HOME

9 వ అధ్యాయము


అమ్మ పేరులో ప్రేయసి పిలుపు

రాధ : ఎం కృష్ణుడా, మొహమాటం ఎక్కువ అయినా కొద్దీ, ముద్దు దూరం అవుతుంది, నీ ఇష్టం,  మరి.

రామ కృష్ణ : ముద్దుల్లో మునిగి తేలడం కంటే, కౌగిలి కోటలో కొలువు ఉండడమే బాగుంది.

రాధ : హోం…. అవునా, ఏ ఆడపిల్ల అయినా, ఎలాంటి వాడు కావాలి అనుకుంటుందో తెలుసా కృష్ణుడా?

రామ కృష్ణ: తెలిసిన కానీ, మీ అడవారి అంచనాలను అందుకోలేము, నువ్వే చెప్పు

రాధ: అర్ధం చేసుకునే వాడు.

         ఆట పట్టించే వాడు.

         అలకని, ఆకాశం అంత ఓపికతో తీర్చేచెవాడు.

         అందాలను అలసిపోకుండా అలరించేవాడు.

         అడిగింది అందకుండా ఉన్న, ఉన్నదానితో ఉజ్జానవనంలో, ఊయలలు ఉపేవాడు,
         ఆఖరిలో , అందగాడు.

రామ కృష్ణ : మరి నీకు దొరికాడా?

రాధా : ఆ…. దొరికాడు, కానీ దక్కుతాడా ? లేదా ? అని భయంగా ఉంది.

రామ కృష్ణ: ఒక వేళ దొరక్కపోతే ఇంకా ఎవ్వరికీ దక్కడు లే.

అని అంటూ నేను వంట గదిలోకి వెళ్లి, తనకి ఇష్టం అని, దోశ వేస్తున్నాను. తను వంట గదిలోకి వచ్చి, గట్టిగా గిల్లింది నా భుజం మీద. ఎందుకు గిల్లవ్ అని అడిగితే ““మీ తారకి దూరంగా ఉంటావ్ అని, అయినా దానికి ఎక్కడ పుట్టు మచ్చ ఉంటే నీకు ఎందుకు, పైగా నల్లని నక్షత్రం అంటూ పొగడటం మళ్ళి. సిగ్గు లేకపోతే సరి, విశాల్ అన్నయ్య ఉన్నాడు కాబట్టి, అన్ని నాకు  చెప్పాడు, లేకపోతే  నువ్వు  నాకు  చెప్పే  రకానివా  అసలు””  అని  అంది. నేను రాధకి వివరం చెపుదాం తార గురించి అని “”తారకి నీకంటె తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక మంచి స్నేహితురాలు కన్నా ఎక్కువ  అంతే”” అని చెప్పాను ““నా కంటే తక్కువ బాగుంది, మళ్ళి మంచి స్నేహితురాలు కంటే ఎక్కువ ఏంటి, చూడు కృష్ణుడా, రాధని రాధల ఉండనివ్వు, సత్యభామ ల మారనివ్వకు”” అంటూ వేసిన దోశని ప్లేట్ లో పెట్టుకొని హాల్ లొకి వెళ్లిపోయింది, నేను తన వెంట వెళ్లి ఏదో సర్ది చెప్పుతూ, రాధకి తినిపిస్తున్న, అంతలో డోర్ కొట్టారుఎవరో, నేను వెళ్లి డోర్ ఓపెన్ చేశా, తమ్ముడు వచ్చాడు, నేను తమ్ముడుకి రాధ ని పరిచయం చేశాను ““నాకు ఎందుకు తెలియదు, ఒక సారి మన ఇంటికి వచ్చారుగా”” అంటూ వాడు గదిలోకి వేలాడు.

