HOME

4వ అధ్యాయము

నిజానికి ధైర్యం తోడు కావాలి

       

Documentary విజేతను ప్రకటించగానే నాకు ఒక నిమిషం, జరుగుతున్నది అంతా కలలా  అనిపించింది, అంతలో అమృత సులోచన వేదిగా పైకి వెళ్లారు, తను అవార్డు తీసుకున్నపుడు, తనని మాట్లాడమన్నారు, తను చెపుతుంది ఇలా, “ఇక్కడ కూర్చున్న పెద్దలకి, నా తోటి వారికి అందరికి నమస్కారం, Documentary అనేటప్పటికీ, ఎన్నో జరిగిన విషయాల వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీసి వద్దకు చేర్చే పుస్తకం, అలాంటి  ఈ అవార్డు సొంతం చేసుకున్న వేశ్య  అనే ఈ Documentary వెనుక ఒక మనిషి జీవితంలో నిజం చెప్పినా చెరుపుకోలేని నిందతో పూర్తి అయింది, తన పేరు Mr. అభి రామ్ రాజు and I will dedicate this award to him” అని చెప్పి వేదిక దిగి నా వద్దకు వచ్చి నిలుచుంది.

నాన్న గారు అమృత సులోచన తో, ఏంటి అమ్మ ఇది అంతా నాకు ఏమి అర్ధం కావటం లేదు అని అడగగా, తాను చెపుతుంది ఇలా, ““నాకు మీ అబ్బాయి 10వ తరగతి నుంచి తెలుసు అండి. ఆ తరువాత కాలేజీ కూడా ఒకటే, కానీ అభి రామ్ రాజు నన్ను ఎపుడూ చూడలేదు ఏమో, నిజం చెప్పాలి అంటే మీ అబ్బాయి తన లోకంలో తాను ఉంటాడు, ఎపుడూ ఏదో ఒకటి రాసుకుంటూ, నేను ఎన్నడూ మాట్లాడే ధైర్యం చేయలేదు, ఒక రోజు నేను Documentary హాల్ లో నా పేరు నమోదు చేయడానికి వెళ్లినప్పుడు, మీ అబ్బాయి కూడా వచ్చారు, విచిత్రం ఏంటి అంటే ఇద్దరం ఒకే అంశం మీద పుస్తకం రాద్దాము అనుకున్నాం కాకపోతే, నేను మగ వాడు ఏ కారణాల చేత అలా చెడు దారి వైపు వెళ్తాడు అని నేను, మీ అబ్బాయి గారు ఆడవారు ఎందుకు అలా మారతారు అని రాద్దాం అనుకున్నారు. దేవదాసి చీకటి జీవితం జన్మించింది మన భారత దేశం లోనే కనుక మీ అబ్బాయి గారు భారత దేశం వెళ్లారు, నేను కూడా మీ అబ్బాయి బాటలో ప్రయాణం అయ్యాను ఆయనకి తెలియకుండా”” అని చెపుతోంది, ఇంతలో మా అమ్మ గారు తనని ““అది ఏంటి అమ్మ అంతా ధైర్యం ఏంటి అసలు, పెళ్లి కావాల్సిన దానివి పైగా ఒంటరిగా ఆ శాలి గృహం లోకి ఎలా వెళ్ళావ్ అసలు, జరగకూడనిది జరిగి ఉంటే ఏంటి పరిస్థితి”” అని అడిగింది, అప్పుడు తాను ““మీ అబ్బాయి గారి స్నేహితుడు చలపతి గారిని నేను పరిచయం చేసుకున్నాను, ఆ రోజు మీ అబ్బాయి గారు వివరాల కోసం శాలి గృహానికి వెళుతున్నారు అని తెల్సిన తరువాతే నేను వెళ్ళాను, ఇంకా మీరు అన్నట్టు పెళ్లి కావాల్సిన దానిని అన్నారు, నాకు కాబోయే భర్త నేను చెప్పే నిజాన్ని నమ్మితే చాలు, ఆస్తులు ఉన్న అనాధని నేను, నాకు ఏమైనా ఐతే ఏడిచే వారు, బాధ పడే వారు ఎవరు లేరు, అందుకే ఆ ధైర్యం. పైగా మీ అబ్బాయి గారు తోడుగా ఉన్నారు”” అని చెప్పుకుంటూ వచ్చింది.

అమ్మ, నాన్న ఇంకా అమృత సులోచన మధ్య జరిగే సంభాషణలో కదా నాయకుడిని నేను అయినప్పటికీ నాకు మాత్రం ఒక మాట కూడా ఆ దేవుడు రాయలేదు ఏమో అనుకుంటూ నేను తనని చూస్తూ ఉండిపోయాను. అమృత సులోచన, నా తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పి నా వల్లే మీ అబ్బాయి వివాహం ఆగిపోయింది అని అంటుంది. అప్పుడు నాన్న గారు, “”నీ దోషం ఏమి లేదు అమ్మ, తప్పు నాదే మా వాడి గురించి నాకు తెలిసన కూడా నేను ఇంకో మారు ఆలోచించలేదు, సరే మీ ఇద్దరు ఈ అవార్డును వేడుక చేసుకొండి”” అంటూ అమ్మను తీసుకొని నాన్న గారు వెళ్లిపోయారు ఇంటికి.

మా ఇద్దరి కనులకు మాటలు వచ్చాయి, పెదవులకు సిగ్గు వచ్చింది, కలిసి నడుస్తూ మౌనంతో మెట్లు దిగి కబురులతో కదలాలి అని, నేను తనతో మాట్లాడడం మొదలు పెట్టాను.

