HOME

6 వ అధ్యాయము

వెన్నెల

 

Chapter-6: వెన్నెల

అది ఏంటి మిగతా పేపర్స్ అన్ని ఎంప్టీగా ఉన్నాయి… డాడీ…. డాడీ, ఈ బుక్ తాతయదే కదా అండ్ తాతయ్య పూర్తి పేరు అభి రామ్ రాజు కదా, నాకు ఈ పుస్తకం  అటక మీద దొరికింది, అంటూ వాల్ల డాడీ (ప్రదీప్)ని అడిగింది. అప్పుడు ప్రదీప్ తన కూతురితో, “నువ్వు ఆ పైకి ఎందుకు ఎక్కావు, తాతయ్యగారికి తెలిస్తే కోపడతారు, నువ్వు ఆ బుక్ అక్కడే పెటేసెయ్” అంటూ తిడుతున్నాడు. అంతలో అభి రామ్ రాజు వచ్చాడు. మనవరాలి చేతిలో తన పుస్తకంని చూసాడు. నెమ్మదిగా మనవరాలు దగ్గరకు వెళ్లి ఇలా అంటున్నాడు, “నీ వయసు ఎంత ఇప్పుడు, ఒక 23 ఉంటాయి కాబోలు, నీ వయసుని పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివే ఉంటావ్, ఆపై నీకు వచ్చే సందేహాలు నా సమాధానం కోసమే ఆని అర్ధం అవుతుంది. మీ నానమ్మ గుడికి వెళ్ళింది, నడు ఆలా గుడికి వెళుతూ మాట్లాడుకుందాం” ఆని తీసుకొని వెలుతున్నప్పుడు వాల్ల సంభాషణ సాగుతుంది ఇలా

 

మనవరాలు: అమృత సులోచన గురించి, నానమ్మకి తెలుసా తాతయ్య…?

 

అభి రామ్ రాజు: ఆడపిల్లవి అనిపించుకున్నావ్ ఈ ఒక్క ప్రశ్నతో… మీ నానమ్మకి తెలుసుకోవాలిసిన అవసరం లేదు, నాకు చెప్పాల్సిన పరిస్థితి రాలేదు.

 

మనవరాలు: అమృత సులోచన గారు నిజం దాచారు ఆని మీకు ఎలా తెలిసింది తాతయ్య?

 

అభి రామ్ రాజు: దాచింది వస్తువుని కాదు వాస్తవాన్ని, వద్దు అన్నా కానీ అది విరజాజి పూలలా మాదిరిగా సంధ్య వేల చీకటిలో కూడా వికసిస్తూ వెలుగుతుంది. అమృత సులోచన నాతో పాటు Parisలో 10వ తరగతి వరకు చదివింది ఆని చెప్పింది, నేను నా పాత స్నేహితులతో ఆరాతీసాను తన గురించి అప్పుడు తెలిసింది, తాను అబద్ధం చెపుతూ, మా మధ్య జరిగిన నిజం చెప్పడానికి వచ్చింది ఆని.

 

మనవరాలు: అబ్బో… మా తాతయ్య ఎంత తెలివైన వారో, కానీ తాతయ్య… ఆ నాలుగు గోడల మధ్య, 3:00 Am గంటలకి మొదలు అయిన ఈ కథలో, రెండు దేహాలు ఒకటి కాలేదు అంటే నమ్మడానికి, నా వయసు ఒప్పుకోవటం లేదు తాతయ్య.

 

అభి రామ్ రాజు: చూడరా చిట్టి తల్లి, పెళ్లీడుకి వచ్చిన పిల్లవి కాబట్టి నీకు ఒకటి చెపుతాను, గుర్తు ఉంచుకోరా. యవ్వనపు వయసు వాతావరణంలో ఒకటి అయ్యే దేహాలకి, దాహం తీరేంత వారికే దూరం దగ్గిర అవ్వదు, కానీ మనసు మెచ్చిన వారితో మెసిలితే, కాపురానికి విలువ పెరుగుతుంది, అప్పుడు సిగ్గు చీకటిలో దాక్కొని మరి ఆ జంటని, జాబిల్లి వెలుగులో ఆ విలువైన సఖునాలను చూస్తుంది, చూసి ఆ సిగ్గు కూడా మురిసిపోతుంది.

 

 

మనవరాలు: వినడానికి బాగుంది కానీ మా generation అర్ధం అవుతుందో లేదో…, సరే, సరే.. కానీ, మరి మీ నాన్న గారికి మీరు తను వేశ్య ఆని నిజం చెప్పారా?