నేను రాధ ని అడిగాను, “”మీ నాన్నగారు వస్తా అన్నారుగా, నువ్వు వచ్చావు ఏంటి”” అని.
“”చా అవునా….ఈ ప్రశ్న నేను కౌగిలించుకున్నపుడు అడగలిసింది”” అని అంది. “”ఆ… ! అదేలే అప్పుడు, అడగడం కుదరలేదు, ఇప్పుడు చూపొచ్చుగా”” అని అన్నాను “”డాడీ వస్తుంటే నేనే, ఏదో ఒక సాకు చెప్పి వచ్చేశాను”” అని చెప్పింది. పెళ్లి సామానులు రాధ కార్ లో పెట్టేశాము, రాధ వెళ్ళగానే , తమ్ముడు నాతో “”వదిన బాగుంది రా”” అని అన్నాడు “”వదిన ఏంటిర, తన పేరు రాధ”” అని అన్నాను, “”నాన్నా, స్వాతిముత్యం నటన ఆపుతావా ?, నేను వచ్చి గంట అయింది మీరు ఏదో మాటలాడుకుంటున్నారు, ఒకటి, రెండు మాటలు నా చెవిన పడ్డాయి, సర్లే ప్రైవసీగ ఉన్నారుగ అని చెప్పి, పక్షి పిల్లలు వానలో తడిసిపోకుండా, తల్లి రెక్కలు అడ్డు పెట్టి కాపాడుకున్నట్లు, నేను ఇంటి బయట నిల్చున వానలో తడుస్తూ, ఎవరూ రాకుండా నిన్ను కాపాడానురా అన్నయ్యా. నాకు, నువ్వు ఇంటర్ 1st  year Topper అయినప్పుడే, Doubt వచ్చిందిరా, పాపం మన డాడీ ఏమో, పెద్ద కొడుకు పరువు నిలబెట్టాడు అని సమర శకం పూరించారు, నువ్వు ఈ పాప తో పులిహోర కలుపుతున్నావ్, sorry  కలిపేశావు అని తెలిసింది అనుకో, నిను  పాతేసి, అప్పుడు  సమర  శకం  పూరించడం కాదు, పుట్టిన  వాడు  మరిణించక  తప్పదు,  అని  గంటసాల  గారి  గొంతు  ఎత్తుకుంటారు”” అని  అన్నాడు  “”అది   ఏంటి రా ఆలా  అంటావ్ , నీకు  అసలు  ఎప్పుడో  చెప్పుదాం  అనుకున్న  కానీ …”” ఈలోపు  వాడు  “”చిన్నవాడు  మనల్ని చూసి  నేర్చుకుంటాడు  అని  చెప్పలేదు  అని  అంటావ్  అంతేనా,  సరేర  అన్నయ్యా  కాసేపు  serious గ  మాటలాడుకుందాం, బాలు  పెదనాన్న  విషయంలో   ఎం  జరిగిందో  నీకు  తెలియదా  చెప్పు, మన  ముసలినా   కొడుకు  అదే, డాడీ  వాళ్ళ  పెదనాన్న, ఎలాంటోడో  నీకు  తెలుసుగా”” అని  అన్నాడు “”నేను  కాదు  అనటం లేదురా , మనం  ఇప్పుడు… ఇప్పుడే…  develop అవుతున్నాం, మనకి  jobs వచ్చాక  ఒక  3 ఇయర్స్ కి  మంచిగా  సెటిల్  అవుతాంగ, అప్పుడు  మన  డబ్బు  చూసి , కులం  కనపడదు  కదారా”” అని చెప్పాను. “”చెప్పింది బానే  ఉందిరా  అన్నయ్యా, డబ్బుకి  మనిషే అమ్ముడు  పోతున్నాడు, కులం  ఎంత , after all మనిషికి  పుట్టిన  కులం”” అని  పెద్ద   మాట అన్నాడు.

రాధ  వాళ్ళ   అన్నయ్యా  “తేజు” పెళ్లికి  వెళ్ళాము, పెళ్లి  చాలా  గ్రాండ్  గ  చేశారు, నేను  తిరిగి  చెన్నై కి  వెళ్లిపోయాను, తార  నన్ను  కాలేజ్ లో  చూసి, పలకరించకుండా  మొహం  తిప్పుకొని  వెళ్లిపోయింది. విశాల్ ని అడగడం బెటర్ అని “”బావ ఎం అయిందిరా తార నాతో  మాట్లాడటంలేదు”” అని  అడిగాను  “”sorry బావ  నువ్వు  రాధకి  post  చెయ్యమన్నా లెటర్, తార  నా దగ్గెర నుంచి లాక్కుని, మరి  చదివింది, ఆ తరవాత  నుంచి నాతో  కూడా  సరిగా  మాటలాడటం  లేదు”” అని  చెప్పాడు  “”రాధకి  లెటర్  రాస్తే  తారకి  ఎం  అయింది  రా“” అని  అన్నాను  “”సరే  బావ  నువ్వు  చెప్పింది correct అనుకుందాం, తార  మన  ఇద్దరితో  ఒకేలా  ఉంటుందా ? బావ, మన  ఇద్దరికి  తాను  ఫ్రెండ్ , కానీ  నీకు  ఇచ్చిన  మాట్లాడే  చనువు నాకు  ఇచ్చిందా ?, తార  నన్ను  ఎప్పుడు  హద్దులో  మాటలాడే   అవకాశమే  ఇచ్చింది, కానీ  నీకు  ఆలా  కాదు  కదా, అయినా  నీకు  నేను  B-Tech 1st ఇయర్  నుంచి చెప్పుతున్న, అందరితో  ఉన్నట్లు నీతో  తాను  ఉండటం  లేదురా  అని.  నువ్వు  ఏమో  పట్టిచుకోలేదు“”  అని  క్లాస్  కి  వెలిపోయాడు.

