HOME

8 వ అధ్యాయము

పెదవుల  సాక్షిగ    ప్రమాణం

తార  నా   దగ్గెర   నుంచి   లెటర్  తీసుకోవడానికి  try చేసింది, నేను  ఇవ్వలేదు , నా   పర్సనల్  అని  చెప్పాను, “అబ్బో    మా  Personals  అన్ని  చూసేసావు, ఇప్పుడు  నీ  personal ఎవ్వరికి   చుపించవా ”” అని అంది, ఆ   మాట  విన్న   విశాల్  గాడు , నోరు    ఎల్లబెట్టి  నా   వంక  ““ఎం  చూసావురా””  అంటూ  ఒక  expression ఇచ్చాడు  ““బావ  నీ  పనికి  మాలిన  బ్రెయిన్  ఆలోచన  ఆపు,  తారకి  చెప్పడం  వచ్చి  చావలేదు  అంతే, తన personal అంటే  తన  ఫామిలీ  మేటర్స్, నువ్వు  ఈ  విషయం  రాధకి చెప్పకురా  please”” అని  అన్నాను, తారకి  ఇరకాటంలో  పెట్టి  సరదా  పడడం  ఇష్టం, ఆ  సరదా, సరదగానే  ఉంటే  బాగుంటుంది  అనుకున్న   నేను  చాల  సార్లు, ఎందుకు  అంటే  ఇంకా  ఏ  అబ్బాయి  తోను  తార  అంత  చనువుగా చూసింది  లేదు , నిజం  చెప్పాలి  అంటే  అసలు  పట్టించుకోదు వేరే  అబ్బాయిలని , ఈ విషయం  విశాల్  నాకు  ఈ  రెండు  సంవత్సరాలలో   చాల  సార్లు  చెప్పాడు, నేను  ఆ  ఆలోచనని  ఆపేసి, నా  రాధ  లెటర్ కి  reply ఇవ్వాలి  అని  లెటర్  రాయడం  మొదలు  పెట్టాను.

పరిచయం  తో  స్నేహితురాలుగా,

స్నేహితురాలు  చనువుతో  చెలి లా,

చెలి  చెంతకు  చేరాక  సఖి లా,

సఖీ  సొంతం  అయినవేళ  నా  సమస్తంలా  మారిన నా  రాధకి  నీ  కృషుడు , మురిపెంగా    రాసిన  మొదటి  ప్రేమ  లేఖ.

సూరీడు అయినా  సాయంత్రానికి  శిరస్సు  వంచి  శెలవు  చెప్పాలి, మరుసటి  రోజు  ఉదయించాలి  అంటే, అలాగే  నిన్ను   పొందడానికి, నా  మనస్సుకి  సర్ది   చెప్పుకుంటూ  నిన్ను   దూరం  పెట్టాను, రేపుఅన్న  రోజు  నీ  జీవితంలో  నేను  ఉదయించాలి  అని. అమ్మాయిలని ప్రేమించి, పెళ్లి  చేసుకోకుండా  వదిలేసే  రోజులు  ఇవి, నీతో  చనువుగా  ఉండి, చివరకి  పెళ్లి  చేసుకోవడం  కుదరక  పోతే, నన్ను  కూడా నువ్వు  అందరితో   కలిపి  చూస్తావ్, ఆ  బాధ  కన్నా , ఈ  బాధ  మేలు  అనుకుని, మౌనం  గా   ఉండి  పోయా  ఇన్ని  సంవత్సరాలు. మనం  కలసి  ఉండాలి  అనే  కలని  నిజం  చేస్తా , నువ్వు  కష్టం  లో  కార్చినా  కన్నీరుని  ఇకపై  ఆనంద బాష్పాలుగా  మారుస్తా, నా   ఒంటరి  తనంలో  నీ  ఊహలే, నా  రుధిరంలో  నీ  రూపమే.

నువ్వు లేని  నా  జీవితంలో  నేను..