 

అభి రామ్ రాజు: తను ఆ ఇంటికి చెందింది కానీ, ఆ ఇంటి వారికీ కాదు, అందుకే వేశ్య ఆని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు

 

మనవరాలు: తన గురించి మాట్లాడుతుంటేనే, మీ ముఖంలో ఎంతో ఆనందం, ఇంత వయస్సు వచ్చినా ఆ సంతోషం, తను ఇప్పుడు ఎక్కడ ఉంది తాతయ్య?

 

అభి రామ్ రాజు: నా మనస్సుకి చాలా దగ్గరగా బయట ప్రపంచానికి మరిచిపోయే అంత దూరంగా.

 

మనవరాలు: అంటే మీ ఉద్దేశం తను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అనా? అసలు ఈ విషయం నానమ్మకి తెలుసా?

 

అభి రామ్ రాజు: గుడి వచ్చేసింది, మీ నానమ్మ ఎక్కడ ఉందో చూసిరా ముందు, వేళ్ళు.

 

మనవరాలు: తాతయ్య సమాధానం చెప్పండి, Happy ఉన్న మీ face, sad మారింది ఎందుకు.

 

అభి రామ్ రాజు: ముందు వెళ్లి మీ నానమ్మ ఎక్కడ ఉందో చూడామణి చెప్పానా ? వెళ్ళు.. వెతుకు ఎక్కడ ఉందో..

 

మనవరాలు: అభి రామ్ రాజు భార్యని తీసుకొచ్చింది, తను వచ్చి రావడంతో, అభి రామ రాజుతో ఇలా అంటుంది..

 

అబ్బా.. అబ్బా.. ఏంటి అండి దీని గోల, దేవుడి పూజ మధ్యలో నుంచి లాకొచ్చింది నన్ను, పైగా తాతగారు నీ దగ్గిర ఒకటి దాచారు ఆని చెవిలో తూనీగలు మోత ఒకటి, ఏంటి ఏం దాచారు మీరు నా దగ్గిర ఆని అడుగుతుంది. అపుడు అభి రామ్ రాజు తన భార్య వెన్నెలతో “వెన్నెల నీ అసలు పేరు ఏంటో చెప్పు మన మనవరాలికి ఆని అన్నాడు. అప్పుడు తన భార్య, అభి రామ్ రాజు మౌనంతో ఉన్న చిన్నపాటి నవ్వుని చూసి, మనవారిలితో…, చిట్టి తల్లి నా అసలు పేరు “అమృత సులోచన“

 

 

The End

 

ప్రతి ఒక్కరి జీవితల్లో గతం ఉంటుంది… ఆ గతాన్ని జీవితం పంచుకునే వ్యక్తితో, జీవితం పంచుకునే ముందే తెలియజేయాలి అలాగే వేశ్య ఎంత బరువైన సున్నితమైన పేరు… ధనం కోసం దేహాన్ని దూదిలా మార్చి మనుగడ సాగించే మనిషి వేశ్య కాదు, నిజాన్ని నీటిపై రాతలా చెరిపేసి, అబద్ధంతో అందంగా అడుగులు వేసే వ్యక్తే అసలు అయిన వేశ్య, అది ఆడవారు అయినా, మగవారు అయినా సరే…

 

Your writer Signing off
Ram Kocherlla

 

 

# Author: Ram Kocherlla: Thank you so much for each and every one who read and Shared the Story without you this success will not possible to me.

InFrame: Your Writer   Ram Kocherlla

IMG_4431

                                                    ——————————————————————————

Shiva Kocherlla: Hero behind the website, he created the weekly posters, and he is the total website domain in-charge. Without him, this story unable to reach the readers since starting, Thank you so much to Shiva Kocherlla.

InFrame:  Shiva Kocherlla

Screenshot_20230913_095438_Instagram
4.8 8 votes
Article Rating
Subscribe
Notify of
guest

8 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sree
Sree
1 year ago

Adhiripoyindhi ga!! Very well written Ram. Eppatilane Mee vocabulary and story tho adbhuthanni srustincharu. 💫

Last edited 1 year ago by Sree
Vaishnavi
Vaishnavi
1 year ago

Hello Ram garu,
Story ending excellent ga undi🙌🏻👏🏻
Miru rasey prathi line chala unique untadi 😊
Inko kotha story kosam wait chesthunta!!

The well wisher
The well wisher
1 year ago

This is an amazing masterpiece I came across, very clever usage of grammar and words…you are actually the king of words. Keep up the good work, hoping to see more beautiful stories…

Siva Ramya
Siva Ramya
1 year ago

Chala bagundi story ram garu.pure love Ela untundo e story cheppali.great sir