HOME

1 వ అధ్యాయము


లోకం  పెట్టిన  పేరు

1969 – భారత  దేశంలో , ఒక్క పట్నంలో  పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా మీ వైపు  తిరిగిన కథ  ఇది

ఉదయం 3:00 గంటలకి, ఉరుముని  మింగేసే  చీకటిలో, ఆ చీకటిని  చెరిపేసి సూర్య కాంతి  లాంటి  కన్నులను తెరచి, ఒoపుల విల్లులాంటి  ఒళ్ళుని విరుచుకుంటూ, నిశ్వాస  ఉచ్వాసలను  బాణాలు  మాదిరిగా  వదులుతూ, పొందు పరిచిన  పరువాలను  పైటతో  కప్పి, అదే  పైట  అంచుని, నది  తీరుని  నెమరు  వేసే నడుము చుటూ  తిప్పి, నాభి  నగరమున  కొంగుని  దోపి, భూదేవి అందానికి  పోటి పడేలా ఉండే  అందాల  ఆస్తులతో, మగవాడి  దాహాలను  తీర్చే తన  దేహాన్ని, భూమికి  తాకే  ముందే నమస్కరించి, మువ్వల  సవ్వడి సరిగమల  శబ్దాలు  చేస్తూ, స్నానం  చేయాడాయికి  వెళుతూ, నన్ను నిదుర లేపిన మగువ పేరు  అమృత సులోచన, నా ఈ ఒక్క  రాత్రి సుఖాల  నదిలో  పడుచు  పడవలాంటి  పరువం  ఆమె.

మీ  స్నానాల  గది  గోడలకి, కనులు  ఇంకా  హృదయం  ఉండకూడదు  అండి  అమృత  సులోచన  గారు, ఒక వేళ  ఉంటే, కోహినూర్  వజ్రం వంటి  మీ  కన్య  కాంతిని, ఆ  గోడలకి  ఉన్న  కనులు, కన్నార్పకుండా చూసి… చూసి…  పేలిపోయే అవకాశం ఉందండి అమృత సులోచన గారు.

