భాగ్యవతి: ఏంటి…. ఎం అంటున్నావ్…? చూడు, ఉన్న ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి, ఆంగ్ల భాష నేర్చుకొని, ఆయన రాసిన పుస్తకం కొంచం చదివి దాని ఆధారంగా నువ్వు పుస్తకంని పూర్తి చేసి ఇక్కడి దాక వచ్చి, వాళ్ళ అమ్మ నాన్న గారికి అయన మంచి వాడు, తప్పు ఏమి చేయలేదు అని వివరించవు మరి ఇంకా ఏంటి….ఎందుకు…?
అమృత సులోచన: ఏమని చెప్పమంటావే, ఈ ఓని ఒంటిమీదకు వేసి, వయసు వచ్చింది అని చెప్పినప్పటినుంచి, ఆ చీకటి గోడల మధ్య నలుగుతుంది నా దేహం కాదు నా మనసు, ఇన్ని సంవత్సరాలకు ఒక మగవాడు, నా భుజాల బలం వైపు చూడకుండా, నా కనులని చూస్తూ ప్రేమగా మాటలాడుతుంటే, నాలో ఉన్న ఆడతనం, చిరుగాలికి చిన్న పిల్ల మనసు ఆనందంతో ఉన్నట్టు ఉంది, 18 ఏళ్ళ వయసుకే సుఖాల స్వర్గంలో నరకాన్ని చూస్తూ ఎదిగాను, అభి రామ్ రాజు గారి మనసుకి నేను బానిసని ఇంకా బందీని ఐపోయాను, అయన కనులలో నాపై ఉన్న ప్రేమని కోల్పోతాను ఏమో అని భయమేసి, ధైర్యం సరిపోక నిజం చెప్పలేదు. ప్రేమకి ఆస్థి, అంతస్థు, కులం ఇవే అడ్డు అనుకున్న నాకు, నా ఈ దేహమే, దరిద్రంగా దీక్షుచికలా దర్శనం ఇస్తూనే ఉంది. అమ్మ ఇచ్చిన వరస్తవమో, నాన్న పేరు అమ్మ చెప్పుకోలేక పోవడమో, ఈ రెండే నా జీవితానికి మోయలేని బంధాల బరువులు అనుకున్నాను, కానీ నా జీవితం గురించి, జీవితం పంచుకుందాం అనుకున్న వాడితో చెపుకోలేకపోవడం అనిటికి మించి పెద్ద శిక్ష నాకు అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది.
భాగ్యవతి అమృత సులోచనని పట్టుకొని ఏదుస్తూ ఉరుకోపెడుతూ ఇలా అంటుంది. మన దేహాలు, దాహాలను దూరం చేయడానికే చిగురించాయి తప్ప ఒకరి ఇంట్లో దీపంగా వెలగడానికి కాదు, అందుకే కష్టంగా ఇష్టాన్నిచంపుకొని, నిజం చెప్పి అబద్ధాన్ని దూరం చేస్తూ, నువ్వు కూడా దూరం అవ్వు. దాని వల్ల ఇరువురికి కాదు, అతనికి మంచిది అని చెప్పింది. అమృత సులోచన సరే అని చేప్పి నిదానించింది.
మరుసటి రోజు సాయంత్రం, అమృత సులోచనకి నేను ఎర్రటి గులాబి పువ్వులను తీసుకొచ్చి ఇచ్చాను యూనివర్సిటీ దగ్గర, తాను వాటిని తీసుకుంటున్నపుడు, ముళ్ళు గుచ్చుకొని రక్తం వచ్చింది, ఆ రక్తాన్ని తాను చూస్తూ నాతో.
అమృత సులోచన : అభి రామ్ రాజు గారు, ఎర్రటి గులాబి కావాలి అనుకునే ప్రతి వ్యక్తి అదే ఎరుపు రంగు రక్తాన్ని బయట చూడటానికి ఇష్టపడడు, అదే తీరున పైకి కనిపించే, పైకి చూపించే అందమైన ఛాయ లాంటి గులాబి జీవితాలలో, ఇష్ట పడలేని నిజాలలాంటి ముళ్ళు కూడా ఉంటాయి, అవి తెలిసి గుచ్చుకున్నప్పుడు గులాబిని వదిలేస్తామా?