** ఆనందం పంచడానికి  నోచుకోని  అడివిలో  అందం  అయిన  జాబిలిలాంటి  వాడిని ,

** విశ్వం  గెలిచినా  వీరుడుకి , విరిగిన  మనస్సుతో  ఉన్నవాడికి  ఉదయం  లాంటి  వాడిని ,

** సాగర  తీరాన, సాయంత్రాన , చల్ల   గాలి  ఉండి  చందమామ  తోడు  లేనట్టి  వాడిని  

నీకు నేను  రాత  పూర్వకంగా  చెపుతున్నది  ఒకటే, నాకు  అంటూ  సమయం  వచ్చినప్పుడు, నువ్వు  ఏ  పరిస్థితిలో  ఉన్న  నిన్ను,  నేను  తీసుకొని  వెళ్ళిపోతా. నా  B-tech 1st ఇయర్ శెలవులలో నిన్ను  చూడడానికి  వచ్చాను,  నువ్వు  Canada వెళ్ళావ్   అంట, ఈ  సంవత్సరం  అయినా  కొంచెం  ఇండియాలో  ఉండు. అన్నట్టు  నేను  నల్లని   నక్షత్రం  లాంటి  పుట్టుమచ్చని  చుసినా,  నా  చందమామ  నీవే. కాబట్టి  నువ్వు  అలాటి  ఆలోచనలు  ఏమి  పెట్టుకోకు , నాకు  నచ్చే  నీ  కళ్ళనీ    ఏడ్చి…  ఏడ్చి…  పాడుచేయకు , ఉంటాను  మరీ.

ఇట్లు  నీ  కృష్ణుడు 

   (రామ  కృష్ణ )

లెటర్  రాధ  కి  పోస్ట్  చెయ్యమని  విశాల్ కి  ఇచ్చాను, ఇంతక  ముందు  ఎప్పుడు  లేనట్టు  ఈ  కొత్త  ఉత్సాహం, ఎప్పుడు…  ఎప్పుడు… ఈ  సంవత్సరం  ముగుస్తుంది  అని , వేయి   కన్నులతో  వేచి  చూస్తునాను , నెలలు గడిచిపోతున్నాయి, ఒక  రోజు  డాడీ  కాల్  చేసారు   ““ఎరా  ఎలా  ఉన్నావ్, మన  రాధ  వాళ్ళ   అన్నయ్య కి  పెళ్ళి  కుదిరిందిరా  వచ్చే  వారమే  పెళ్ళి , నీకు  వీలు  అయితే  వస్తావ్ అని  కాల్  చేసానురా  ఎం  అంటావ్  చెప్పు”” అని  అన్నారు.  సరే  డాడీ  నేను  వస్తాను  దగ్గేరిలో  internal exam  కూడా  ఏమి  లేవు  అని  చెప్పి,  call కట్  చేసి హైదరాబాద్  కి  ప్రయాణం  అయ్యాను, ఇంటికి  వెళ్లగానే, అమ్మ  ఇంటిలో  లేదు, డాడీ  నీఅడిగాను  అమ్మ  ఎక్కడ  అని  ““అదేరా  పెళ్ళి  ఉంది   అని  చెప్పానుగ , రాధ  వాళ్ళ   అమ్మ  గారు , మీ  అమ్మ  ని  పెళ్ళి  పనుల్లో  కొంచెం  సాయం  చేయమని  అడిగారు , అమ్మ  వాళ్ళ   ఇంటికి  వెళ్ళింది   , నేను  కూడా  మన  ఊరు  వెళుతున్నాను  ర  ఈ   రోజు  నైట్  ఆఫీస్  నుంచి   అటే ”” అని  చెప్పారు , పోనీ  తమ్ముడైన  ఉన్నాడా  వాడు  కనపడటం  లేదు  అని  అడిగాను  ““లేదురా  , వాడు  కాలేజ్ లో  ఏదో  outing కి  తీసుకొని  వెళ్లరు , వాడు  ఈ  రోజు  రాత్రికి వచ్చేస్తాడులే ”” అని  చెప్పి   ఆఫీస్  కి  వెళ్లిపోయారు.