నేను తార దగ్గరకి వెళ్లి, రాధ  గురించి మొత్తం చెప్పాను, తాను మొత్తం అంత విని ఏమి  మాటలాడకుండా, చివరిలో  “”నువ్వు  రాధకి  రాసిన  లెటర్  చదివాను, నీ ఆకాశం  లో  రాధ  చందమామ అయితే, నేను  తారని, అమవాస్యా  రోజు  తాను  కనపడదు, కానీ  నీకోసం  నేను  వెలుగుతూ  వేచి  ఉంటాను, నీ రాధ  అంత  ఓపికతో  నేను  సంవత్సరాలు వేచి  ఉండను, నా  పేరు  తెలుసుగా  తార, తోకచుక్కల రాలి  అయినా  సరే  ని  సరసన చేరుతా ”” అని  తాను  corridor లో  నడుచుకుంటూ  వెళ్లుతూ , మల్లి  వెనక్కి  తిరిగి  “”అయినా నువ్వు  కృష్ణ  అని  పేరు  పెట్టుకుని, రాధ  అనే  అమ్మాయిని, ఎలా  ప్రేమించావు, దక్కదు అని తెలియదా ? ,లేదా దుఃఖానికి దగ్గర  అవుదాం అనుకుంటున్నావా ?”” అని  వెళ్ళిపోయింది.

నాకు  ఎం  జరుగుతుందో  అర్ధం  కాకుండా, ఒక్క నిమిషం నిలుచుంటే, అంతలో  విశాల్  వచ్చి  “”బావ  మనకి  campus selections 4th year లో  first three months లో  కండక్ట్  చేస్తారు  అంటారా, మన  3 years  marks  percentage బట్టి  hire చేసుకొని, final year లో   min 80% ఉంటే  offer letter ఇస్తారు  అని  చెప్పాడు. ఆ మాట  విని , నేను  విశాల్ తో తార  చెప్పిన  మాటలు  అన్ని  చెప్పాను, వాడు , నాతో  ““ఇప్పుడు నేను,  నీకు  ఏమి  చెప్పలేనురా , తార  క్లోజ్  అవుతుందిరా  అంటే… “ఆ  friend అంతే బావ”  అన్నావ్ గ,  అనుభవించు  అని  అన్నాడు. 3rd year ఎగ్జామ్స్  ఇంకో  1 నెలలో ఉన్నాయి, నాకు  అది  ఒకటే  మైండ్  లో  ఉంది, నేను  ప్రిపేర్  అవుతుంటే, ఒక  రోజు  తార  వచ్చి, “”ఏంటి  బాగా  ప్రిపేర్  అవుతున్నావా, ఆవ్ … ఆవ్ …, నీకు  మంచి  job లేకపోతే, మా  నాన్నకి  ఎం  చెప్పి  ఓప్పించాలి  మన  పెళ్లికి”” అని  అంది. “”నోరుమూసుకుంటావా  నువ్వు, వెళిపోతావా  ఇక్కడ  నుంచి అని  అన్నాను””  “”నువ్వు  బాగా  చదువుకో  నేను  నిన్ను   disturb చేయను , final year exams వరకు“” అంటూ  చెప్పి  వెళ్లిపోయింది.

3rd year exams అయిపోయాయి, నేను  హైదరాబాద్  వచ్చాను సెలవులకి ఈ సరి  రాధతో  బయటకి  వెళదాం అనుకున్న, ఇంటికి  వెళ్ళాను, అప్పటికే  తార  మా  ఇంటిలో  ఉంది, నువ్వు  ఏంటి  ఇక్కడ  అని  అడిగాను “”అమ్మ  చికెన్  కర్రీ  వండిది, ఆంటీకి  ఇచ్చి  రమ్మంటే వచ్చాను”” అని చెప్పింది, నా ఉద్దెశం నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాను, “”నీ దరిద్రమొ, నా  అదృష్టంమొ, నాకు  medical camp హైదరాబాద్ లోనే””  అని  చెప్పింది. ఇంతలో డాడీ  వచ్చారు, ఎరా  exams ఎలా  రాశావ్  అని  అడిగారు, తార  ఇంకా  తమ్ముడు ఇద్దరు  ఒకేసారి  “”వాడికే,  బాగానే  రాస్తాడు, వాడు  చేరవలిసిన  గమ్యం  అంత  important  వాడికి”” అని అన్నారు, నేను  వెంటనే  డాడీ తో , campus selections కోసం  అంటున్నారు  డాడీ, అని  చెప్పి  కవర్  చేశాను.