అభి రామ్ రాజు: తన చేతికి ఉన్న రక్తాన్ని తుడుస్తూ…. గులాబిని ఇష్ట పడక ముందు ఆలోచించాలి, ఒక సారి ఇష్టపడ్డాక ముళ్ళని మనసులోకి మౌనంతో ముడి వేసి మరిచిపోవాలి,
అమృత సులోచన : ఒక చిన్న నవ్వు నవ్వుతూ, సున్నితమైన సమాధానం సెలవు ఇచ్చారు.
అభి రామ్ రాజు: మనసుకి సున్నితమైన సమాధానం, ప్రాణానికి ఊపిరి లాంటిది. అందుచేత సుడిగుండం లాంటి సూటైన సమాధానంతో స్పందించకూడదు…
అమృత సులోచన: మనసుని ముంచే మాటలో రారాజు మీరు.
అభి రామ్ రాజు : పొందాలన్నా, పోగొట్టుకోవాలన్నా నోటి మాటే కదా మనసులో మిగిలేది, అయినా ఎందుకు అలా అన్నారు నన్ను?
అమృత సులోచన: అంధకారం అయిన రాత్రి ఆకాశపు వీధులను వెలిగించే నక్షత్రాలు గొప్పవా ? లేక…తనను తాను ప్రతిరోజు నలుపుగా మార్చుకునే ఆకాశం గొప్పదా…. ?
అభి రామ్ రాజు : ఒకరి విలువ ఒకరు తెలుసుకొని, కలుసుకుందాం అనే ప్రయత్నం గొప్పది…
అమృత సులోచన: అందుకే అన్నాను, మీరు మనసుని ముంచే మాటలో రారాజు అని…
Ala మాట్లాడుకుంటూ, ఇద్దరం కలిసి Parisని చూడడానికి వెళ్ళాం. ఎన్నో కబుర్లాతో ఆరోజు గడిచింది. వారలు, రోజులుగా, రోజులు గంటలుగా గడియారం ముళ్ళు సాగుతోంది. ఇద్దరం ఎంతో దగ్గర స్నేహితులం అయిపోయాం, తాను భారత దేశం వెళ్లాలని చెపింది ఒక రోజు. ఎప్పుడు అని అడిగాను, ఇంకో రెండు రోజుల్లో అని చెప్పింది. తాను వెళ్లే రోజు రాణే వచ్చింది, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను, చుట్టూ ఎన్ని శబ్దాలు ఉన్నా, తన గుండె చప్పుడు నా మనసుకి వినపడింది. ఏమైన మాట్లాడచ్చుగా అని అడిగింది, మంచి స్నేహితుల మధ్య, ఇంకా ప్రేమికుల మధ్య దాపరికాలు ఏమి ఉండవు కదా అమృత సులోచన అని అడిగాను. తాను అవును ఉండవు అని చెప్పింది, అప్పుడు నేను తనతో మనం దాదాపు ఒకటిన్నర మాసము నుండి మంచి స్నేహితులుగా ఉన్నాం, అయినప్పటికీ నువ్వు నా తల్లిదండ్రులతో చెప్పిన అబద్ధాన్ని నిజంలా నా దగ్గర కొనసాగిస్తూనే ఉన్నావ్. గడిచిన ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నిజం చెపుతావేమో అని ఎదురు చూసాను.
నిజం చెప్పి నా జీవితంలో నిలిచిపోతావేమో అనుకున్నా, కాని అబద్ధంతో అందకుండా అదృశ్యం అయిపోతున్నావు… To be continued on 22nd Sep 2023
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta
Dear Sir, please don’t be late for next chapter
Sorry for the late #Veeresham garu, it wont be late in further and thank you so much for showing interest in my writings and please share with your friends and Family 🙂
Hlo Ram garu mee literature awesome undhi and aa twists and tarvata em jaruguthundho ani aa suspense simply superb waiting for next chapter. All the best Ram garu
Thank you for for sweet and nice feedback #Niha garu, next chapter be on dated:22nd Sept 2023 🙂
Hello Ram garu,
Ee chapter motham lo nak Baga nachindhi okare veluva okaru telusukoni kalusukundam.. ee line matram heart touching ga undi andi😍
ee chapter kosam kchm ekuva rojulu wait cheypinchina Dani marchipoyelaga story undi😊🙌🏻
Waiting for the next chapter…
Hello #Vaishnavi Garu,
Thank you so much for your feedback and next chapter time ki release chesthanu 🙂
Asusual 🔥… Superb RAM!! Story continuation and twists in each chapter was awesome. Waiting for the next chapter!!
-Mee Abhimani❤️😊
Thank you for feedback #Sree garu 🙂