి  డాడీ  office కి  వెళ్లి   office బయట  నిల్చున్న, నా  కంటి  ముందు  రాధ  కనపడింది, తనని  నేను  చూస్తూ  ఉండిపోయా, మళ్ళి నా  కనులు  తన  చేతి  వేళ్ళ వైపు  వెళ్లాయి, కానీ  తన  చేతిని  ఇంకో  అబ్బాయి  పట్టుకొని  నడుస్తున్నాడు, అది  చూసి  నా  బుద్ధిని  నేను  కోల్పోయాను, తన  చేతిని  పట్టుకున్న మనిషి, అన్నయో, కజినో లేక  మంచి  స్నేహితుడా  అని  ఆలోచించలేకపోయాను, రాధ  ఆ  అబ్బాయి  ని  ఇష్టపడుతుందా? అని  ఒకటే  ఆలోచన  తప్ప  ఇంకా  ఏమి  నా  మదిలో  మెదలటం   లేదు, తప్పు  నాదే  నీ కోసమే  నేను  వెళుతున్న, రాధ  అని  ముందే  చెప్పి ఉండాల్సింది  సింధు  చెప్పినట్లు. అయినా  నీకు  ఎందుకు  రా  ఈ  ప్రేమ, ఇష్టం  అన్ని . తన  మొదటి  కలయిక  లోనే  కన్నీళ్లను కనపడకుండా  కదలడం  నేర్చుకున్నావు, ఏదో  ఒక  రోజు  ఆ  కన్నీళ్లే మిగులుతాయి  అని  తెలియదా  అంటూ  నాలో  నేను , నాకు  నేను  తిట్టుకుంటూ, అగ్ని  గోళ్ళాని  మౌనం  గా  మోసే  అగ్ని  పర్వతంలా  ఇంటికి  వెళ్ళాను, రాధ  నన్ను చూసిన  చూపులో  ఎం  వెతుకోవాలో  కూడా  నాకు  అర్ధం  కావటం  లేదు, ఆ   రోజు  రాత్రి  నాకు  ఆలోచనల  పంజరంలో  పట్టుబడినట్లు, ఊపిరి  తీసుకోవడం  అతి  కష్టంగా  ఉన్నట్టు  అనిపించింది, ఊహ  తెలిసిన  తర్వాత  అమ్మ  కాకుండా  ఇంకో  అమ్మాయిని  ఇష్టపడింది, ప్రేమించింది  రాధనే, సింధుకి  ఫోన్  చేద్దాం అనుకున్న  కానీ  చేయలేదు, సెలవులు  అన్ని  రాధ  ఆలోచనతో  అయిపోయాయి, తిరిగి  నేను  కాలేజ్  కి  వెళ్లిపోయాను, విశాల్  అడిగాడు  ఏంటిరా  డల్ గా  ఉన్నావ్  అని, ఎం  లేదు  బావ  అంటూ  సమాధానం  చెప్పాను, వారం గడిచిపోయింది, నేను విశాల్ Ground లో  ఆడుకుంటున్నాం, నీకు  లెటర్  వచ్చిందిరా  from రాధ  అంట , అని  తీసుకొని  వచ్చింది  తార, నేను  వెంటనే  ఆత్రుతగా తీసుకొని  ఓపెన్ చేశాను.

ఎలా  ఉన్నావ్  కృష్ణుడా…

రాముడి  పోరాటం సీతని  పొందడానికి అని  తెలిసినప్పుడు, సీత  ప్రయత్నం  ఒకటే  ఓపికతో  రాముడి  కోసం  వేచి  చూడడమే, రాజ్యం, యుద్ధం, సైన్యం  అని  సింధుతో  అన్నావ్  అది  నేను  విన్నాను, నేను  ఓపికతో  వేచి  ఉంటాను  నా  కృష్ణుడి ప్రయత్నాన్ని గెలిపించడానికి. ఇప్పుడు చెప్పే  నా  మాటలు  ఎప్పటికి నువ్వు  గుర్తు  పెట్టుకో  కృష్ణుడా, నీ  ప్రేమకి  నేను  బందీని, నీ  కోపంలో  అణిగి  ఉండే  ఆడదాన్ని, నీ  ఆశలకు  నేను  అందాన్ని, నీ  కోరికలకు  నేను  కన్య  సొగసుని, అలసిపోయిన  నీ  తలకి  నా  భుజానీ అందిచే  భార్యనీ,  అన్నిటికి  మించి, నిన్ను  పిచ్చిగా  ప్రేమించే  ప్రేయసిని  నీ  ప్రాణ  సఖిని.