రాధ  కి  కాల్  చేశాను, మేడం  గారు  బయటకి  వెళదామా ? అని  అడిగాను “”ఏంటి  కృష్ణుడు గారు,  మంచి  జోష్  మీద  ఉన్నారు, సరే  ఎప్పుడు  వెళదాం””  అని  అడిగింది. రేపు  morning 5 ki start  అవుదాం, నైట్  8 అవుతుంది, రెడీగా   ఉండు  అని  చెప్పి పడుకున్న, next day morning లేచి  రెడీ అయి, రాధ  వాళ్ళ   ఇంటికి  దగ్గిరలో బైక్  అపి  కాల్  చేశాను, రాధ  వచ్చింది, నా  బైక్  మీద  రాధ First time ఎక్కడం, తన  చేతిని, నా  బుజం  మీద  వేసి  కూర్చుంది. మనస్సుకి నచ్చిన నిమిషం అది, ఆలా నిలిచిపోతే ఎంత బాగుంటుంది అనిపించింది. ఒక రోజులో యుగానికి, కావలిసిన  ఆనందాలను గుండెలో  పోగేసుకున్నాం, ఎన్నోన్నో… మాటలు, మదికి   గుర్తుకు  వస్తే,  మరణం  ముందు  ఉన్న, ఆనందం తోడు  ఉండేలా గడిచిపోయింది ఆ రోజు, నా సంతోషం  అంత  రవి, సుధీక్ష  ఇంకా  సింధుతో  మొబైల్  లో  పంచుకున్నాను, వాళ్ళు ముగ్గురు నీకు డబ్బులు  ఎక్కడ నుంచి వచ్చాయిరా అని అడిగారు, 3 months back, ఒక  bank  development కి coding రాశానురా, freelancer గ, so ఆ  money తో  day spend చేశాను  అని  చెప్పాను.

సెలవుల చివరి రోజున, డాడీ  నార్మల్ గా,  వీక్  ఎండ్  అని  రాధ  వాళ్ళ  family  ని, లంచ్ కి పిలిచారు, నేను  తారని  అదే  సమయానికి, ఇంటికి  రమ్మన్నాను, రాధని  చూసి, ఎవరు  అని  అడిగింది  తార “”నా  రాధ  అంటే  తనే””  అని  చెప్పాను, రాధని  చూసి, తార  నాతో “”నిజం   చెప్పు  రామ  కృష్ణ, మా ఇద్దరిలో  నేనే   బాగున్నా, ఏదో  పిల్ల  వయస్సులో పరిచయం  అయింది  కాబట్టి  ఇష్టపడినటు ఉన్నావ్ లే, అన్నట్టు  మా  నాన్నని  అడిగా, మన  ఇద్దరి  cast కూడా  ఒకటే  అంట, నువ్వు  compare చేసుకుంటే, నాతోనే  నీకు పెళ్లి   ఈజీ  అవుతాది, ఎం  అంటావ్,  బాగా  ఆలోచించి  Yes అని  చెప్పేయిరా””  అంటూ , రాధ  వంక చూసి  Hi sister అని  అంది, రాధ  నా  వంక  చూసి , ఎవరు  అని  సైగ  చేసింది, నేను  తార  అని  చెప్పడానికి  భయ పడ్డ, ఈ లోపు  అమ్మ, తారతో  “”తార  ఎప్పుడు  వచ్చావు రా కన్నా, రా   వచ్చి  భోజనం  చేయి”” అని అంది,  “”పర్లేదు  ఆంటీ, ఎవరో  చుట్టాలు వచ్చినట్టు  ఉన్నారుగా, మనం చివరిలో కలసి  తిందాం”” అని  చెప్పింది తార, ఆ మాటకి  రాధ  కి  చాల  కోపం  వచ్చినట్టు  అనిపించింది నాకు. విశాల్  ఫోన్  చేసాడు “”బావ  campus  selections prepone అయ్యాయి  అంట, ఈ  రెండు నెలలో interview conduct చేస్తారు  అంట, so కొంచం  ప్రిపేర్  ఆవు  అని  అన్నాడు, నేను  సరే  అని  ఫోన్  పెట్టేశాను.

