నిజానికి ప్రేమ అంటే ఏమిటి?
అది ఎన్ని రకాలు…?
అసలు ఎలా చెప్పగలరు…?
ఎవరు చెప్పగలరు…?
ఎక్కడ మొదలవుతుంది…?
ఎలా మలుపు తిరుగుతుంది…?
ఎలా ముగుస్తుంది…?
అంటూ నా 71 సంవత్సరాల అనుభవంతో, ఆలోచనలతో అరా తిస్తే నాకు దొరికిన సమాధానాలు ఇవే.
నిజానికి ప్రేమ అంటే ?: అడవి కాచిన వెన్నెల వంటిది. ఆ వెన్నెల వెలుగును అనుభూతి చెందడం మనిషి మనసుకు తెలిసి ఉండాలి.
ఎన్ని రకాల ప్రేమ ?: రెండు రకాలు.
ఒకటి – ప్రేమ పంచుకోవడం, రెండు – ప్రేమ పంచి ఇవ్వడం.
ప్రేమను ఎలా చెప్పగలరు ?:
కాలం కష్టాన్ని కానుకగా ఇచ్చినప్పుడు, మనసుకు, మనిషికి తోడుగా ఉన్న విధానాన్ని బట్టి చెబుతారు.
అయితే అది ప్రేమ అని ఎవరు చెప్పగలరు ?:
ఆ ప్రేమను అనుభూతి చెందినవారే చెప్పగలరు, కాని ప్రేమించినవారు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే సరిగ్గా చెప్పడం వస్తే విడిపోయే ప్రేమికుల కన్నా, కలసి ఉండిపోయే మనసుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి.
ఇంతకీ ప్రేమ ఎక్కడ మొదలవుతుంది ?:
కంటి ఆకర్షణని మనసు మెచ్చుకుంటే ఇష్టం మొదలవుతుంది. మరి ఆ ఇష్టం ప్రేమ క్రింద మారుతుందా లేదా అన్నది అవతల మనిషిపైన, మన మనసుపైన ఆధారపడి ఉంటుంది. అప్పుడు మొదలు అవుతుంది.
ఆ ప్రేమ ఎప్పుడు మలుపు తిరుగుతుంది ?:
అవసరానికి మొదలైన ప్రేమ, వాస్తవానికి వచ్చేసరికి మలుపు తిరుగుతుంది. ఆ మలుపు దారులు అన్నీ బాధతోనే బంధీ అయి ఉంటాయి. బాధను భరిస్తూ ముందుకు వెళ్లినవాడు వెలుగును చూస్తాడు. భరించలేనివాడు జ్ఞాపకాల సమాధిలో బంధీ ఆవుతాడు. చిన్న చిరునవ్వుకు చిరునామా అవుతాడు.
ఇక చివరిగా ముఖ్యమైన ప్రశ్న — ప్రేమ ఎలా ముగుస్తుంది?
నిజానికి ప్రేమకు ముగింపు ఉండదు. ఉసురు పోయేంతవరకు, ఊసుకు వస్తూనే ఉంటుంది మనసుకి.
ఉసురు పోయేంతవరకు గుర్తుకు వస్తుంది అంటే అసలు ఇది ఎటువంటి ప్రేమ కథ అనేదే మన ఈ ఆమె జ్ఞాపకాలతో. Coming Soon.
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Nice Ram
Nuvvu rasina prati padam padmam la virabusindi Ram. Padalu ni chethilo upiri posukunnattu, prati vakyam bhavalatho nindindhi!!
—Keep weaving magic with your words. Mee Vidya 🙂
Thank you so much for reading and supporting on the same #Vidya Garu 🙂