రెండు  సంవత్సరాల  తరవాత  ఈ ఉత్తరం  ఎందుకా?  అని నువ్వు  అనుకోవచ్చు , మొన్న నన్ను, నువ్వు  చూసినప్పుడు, నీ  కనులలో  నన్ను కోల్పోయాను అనే  బాధ  నా కంటికి  కనిపించింది, నీ మనస్సు  బాధ  నాకు  వినిపించింది ,  నా  చేయి  పట్టుకొని  తీసుకొని  వెళుతుంది , మా  అన్నయ్య ఫ్రెండ్  అంతే , నేను  నీ  రాధనే కృష్ణ  ఎప్పటికైనా.

అన్నట్టు, నువ్వు తెల్లని మేఘం లో నల్లని నక్షత్రంలాంటి  పుట్టు మచ్చలు  చూడడం  మానేసేయి, చూస్తే  చూసావు  కానీ  పట్టుకోవడానికి  ప్రయత్నించకు, ప్రాణం  తీసేస్తాను, నీ  ప్రాణం  కాదు , నీ కంటికి  కనపడే  తారది, అలాగే  కవితలు  రాసుకో  కానీ  అమ్మాయిలకి చెప్పకు, నా  కృష్ణుడిని ఎలాగో మార్చలేను, కనీసం  గోపికలను అయినా దూరం పెట్టుకోవాలిగా, ఇంక  ఉంటాను .

                                                                                                                       ఇట్లు నీ రాధ కృష్ణ.

ప్రతి  ప్రాణం కి  ప్రశాంతత ఎంతో  ముఖ్యం, నాకు  ఆ   ప్రశాంతతా రాధ  లెటర్ తో  తిరిగి  వచ్చింది, ఉత్తరంలో కొన్ని… కొన్ని అక్షరాలు  ink  చెరిగి  ఉంది, బహుశా  కన్నీటి చుక్కలు  ఏమో  అనుకున్నాను, సింధుకి  thanks చెప్పాలి  అనిపించింది. నా  ప్రతి  మాట  నాకు  తెలియకుండా  మొబైల్  ద్వారా  రాధకి  వినిపించింది, అలాగే  ఈ  తార  కోసం  రాధకి  ఎలా  తెలిసింది  అనుకుంటున్నాను, నేను  విశాల్ ని  వెంటనే  భావ  అని  పిలిచాను, ““నన్ను  రాధ  అన్నయ్య…  అని  పిలుస్తుందిరా  నాకు  తప్పలేదు”” అని  అన్నాడు, నేను  వెంటనే వాడిని hug చేసుకున్న, ఈలోపు  తార  నాతో  ఏంటి  ఆ  లెటర్  అని  అడిగింది”” నీతో  డాన్స్  మధ్యలో  ఆపేయడానికి, ఆ  కవితల  పోటీలో  కవితకి  కారణం  అయినా  లేఖ  అది“” అని  చెప్పాను  తారకి . కానీ  రాధ  రాసిన  ప్రతి  అక్షరం  చదివినప్పుడు  ఇష్టం  అని  చెపుకోకుండానే  ప్రేమికులం  అయ్యాం అని  అనిపించింది  నాకు. To be continued on 18th Nov 2022.

NEXT CHAPTER

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.5 8 votes
Article Rating
Subscribe
Notify of
guest

16 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sandeep kumar Kontham
Sandeep kumar Kontham
2 years ago

Wow.. so nice story again.. ram really a wonderful story again.. it was like a treat for my waiting of your next story.. 💐💐💐💐

Sree
Sree
2 years ago

Oh RAMayya❤!! Yetellipoyaav..! Podhuna nunchi edhuruchusthunna😊(Story publish avvaledhentaa ani)

Finally, manchi kathani andhinchaav!! Cheppadam marchipoya, mee freshers day Kavitha maku kuda nachindhandoy😍!! Ma comment ni kuda post chesthunnam, andhagane, Radha tho patu maaku kuda reply isthaarani aashisthuu…

-Next chapter kosam vechi chuse Me Abhimani🫰🏻

Vaishnavi
Vaishnavi
2 years ago

Dear Ram garu,
Radha Krishndukey sontham ani chepakaney cheparu I am happy about that🥰 and mee story writing ni pogadadaniki mattalu kuda ravatldu ee sari but okati Mataram cheptanu fantastic👏🏻👏🏻

Raj
Raj
2 years ago

Ram garu Istam anii cheppakundaney premikulu ayyaru Mi Radhakrishnulu kani Nenu mathram chepptunna Na manasulo matta Really I love you sir
Ittlu
Mi Abhi😍mani
@thanks for ur response I will meet u soon😍

Narendra
Narendra
2 years ago

Is this ending . Ram garu

phanindrageddam@gmail.com
phanindrageddam@gmail.com
2 years ago

Super. Bava I am waiting for next chapter

Ramesh Chavakula
Ramesh Chavakula
2 years ago

One word……. excellent 👌

Lingaraj
Lingaraj
2 years ago

Good one sai….