అభి రామ్ రాజు: నిజం చెప్పాలి అంటే, ఆడవారితో ముందుగా ఎలా సంభాషణ సాగించాలో నాకు సరిగ్గా తెలియదు అండి.

అమృత సులోచన: అయ్యో పాపం… తెలియకుండానే, తమరు ఆరోజు నన్ను ఆకాశం ఆంత ఎత్తున పొగడతటమే కాకుండా అందాలను అందంగా వర్ణిస్తూ వివరించారా?

అభి రామ్ రాజు: అంటే వర్ణించడానికి  ప్రకృతి లాంటి అందం ఉండాలి కానీ, పరిచయంతో పని ఎం ఉంది అండి.

అమృత సులోచన: బాగానే సెలవు ఇచ్చారు, నిజానికి ఇపుడే నాకు మనసు ప్రశాంతంగా ఉంది, ఎందుకు అంటే కనీసం మీ అమ్మ, నాన్న గారికి నిజం చెప్పగలిగాను.

అభి రామ్ రాజు: ఆ విషయంలో నేను మీకు కృతజ్ఞ్యత చెప్పాలి, అవునండి ఒక వేల నేను అవార్డు ఫంక్షనుకి  రాకపోతే ఏంటి పరిస్థితి?

అమృత సులోచన: మీరు కచ్చితంగా వస్తారు అని నాకు తెలుసు ఎందుకంటే, మీ డైరీని నేను చదివాను ఆ రోజు రాత్రి, ఆ అక్షరాల ఆధారంగా మీ మనసు కొంచం అర్ధం అయింది.

అభి రామ్ రాజు: నేను ఎన్నో సార్లు నడిచిన ఈ EIFFEL TOWER విధుల్లో, మీ కనులలో కాంతి కన్నా తక్కువగా వెలుగుతూ ఉన్న ఈ విధి దీపాలు చూస్తున్నప్పుడు, నాకు కొత్తగా ఉంది. ఎందుకు అని ఆరా తీస్తే, ఈ వెలుగుల నడుమ నేను ఒక చందమామతో కలిసి నడుస్తున్నాను ఏమో అని అనిపిస్తుంది

అమృత సులోచన: ఆడవాళ్ళను చూస్తే ప్రతి మగవాడు ఒక కవిలా అయిపోతారు కాబోలు?

అభి రామ్ రాజు: ఆడవారు అనడం కన్నా, అందమైన ఆడవారిని చూస్తే కవులు అయిపోతారు అనవచ్చు, ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు Paris లో?

ఇంతలో అమృత సులోచన… అమృత సులోచన… అంటూ ఎవరో పిలిచారు. ఎవరా అని చూస్తే, తన స్నేహితురాలు అంట, “ఆలస్యం  అవుతుంది ఇంక వెళదామా?”అంటూ తనని అడిగింది. అమృత సులోచన కూడా సరే వెళదాం అంటూ, వెళ్లి వస్తాను అంటూ చెప్పి వెళ్ళిపోయింది.

రేపు మల్లి యూనివర్సిటీకి వస్తుందిగా అనుకుంటూ నేను సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. నాకు తన ఆలోచనలే, ఎంత అందంగా ఉంది, సూర్యుడి లాంటి ఎర్రటి పెద్ద బొట్టు, చిమ్మ చీకటి కూడా భయపడే నల్లని ఒత్తయిన కురులు, శృతి మెత్తని చేతులకి చిన్ని చిన్ని గాజులు, గాలిని కూడా అదుపు చేసే, లేత మల్లె పువ్వు లాంటి వేళ్ళు, గులాబీ రంగు లాంటి ఒంటి ఛాయకి దిష్టి తగలకుండా కాటుక లాంటి నలుపు రంగు చీర ఎంత అందమో ఆమెది అనుకుంటూ, తను ఎం చేస్తూ ఉంటుంది ఈ సమయంలో నా గురించి ఆలోచిస్తుందా అసలు అనుకుంటున్నాడు              అభిరామ్ రాజు.

 

“”మరి మన అమృత సులోచన ఇంక తన స్నేహితురాలు భాగ్యవతి ఏం మట్లాడుకుంటున్నారో చూద్దాం””

 

భాగ్యవతి: ఎలా జరిగింది, కార్యక్రమం అంతా? తిరిగి భారత దేశం ఎప్పుడు వెళిపోతున్నాం?

అమృత సులోచన: అంతా సవ్యంగానే జరిగింది కానీ ఇంకా కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఏమో…

భాగ్యవతి: వచ్చిన పని పూర్తి అయిందిగా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం మనం?

అమృత సులోచన: వచ్చిన పని సగమే పూర్తి అయింది.

భాగ్యవతి: నువ్వు మొత్తం చెప్పలేదా? అభి రామ్ రాజు గారికి?

అమృత సులోచన: అవును మొత్తం చెప్పలేదు, నిజానికి ధైర్యం తోడు కావాలి అనిపించింది అందుకే నేను నిజంగానే వేశ్యని అని చెప్పలేదు…. To be continued on 25th Aug 2023

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.9 9 votes
Article Rating
Subscribe
Notify of
guest

8 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Vaishnavi
Vaishnavi
1 year ago

Hello Ram garu,
Prathi chapter ending ki expect cheyani twist istunanru next chapter lo em jarugutadho telusukovali ani interest ekuva avutundhi😂
Epati laga ey chala bagundi😊

Sree
Sree
1 year ago

Superb Ram!! The literature and story continuation was🔥. Eagerly waiting for the next episode 🤗.

Kiran
Kiran
1 year ago

Malli ending twist haa
Super ram garu

Veeresham
Veeresham
1 year ago

When can you release 5th chapter?