అనుకోని చుట్టంలా విచ్చేసింది నిశ్శబ్దం మా గదిలోకి, చీకటితో పాటు మౌనాన్ని కూడా మాయం చేయడానికి, నెమ్మదిగా సూర్యుడు చనువు తీసుకొని, వెలుగుతూ గదిలోకి వచ్చాడు. అమృత సులోచన జవాబుకి, నా మాట మూగబోయింది, నేను ఇంకా ఏమి మాటలాడలేదు, అప్పుడు అడిగింది నన్ను, “తమరు కూడా ఈ చోటు తెలుసుకోవాలి అంటే అదే పదం ప్రయోగించే ఉంటారుగా?”, అసలు ఇలాంటి చోటుకి ఎందుకు వచ్చారు మీరు, వయస్సు చూస్తే పాతిక ఏళ్ళు కూడా నిండి లేవు, పైగా ఇదే మొదటి సారి మీరు ఇలాంటి చోటుకి రావడం కూడా”. అంటూ కాఫీ ఇచ్చింది. అప్పుడు నేను తనతో.., మీరు చెప్పినట్లు ఇదే నేను మొదటి సరి రావడం ఇలాoటి చోటుకి, సరే కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఏ కారణాల చేత మగవాడు ఇలాంటి చోటుకి వస్తారు అని అడిగాను నేను. “ఏ కారణం అయినాకానీ, కార్య ఫలాలు ఒకటే కదా, కారణాలు చెపుతూ కలక్షేపం చేయడానికి వస్తారా చెప్పండి ఎవరైనా?” అంటూ చెప్పుకుంటూ వచ్చింది తాను. అమృత సులోచన గారు నేను మొదటి సారి రావడం ఇదే అని ఎలా తెలిసింది మీకు అని అడుగుతుంటే, నా ఉంగరాల జుట్టుని నిమురుతూ చెబుతుంది ఇలా. “తమరు అందాల కన్య ఖనిజాల కోటాలో ఉన్న సంపదల కోసం విచ్చేయలేదు, ఏదో వివరాలు సేకరిద్దాం అంటూ విచేసినట్టు అనిపిస్తుంది నాకు అని అంటూ ఉండగా, వాళ్ళ పెద్దమ్మ పిలిచింది తనని, తాను వెళ్లబోతుండగా, సరే అమృత సులోచన, నేను కూడా వెళ్లి వస్తాను అంటూ కదులుతున్నాను. అప్పుడు తాను “వెళ్ళండి మల్లి రావద్దు” అంటూ నవ్వుతూ చెపింది.
నేను, నా స్నేహితుడు ఒక ఇంటిన అద్దెకు సుకున్నాం, ఆ ఇంటికి నేను తిరిగి వచ్చి, గ్రంథాలయానికి వెళదాం అనుకుంటున్నా, అంతలో నా మిత్రుడు వచ్చాడు. వాడు వచ్చి రావడంతోనే, “ఎం ఓయ్… సోదర ఎలా జరిగించి మొదటి అనుభవం” అంటూ ఆటపట్టిస్తున్నాడు, నేను వాడితో, చూడు వికాసాల వినోదాల చెలపతి సోదరా, నా ఈ ప్రయత్నానికి మూలం నీకు తెలుసును కదా, మరి ఎందుకు ఈ సరదా మాటలు అని అంటూ ఉండగా చెలపతి నాతో, “ఇంకా చాలు ఆపు సోదరా, విదేశాల్లో గొప్ప… గొప్ప… చదువులు పూర్తి చేసావు, సుఖంగ అక్కడ ఉండకుండా, భారత దేశానికీ వచ్చి, వివరణ లేకుండా, ఈ వేశ్య మీద డాక్యుమెంటరీ ఏంటి సరదా?” అంటూ అడుగుతున్నాడు. చెలపతి నాకు ఒకటి చెప్పు, ఒక అందమైన మగువని మురిపంగ తన అందాన్ని వర్ణిస్తుంటే పొంగిపోని ఆడది ఉంటుంది అంటావా? అని అడిగాను, అప్పుడు చెలపతి నాతో, “ఆడవారి మొదటి పుట్టినిల్లు పొగడ్తే కదా సోదరా” అని నవుతున్నాడు, అప్పుడు నేను చెలపతితో ఇలా అన్నాను, కదా… నేను అమృత సులోచన అందాన్ని ఆకాశం అంత ఎత్తున పొగిడినా కూడా, అణువంత కూడా స్పoదిచలేదు, ఎందుకో తెలుసా, పొగడ్త అంటే తనకి, పడక గదిలోకి పిలవడానికి వాడే ఒక పదం, మగవాడి సుఖం కోసం సంధిచే ఒక శబ్దం అని అనుకుంటుంది కాబట్టి, అందుకోసమే ఈ డాక్యుమెంటరీ అని అన్నాను. అప్పుడు చెలపతి నాతో, “అవును సోదరా, నీవు చెప్పింది ముమ్మాటికీ వాస్తవమే, మగవాడు తిరిగితే కళాపోషణుడు అని కబుర్లు చెబుతూ, శృoగారపురుషుడు అంటూ సర్ది చెపుతోంది ఈ సమాజం, సరే కానీ మీ చిన్నాన్న గారి ఇంటికి వెళ్లి వస్తా అన్నావు, వెళ్ళావా లేదా?” అని అడిగాడు నన్ను. వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఇదిగో రేపు వెళ్దాం అని సిద్ధం అవుతున్నాను అని చెప్పి, నేను గ్రంథాలయానికి వెళ్ళాను.