““బానే సెలవు ఇచ్చారు  అభిరామ్ రాజు గారు, మీకు  ఇంకా  నిదుర మత్తు  పోనట్టు లేదు, తెల్లవారు  జాము  కావస్తుంది, ఇంకా  ఈ  జాన, మీ  జంట  కట్టడం  కష్టం, కాబట్టి  కొత్త  కోరికలకు  కళ్లెం  వేసి, నన్ను  పొగడ్తలలో ముంచడం  ఆపండి, ఇప్పుడే స్నానం  చేసి  వచ్చాను, మళ్ళీ పొగడ్తలలో తడవాలి అంటే  కష్టం  సుమ…””,  అంటూ  చీర కట్టుకుంటుంది. తాను చీర కట్టుకునేటపుడు చూడడానికి  ఎలా  ఉంది  అంటే  నా  కనులకి, మేఘాలు  దూదిలా మారి, ఆ  దూదిని  ప్రకృతి  తన  చేతితో  చీర  క్రింద  మార్చి, సూర్య  కిరణాల  ఎరుపు  రంగుని  ఆ  చీరకు చేర్చాడు  ఏమో  అన్నట్టు అనిపిస్తుంది  నా  మనసుకి. అమృత  సులోచన  గారు, ఎందుకు  అండి  మరి  ఇంత  తెల్లవారు  జామున  లేచారు  అని  నేను  అడగగా. ““అభి  రామ్  రాజు  గారు, పనులు  ఉండవా  చెప్పండి, ఇల్లు  వాకిలి  శుభ్రం  చేసుకోవాలి, దేవుడికి  పూజ,  ఆరతి  ఇవ్వాలి, మా  పెద్దమ్మ  గారికి  స్నానంకి  వేన్నీళ్ళు పెట్టాలి, ఆ  తరవాత  అల్పాహారం చేయాలి,  చాల  పనులు ఉంటాయి  అండి”” అంటూ  చెపుతోంది . సరే  అండి  ఆ  పనులు ఆలా  ఉంచుదురు  కాసేపు, ఇలా  రండి వచ్చి నాతో  కబుర్లు చెప్పరాదు  అంటూ  నేను  తనని అడగగా, అప్పుడు తాను  నాతో, ““మాబోటి  వారితో  కబుర్లు కాదు  అండి  అభి  రామ్  రాజు  గారు, మా  కన్య  సొగసులతో  సమ్మోహనానికే సంధి  కుదిరేది””,  అని చెప్పింది నవ్వుతూ. అప్పుడు నేను  తనతో, అమృత  సులోచన  పేరుకి  అర్ధం, నాకు తెలిసినంత వరకు, అమృత  అంటే  అమృతం, సులోచన  అంటే అందమైన  కనులు కలిగినది అని. మరి ఈ రెండు  కలిపితే, మత్తు  ఎక్కించే అమృతాన్ని, తన  అందమైన కనులలో  కొలువు  ఉంచుతుంది  అనేగా, అంతేగా అని  అన్నాను. అప్పుడు  తాను పగలపడి  నవ్వుతూ, ““నా పేరులో  ఇంత అందమైన అర్ధం  దాగి  ఉందని  మీరు  తవ్వి తీసే  అంత  వరకు  నాకు  కూడా  తెలియలేదు  అభిరామ్  రాజు  గారు””  అని  నవ్వుతూ  అంది. ఆ నవ్వు చూస్తూ  నేను  తనతో, ఇంత  అందమైన  నవ్వుకి  ఒక్క  పేరు  సరిపోదేమో అమృత సులోచన  గారు, మీకు  ఇంకో  పేరు  ఏమి  లేదా, ఉదాహరణకి  ఎలా  అంటే  ముద్దు  పేరు  కానీ, లేక  మీకు  ఇష్టమైన  వారు  మిమ్మల్ని  పిలిచే  పేరు  కానీ  అని  అడుగుతూ  ఉండగా , తాను ఆ నవ్వుని సంధ్యా వేళలో సూర్య కిరణాలు మాదిరిగా చూస్తూ ఉండగానే ఆ నవ్వుని నెమ్మదిగా ఆపేసి, నా కనుల వంక  చూస్తూ, “వేశ్య…  నా  గురించి  తెలిసిన  వారు  పిలవడానికి  ఈ  లోకం  పెట్టిన  పేరు  వేశ్య”  అంటూ  చెబుతూ  మన  కథ పేరు  కూడా  ప్రకటించింది,

 మన  కథ  పేరు కూడా వేశ్య

to be continued with your support. Next chapter on dated: 04th Aug 2023.

Writer – Ram Kocherlla

S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.6 26 votes
Article Rating
Subscribe
Notify of
guest

24 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
NKR
NKR
1 year ago

Just introduction ichi vadhilalvu yenti bro. Malli next week varaku wait cheyalaa.

Rambabu
Rambabu
1 year ago

ప్రారంభం చాలా బాగుంది. కథ పేరు introduction చాలా బాగుంది. Keep it up.

Ram
Ram
1 year ago

Nice..

Ashwini
Ashwini
1 year ago

Super Bro, very well written waiting for next chapter. Using very good vocabulary. I just loved it! You have explained very well 😍🙈.

Lalitha
Lalitha
1 year ago

As usual super Ram👍👌🏻

Vaishnavi
Vaishnavi
1 year ago

Hello Ram garu,
Happy to see you again with these beautiful story 😊
The way you introduce every character in your story is so unique 🙌🏻

Latha
1 year ago

Good 👍

Siri chandana
Siri chandana
1 year ago

A matured intro really loved it.I really loved the way, he defined her name.waiting for the next part💗💗. Congratulations in advance👏

Santhosh
Santhosh
1 year ago

Nice one , Good narrative !

Sree
Sree
1 year ago

Evandoy Ram😍 garu!! Maa Ammayila andhalni pogadalanna..manasulo bhavaalu cheppalanna….meere sati, meeku leru Poti!

Mee next episode kosam eduruchuse Mee Abhimani❤️

Teju
Teju
1 year ago

Rammm 😍😍such a amazing one u have written… Can’t describe it words the feel.. Proper description abt everything.. It completely took into other world🥰.. I was completely immersed in it..cant evn think abt other..simply superb❤️

Teju
Teju
1 year ago

Eagerly waiting for the next one can’t waittt dudeee…. Literally waiting for 4th antey repuu aaa🤌💖yehh finally… Day is near by..