Campus Selections రోజు వచ్చింది, చెప్పాలి అంటే చాల tension గా ఉంది, మద్య తరగతి కుర్రడికి, వాడి కుటుంభంకి ముక్యయమైన మలుపులో ఇది కూడా ఒకటి. ”ఓపికతో  ప్రయత్నిస్తూ, గెలుపుని  గౌరవించు అది  ఓటమిని  ఆపుతుంది”. అని  డాడీ  చెప్పిన  మాటలు  గుర్తుకు  వచ్చాయీ, interview కి  వెల్లాను, ప్రశాంతంగా ప్రతి  ప్రశ్నకి  సమాధానం  చెప్పడమే  కాకుండా  నవ్విస్తూ, interview attempt చేశాను, you are selected అని  చెప్పారు, నా  సంతోషంకి  అవదులు  లేవు, ఆ దైర్యంతో ఇంకా మూడు companies interview attend చేసాను, మొత్తం మూడు  companies కి  select అయ్యాను, బయటకి  వచ్చి  డాడీ  కి  కాల్  చేసి  చెప్పాను , congrats ra నాన్న, ఇదిగో  మీ  అమ్మ  మాట్లాడుతుంది  అంట  అని  ఫోన్  ఇచ్చారు, అమ్మతో  మాట్లాడాను, నాకు  ఎందుకో  వాళ్ళని చూడాలి  అనిపించింది, అదే  రోజు  సాయంత్రం  ఇంటికి  ప్రయాణం అయ్యాను, ఇంటికి  వెళ్ళగానే, తమ్ముడు  congrats రా  అన్నయ్యా  అని   welcome చెప్పాడు, ఆ  రోజు  interview సంగతులు  అన్ని, అందరితో   share చేసుకున్న.

సాయంత్రం, డాడీ  నన్ను కూడా  వాకింగ్ కి  తీసుకొని  వెళ్లారు, కొంచెం  సమయం  గడిచాక  ఒక  చోట  కూర్చున్నాము, డాడీ  నాతో  “”next ఏంటి  రా  అని  అడిగారు”” ఎం  ఉంది  డాడీ 4th year లో  minimum 80% తో  pass అయితే, 3 companies రెడీగా  ఉన్నాయి, hire చేసుకోవడానికి, ఇంకా  నేను ఎ company select చేసుకోలేదు అని  అన్నాను, “”package ఎంతరా””  అని  అడిగారు డాడీ. 13 Lakshs అని  చెప్పాను, ఒక నిమిషం  మౌనంగా  ఉండి “”job join అయాక, ఏంటి  మరి రాధ  వాళ్ళ  ఇంటిలో  మాటలాడుతావా ?”” అని  అడిగారు, అది  వినక  నా  గుండె  వేగం  ఎక్కువ  అయింది, నేను  ఏమి  మాట్లాడలేకపోయాను, డాడీ నాతో  ““నువ్వు  గత  5 సంవత్సరాలలో, మీ  అమ్మని,  రాధ అని  ఒక  7, 8 సార్లు  పిలిచి  ఉంటావు””  అని  అన్నారు అమ్మ పేరులో ప్రేయసి పిలుపు ని  పట్టుకున్నారు డాడీ  అనుకున్నాను…. To be continued on 2nd Dec 2022.

NEXT CHAPTER

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.8 14 votes
Article Rating
Subscribe
Notify of
guest

12 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sandeep kumar Kontham
Sandeep kumar Kontham
2 years ago

What a surprise thriller ending.. really awesome story.. 💐💐💐

Veerendranath
Veerendranath
2 years ago

Nyccc

Sanjeev
Sanjeev
2 years ago

Super story Ram
Elanti manchi story’s Marinni maku andistavani korukuntunnanu congratulations 👏👏

Vaishnavi
Vaishnavi
2 years ago

Last lo aa twist asal expect cheyaldu
No words to say as usual chala bagundi ram garu😊

Pawan Sekhar J
Pawan Sekhar J
2 years ago

Ending is awesome.,never expected😍

Sree
Sree
2 years ago

Eppatilane story chala baundhi Ram!!

That twist was really unexpected and good! And, the bonding between father and son that you represents always incredible 😍

#FIDA! Waiting for next chapter (@Mee fan girl🫰🏻)