రాధకి  కాల్  చేదాం  అనుకున్న , కానీ  వాళ్ళ   అన్నయ్య  పెళ్ళి  పనుల్లో  బిజీగ  ఉంటుంది  ఏమో  అని  కాల్  చేయలేదు , మధ్యాహ్నం  3:00 అయింది, అమ్మ  కాల్  చేసింది  ““అరే నాన్న, నువ్వు  వస్తూ… వస్తూ… వర్షంని  పట్టుకొచ్చినటు  ఉన్నావ్ గ , నేను  ఇక్కడ  ఆంటీ  వాళ్ళ   ఇంట్లో  ఉన్నాను , మన  ఇంటిలో  పెళ్ళి కి  కావలిసిన  సామాను  ఉండిపోయాయి కొన్ని , అవి  తీసుకోవడానికి  రాధ  వాళ్ళ   నాన్నగారు  వస్తారు  సాయంత్రం , కొంచెం  ఇచ్చేసేయ్  ”” అని  చెప్పింది, నేను  సరే  అమ్మ  అని  చెప్పాను . సాయంత్రం అయింది,  అంకుల్  ఇంకా  రావటం  లేదు , ఈ  వర్షం  వల్ల  కరెంటు  కూడా  లేదు , ఇంక  నేను  పడుకొని  పోయాను.

కాలింగ్ బెల్  మోగింది , అంకుల్  వచ్చారు  అని , నిద్దర  మత్తుతో  డోర్  ఓపెన్  చేశాను ,  చీకటిలో  ఏమి  కనపడటం లేదు , నేను  వెళ్లి  కొవ్వొత్తు వెలిగించి, తిరిగి  చూసాను . కొవొత్తు  వెలుగుని  డీ కోటేలా, మెరిసే  కనులతో  నాకేసి  చూస్తూ , కవుగిలించుకుంది , మొదటి  కౌగిలి  కలని  ఇలలో  చూపించింది  రాధ . ఒకరి  గుండె  చప్పుడు  ఇంకొకరికి వినపడేలా  గుండెలు  కొట్టుకుంటున్నాయి , వర్షం  వేగం  పెంచుకుంటూ , మా  వయస్సు  వేడి  హద్దుల్ని  తెచుతుంది , నేను  హాల్  మొత్తం , అక్కడ  అక్కడ  కొవ్వూత్తులు వెలిగించాను , ఆ   కొవ్వూత్తు వెలుగు  చల్ల గలికి  ఊగినట్లు, మా  మనసులు  మరో  కౌగిలి  కోసం  ఊగుతున్నాయి, ఇద్దరం  సోఫాలో   కూర్చున్నాము  దూరంగ, ఆ చిలిపి  చీకటి  చల్ల  గాలి  వెలుగులొ రాధ  హాఫ్ సారీతో  కూర్చింది, తన  ఒంపులని  వారించాలి  అంటే  అక్షరానికి   కూడా  ఒణుకు  పుడుతుంది , ఎక్కడ  తన  వయ్యారంకి  తగినట్టు , మెలికలు  పడవు  ఏమో  అని , నేను  రాధతో , ““రాధ  చల్ల  గాలికి , చలి  వెస్తుంది  ఏమో , మన  కౌగిలో  చలి కాచుకో  మందమా ”” అని  అడిగాను , సోఫాకి  అటువైపు  ఉన్న  రాధ, నా   మాట  విని , భయాన్ని వదిలి  కొంచెం, సిగ్గు  పడుతూ  కొంచెం, ప్రేమ  తెలుపుతూ  కొంచెం, పరువాన్ని  పంచి  ఇద్దాం  అని  కొంచెం , అలా  కొంచెం… కొంచెంగ…   నా   వైపు  జరుగుతూ , వచ్చి  సిగ్గుతో  తల  దించుకొని  చూస్తుంది , నేను  నా  రెండు  చేతులతో  తన  బుగ్గలని  పట్టుకొని , నేను  ఉన్నానో  లేనో  తెలియని , నుదిటి  పై  మొదటి  ముద్దు పెట్టాను , రాధ  వెంటనే  తన  తలను  నా   గుండెల  పై  వాల్చింది , ఇద్దరం  కలసి  నా   ఒడిలో  కౌగిలికి  చోటు  ఇచ్చాము , నేను  నా  చేతులని , తన  చిట్టి   నడుముపై  వేద్ధామా  వద్ధా  అని  ఆలోచనలతో  అల్లకల్లోలం  అవుతుంటే , ఈ  అంధకారంలో  నా  అందని  అందం  అంతా  అందుకోరా  అంటూ , తన  సున్నితమైన  చెతులతో  నా  చేతిని , తన  చిట్టి   నడుము  మడతల  మద్య  మోపింది , నా చేతిని  మోసేది  రాధ  నడుమైన, బరువు  మాత్రం  నా  గుండె  చప్పుడు  మోస్తుంది , పంటి  గాటు  తగిలితే  పేలే  పర్వతంల  పొంచి  ఉంది  తన  మెడ  ఒంపున  వేడి, నా   శ్వాసలు  తన  చెవి  నుండి   నదిలా  పారుతున్నాయి, తన  సొగసుకి  అణువు  అణువు  అంత  అందంతో  అలంకరించింది, తన  కురులు  సువాసన నా  మదిని  మత్తు ఎక్కిస్తున్నాయి, తాను  కౌగిలిలో   ఉన్న  వేళా  మా  ఊసులు  ఇలా  సాగుతున్నాయి.