రెండు రోజుల తరవాత, నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పిన్ని నాతో, “ఎం అయ్యా అభి రామ్, మాతో కలిసి ఉండచ్చుకదా ఎందుకని ఆలా ఒంటరిగా ఉండటం” అని అడుగుతూ, అట్లు వేస్తూ అల్పహారం పెట్టారు, అదే సమయానికి, చిన్నాన్న నన్ను ఎప్పుడూ లేని మాదిరిగా ఒక కొత్త చూపు చూస్తూ, “అరేయ్ అభి, మొన్న నీవు తెల్లవారు జామున, చావిడి శ్రీనివాస్ గాడి సందులో నుంచి వచ్చావ్ కదా?” అని అడిగారు, ఆ ప్రశ్న విన్నాక నా గుండె ఆగినంత పని అయింది. లేదు.. లేదు… చిన్నాన్న గారు నేను ఆ సమయం లో అక్కడ ఎందుకు ఉంటాను పైగా నాకు తెల్లవారుజామున లేచే అలవాటు అసలు లేదు, అని భయాన్ని దాస్తూ ధైర్యంగ సమాధానము చెప్పాను, ఇంతలో పిన్ని ఏమో చిన్నాన్నతో, “ఎం మాటాల్డుతునారు అండి మీరు, బంగారం లాంటి పిల్లవాడిని పట్టుకొని, ఆ దరిద్రపు శాలి కొంప సందులోనుంచి వచ్చాడు అంటారు ఏంటి మీరు” అని అంటుంది, కానీ చిన్నాన్న గారు నా మాటలు నమ్మలేదు, Paris లో ఉన్న నాన్న గారికి విషయం మొత్తం చేరవేశారు చిన్నాన్న. నాన్న గారు ఇంకా అమ్మ ఇద్దరు India వచ్చేసారు, వచ్చి రాగానే నాతో ఏమి, ఆ విషయం గురించి మాట్లాడలేదు కానీ, చిన్నాన్న తో, నాకు పెళ్లి చేయాలనీ, పెళ్లి సమం సంబంధాలు చుస్తునారు, నాకు వాళ్ళ ప్రయత్నం చూస్తే, వయస్సు వచ్చిన ఎద్దు ముక్కుకి తాడు కటినట్టు నాకు పెళ్లి అనే బంధం కడుతున్నారని అనిపించింది, ఇక్కడ నవ్వాల్సిన విషయం ఏమిటి అంటే అమృత సులోచనకి, నాకు ఏమి శారీరక సంబంధం లేకపోయినా, సమాచారం సరైన తీరున వెళ్లలేదు, నిజానికి తప్పు నది కూడా ఉంది, న డాక్యుమెంటరీ గురించి, నాన్న గారికి చెప్పి ఉండి ఉంటే ఈ పెళ్లి అనే పరిస్థితి వచ్చేది కాదు, నేను ఎదురు చెప్పడానికి సరైన కారణం లేనందు చేత, నాకు పెళ్లి సమ్మతమే అని చెప్పాను.
వివాహం పనులు అన్ని సాఫీగా సాగిపోతున్నాయి కానీ ఇంకో వారం లో వివాహం ఉంది అనగా, పెళ్లి కూతురు మేనమామ వచ్చి, “మీ అబ్బాయి గారికి చెడు తిరుగుళ్ళు ఉన్నాయి, అది మాకు ఆలస్యంగ తెలిసింది, తెలిసి.. తెలిసి… మా బిడా గొంతు కోయలేము అంటూ , వివాహం పైన ఆశలు వదులుకోండి” అని చెప్పి వెళ్లి పోయారు. నిజం చెప్పాలి అంటే అయన ఆ మాట అన్నదానికన్నా, మా అమ్మ గారు ఆ విషయం నమ్మి, ఏడుస్తూ నిలిచిపోయారు, ఆ సంఘటన చూసి నాకు చాల బాధ కలిగింది, ఇంకా నాన్న గారు నమ్మినా నమ్మకపోయినా ఆయనకి ఉన్న పరువు కోల్పోయారు. నిజానికి జరిగింది ఒకటి, ఆ కారణంగ నా జీవితంలో జరుగుతున్నది ఇంకొకటి.