రాధ : ఎం, కృష్ణుడా చల్ల  గాలి , చలి  కాచుకుంటుంది  మన  కౌగిలిలో  అన్నావ్ , కానీ  కొంచెం  చోటు  కూడా  ఇవ్వలేదు  దానికి  నువ్వు .

రామ  కృష్ణ  : అవును , కానీ  మన  మద్య  కాదు , మన  శ్వాసలో  రాధ ,

రాధ : కనపడని  దొంగవి, మాటలు  బాగానే  మాట్లాలాడుతావు  కానీ  ఒక్క మగువని  కూడా  ముట్టుకొని  ఉండవు..!

రామ  కృష్ణ : అయిఉండచు ! కాకపోవచ్చు  కూడా ?

రాధ : కాకపోవచ్చు  అని  నువ్వు  అబద్ధం  చెప్పిన, ముట్టుకోలేదు  అని  నీ  గుండె  చప్పుడు  చెప్పుతుంది, కొంచెం  నిదానించు , నీ  గుండె  చప్పుడు , నాకు  నీపై  ఉన్న  ప్రేమ  అంత  వేగంగ  కొట్టుకుంటుంది.

రామ కృష్ణ : కోరుకున్న  కొంటెది, కౌగిలో  కొలువు  ఉంటె , గుండెకి  ఆ  మాత్రం  వేగం  ఉంటుంది.

రాధ : సరే  మరి , ఈ  కొంటె  దానిలో  నీకు  ఎం  ఇష్టం  కృష్ణుడా?

రామ  కృష్ణ : నేను  నిన్ను  ఆట  పట్టించేటపుడు, నీ  ఎర్రటి  పెదవుల్లో  రంగు, కోపంతో  బుజ్జి బుగ్గల  మీద  వెళుతుంది, ఆ  రంగు  అంటే  నాకు ఇష్టం.

రాధ : నా  పెదవులు, బుగ్గలు ఇష్టం అన్నావ?, లేదా  నన్ను  ఆట  పట్టించడం  ఇష్టం  అని  చెప్పావా?,

రామ కృష్ణ : నచ్చినవి  చుడానికి, సాయం చేసే “ఆట  పట్టించాడాన్ని” ఇష్టం  లేదు  అని  చెప్పగలమా?

రాధ: ఓయ్  మాయలోడా, సమాధానం లోనే  ప్రశ్నని పాటిస్తావ్, సరే  ఇది చెప్పు, నేను  ఉన్న  చోటు చెప్పు..

రామ  కృష్ణ : విశ్వం  చూసే  నా  కంటి  ముందు  అంత  నీవే.

                            విశ్వంని చూడని వేళ నా  కనులలో  నీవే.

                            నా కనుల  వెనక  ఆలోచనలో  కూడా  నీవే.

రాధ : కౌగిలిలో  ఉన్న  కదా , ఎన్ని  కబుర్లు అయినా చెప్తాడు కృష్ణుడు .

రామ  కృష్ణ : కౌగిలిలో  ఉన్నా, కంటికి  కనపడని  అల్లంత దూరాన  ఉన్నా,  నా  కంఠం  నుంచి   వచ్చే  మనస్సులో  మాట  ఇదే  రాధ.

రాధ : మరి  నేను  లేని  చోటు…

రామ  కృష్ణ: నువ్వు  నాకు  దూరం  అవుతావు  అనే  ఆలోచనలో, రాధ.

రాధ : నా  కృష్ణుడు , మనస్సులని, మనుషులని  కూడా  దోచుకుంటాడు.

“”అంటూ ముద్దు పెట్టుకోవడానికి వచ్చింది, నేను కొంచెం భయంతో  తల దించుకున్న””

రాధ: ఏంటి కృష్ణుడా, చేదా నీకు  నీ  చెలియా  సంపద.

రామ  కృష్ణ : చెలివి  కాబట్టి  సంకోచిస్తున, సఖివి  అయితే  సిద్దమే.

రాధ : నా వయస్సు  ఎంత  కృష్ణుడా?

రామ  కృష్ణ : 21 వచ్చాయీ  ఆరు  నెల  కిందట.

రాధ : నా  ప్రేమని  నీకు  పంచడానికి  ఇంకా  ఒక్క నిమిషం కూడా  నేను  ఆలోచించలేను.

అంటూ రాధ, నా  పెదవులకి  మధురమైన మొదటి ముద్దుని  అందించింది, ఒక  నిమిషము   విశ్వంలో  ఉన్న  నిశ్శబ్దం  మా  చుట్టూగోడల  నిలిచింది, చల్ల గాలి  తన  చేతులతో మా  వెనకా  నుంచి ఇంకా  దగ్గెర అవండి  అంటూ  నెడుతుంది, కొవొత్తు  వెలుగు, మా  కౌగిలి  చూసి, సిగ్గుతో  చీకటిలో  దాకుంది, వర్షం  చప్పుడు  మా  చెవికి  వినపడకూడదు అని  కొంచెం  నెమ్మదిగా  నృత్యం  చేస్తుంది, వాతావరణం ఒడిలో  పెదవుల  సాక్షిగా ప్రమాణం  చేసింది  రాధ , తాను  నాకే  సొంతం  అని, నేను  తనకే అంకితం అని. To be continued on 25th Nov 2022

NEXT CHAPTER

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.9 9 votes
Article Rating
Subscribe
Notify of
guest

10 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sandeep kumar Kontham
Sandeep kumar Kontham
2 years ago

Oho…”Rama”Krishna ni purthiga “Krishna” la marchesavu kada RAM.. e story tho.. wonderful writing again.. 💐💐🙏🙏🙏

Last edited 2 years ago by Sandeep kumar Kontham
Sanjeev
Sanjeev
2 years ago

Super love story Ram congratulations

Sanjeev
Sanjeev
2 years ago

Kavitalu adara kodutunnav

Vaishnavi
Vaishnavi
2 years ago

Dear Ram garu,
Radha Krishnula madaya una Prema manusuki hatukuney laga chupistunaru!! memaleni yentha pogidina thakkuva ey avutundhi Mee radhakirshnula Prema Katha Na Prema nii gurutuku chesey antha bagundi 🥰🙌🏻

Ethulu
Mee abimanuralu..

Sree
Sree
2 years ago

Paruvam vaanagaa nedu kurisenule!
Muddu muripaalalo RadhaKrishna tadisenule!!

మీ అధరముల చుంబనాలతో.. మరోసారి కథ అదిరిపోయింది…RAM❤!!

#Cant wait for your next chapter(mee..fan girl🫰🏻)