తిరిగి Paris వెళ్ళిపోదాం అని సిద్ధం అవుతుండగా, ఒక రోజు అమృత సులోచన ఒక చిన్న పిల్ల వాడితో, ఊరులో ఉన్న కాలువ దగ్గర కలుద్దాం సాయంత్రంవేల 6:00 గంటలకి అని కబురు పంపించింది, నాకు వెళ్ళాలి అని లేదు కానీ ఎం చెప్పబోతుందో అని వేళ్ళను, కాలువ దగ్గర అమృత సులోచన కొంగుని, తల మీదనుంచి, తన బలమైన భుజాలు మీదిగా కప్పుకుని ఎదురు చూస్తుంది, ఎండని నిద్దుర పుచ్చడానికి కాలువలో ఉన్న కమలాలు కదులుతూ చల్లగాలిని చిగురిస్తున్నాయి. తాను నన్ను చూడగానే, వెలుగుతూ ఉండే తన కనులతో కంట తడి పెట్టుకుంటూ నన్ను క్షమించాడి అంటూ కాళ్ళ మీద పడింది, తప్పు తన ఒంటిలో లేకపోయినా, తన ఇంటిలో ఉంది అని అనుకోని క్షమాపణ కోరింది. చూడు అమృత సులోచన, తప్పు ఇద్దరిది కాదు, నువ్వు ఉండే చోటు, నేను విచ్చేసిన చోటు తప్ప ఇంకేమి కాదు. నిజానికి ఏమి జరగలేదు అని చూసిన ఆ నాలుగు గోడలు తప్ప ఇంకా ఎవరు నమ్మరు, ఈ విషయాన్ని గురించి నీవు ఎక్కువగా ఆలోచించకు అని చెప్పాను, అప్పుడు తాను నాతో, “మీ వివాహం ఆగిపోయింది అని విన్నాను దానికి కారణం నేను అని తెలిసినప్పుడు, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న మీ మనస్సు నాకు అర్ధం అయ్యింది, ఆలస్యం చేయకుండా నేను చెలపతి అన్నయ్య గారితో మాట్లాడాను, మీరు మాబోటి వారి మనోభావాలు ఇంకా జీవితాల కోసం ఏదో పుస్తకం రాస్తున్నారు అంటగ, అవకాశం ఉన్నా, అర ఆడుగు దూరాన అందం ఉన్నా కూడా మీరు హద్దులు దాటలేదు ఆరోజు, అలంటి మంచి మనిషి మీద, నింద పడింది, అనే ఆలోచన నన్ను చిత్రవధ చేస్తుంది, ఈరోజు మీరు విదేశాలు వెళిపోతున్నారు అని తెలిసింది, అందుకే కొంచం ధైర్యం చేసి ఇలా వచ్చాను మీకు క్షమాపణ చెప్పడానికి. మీరు ఎక్కడ ఉన్న సంతోషంగ ఉండాలి అండి, నేను మీకు ముందే చెప్పాను కదా, అందరి ఆశ, అవసరం ముందు నేను దొరసాని, ఆశ ఆవిరి అయ్యాక నేను సాని. ఆ సాని శాపం మీదాకా వచ్చి వాలింది” అని చెపుతోంది. ఇంతలో, నాన్న గారు ఇంకా చిన్నాన్న గారు కాలువ పక్కగా వెళుతూ మా ఇద్దరిని చూసి మా వద్దకు వచ్చారు ——-> To be continued on 11th Aug 2023
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Ee chapter chala interesting undi
Next episode kosam eduru chusthu unta Ram garu😊
Thank you so much #Vaishnavi Garu 🙂
Interesting Ram! The way you continue the story and the twists, end was 🔥. Keep rocking. Waiting for the next episode ✌️❤️…Aksharalatho (vocabulary) aadukuntavayya!!😊. Goppa writer avvalani aashisthuu– Mee Abhimani 🤗
Thank you so much for your lovely feedback #Sree Garu 🙂
Nice story bro
Thank you so much for your feedback #Tarak Bro 🙂
Interesting Ram! The way you continue the story, twists and end was 🔥❤️. Eagerly waiting for the next episode. Aksharaltho (vocabulary) aadukuntavayya,🤗. Goppa writer avvalani aashisthu – Mee Abhimani ✌️
Super chapter. Oka sthrini ela vivarinchalo neeku baga telusu bro 😍 continue the same super excited to next chapter. “తమరు అందాల కన్య ఖనిజాల కోటాలో ఉన్న సంపదల కోసం విచ్చేయలేదు, ఏదో వివరాలు సేకరిద్దాం అంటూ విచేసినట్టు అనిపిస్తుంది నాకు అని అంటూ ఉండగా,. ” super this one .🙈😍.
Nice brother.
chalaa bagundhi ram.the way of your narration and the way you introducing the characters and the twist’s in the story is really awesome. I am eagarly waiting for next episode🔥🔥🔥🔥.