రామ కృష్ణ: నీకు ఎలా తెలుసు, సింధు?
సింధు: కోపం తెచ్చుకోకు, నేను చెప్పింది విను, ప్రశాంతంగా.
రామ కృష్ణ: ఏమి చెప్తావ్… తీరలేని కలలు ఇచ్చిన జ్ఞాపకాలతో నేను సంతోషంగా ఉండటం నేర్చుకున్నాను, ఇప్పుడు నువ్వు మళ్ళీ అందాన్నిఆకాశంలో ఆశలు రేపడానికి ప్రయత్నిస్తున్నావా ?, నాకు ప్రశాంతంత లేకుండా చేస్తున్నావా?
సింధు: అది కాదు రా… నా మాట విను ఒకసారి.
రామ కృష్ణ: వినడానికి, ఇంక ఏమి లేదు, Pack your bags, మనం ఇండియాకు తిరిగి వెళ్ళుతున్నాము.
అని నేను అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయాను, వాళ్ళ ముగ్గురి సంభాషణ ఇల సాగుతుంది.
రవి: ప్యారిస్‌కు షాపింగ్ కి వచ్చి నట్లు లేదు, షాక్ తినడానికి వచినట్లు ఉంది, రాధ లాంటి అమ్మాయిని చూసాక ఒక షాక్, వాడు 47 కోట్లను ఖర్చు పెట్టడం ఇంకో షాక్, ఇప్పుడు నువ్వు వచ్చి రాధ లాంటి అమ్మాయి ఉందని నాకు ముందే తెలుసు అంటున్నావ్ ఇది ఇంకో షాక్. ఐనా నా మటుకు నేను, హాస్పిటల్‌లో ఉండి, కడుపుకి… కాళ్ళుకి కుట్లు వేసుకోకుండ నాకెందుకు వచ్చిన సంత చెప్పు. అయినా నీకు ఎవరు చెప్పారు రాధ లాంటి అమ్మాయి ప్యారిస్‌లో ఉందని..?
సింధు: తార చెపింది రా.
సుదీక్ష: యవడే ప్రపంచం చిన్నది అని చెప్పింది, ఫస్ట్ సీజన్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్ సెకండ్ సీజన్‌లో వస్తునారు గా..!
రవి: మన story short film తీస్తే, ప్రొడ్యూసర్ కి వాసిపోతది. పైగా మన రైటర్ రామ్ కోచర్ల, first chapter లోనే ప్యారిస్ ప్రయాణం పెట్టాడు, సర్లే కానీ, తార ప్యారిస్‌లో ఏమి చేస్తుంది.
సింధు: తార పెళ్ళి చేసుకున్నాక, ప్యారిస్‌లో సెటిల్ అయ్యింది. తను వాళ్ల Husband బయటకి వచ్చి నప్పుడు చూసింది అంట రుక్మిణి ని, so details కనుక్కుoటే, మన రామ కృష్ణ కంపెనీ లోనే పని చేస్తుందని తెలిసింది, ఎలా అయిన మనమే వాడికి ఆ అమ్మాయిని Set చెయ్యాలి రా.
రవి: ఎంత పిచ్చి ప్రేమో, Husband తో బయటకి వచ్చి, రామ కృష్ణ గురిచి ఆలోచించింది చూడు great రాధ అసలు.
సింధు: ఓవర్ ఆక్షన్ చేయకు, చంప పగులుద్ది.
సుదీక్ష: ఏంటి చెసేది పెళ్ళి, ఈ రోజులో ఒక అమ్మాయి కోసం చిన్న surprise చేస్తే, లవ్ చేసే అమ్మాయిలు ఉన్న రోజుల్లో, కోట్లు ఖర్చు పెట్టిన, మనవాడిని పట్టించుకోలేదు రుక్మిణి and మన హీరో గురించి తెలుసిందేగా, చూడడానికి రాధ లా ఉన్నందుకు, రుక్మిణి వంక చూస్తున్నాడు అంతే. ఈ ఇద్దరూ ముదురు డేకలే కాబట్టి కలపడటం కష్టమే lite తీసుకోండి.
సింధు: వాడికి ఒక తోడు కావాలి గ, మనం మన ఫ్యామిలీస్ తో చాలా హ్యాపీ గా ఉన్నాం, వాడు మాత్రం ఇంక ఎంత కాలం ఒంటరిగా ఉంటాడు.
సుదీక్ష: ఇంకా ఎంత కాలం సంతోషంగా ఉంటాడు, మూడు ముళ్లు వేయించేసి, వాడిని ముంచెధాం అంటావు. ఎవడే హ్యాపీ గా ఉన్నాడు, నా పెళ్లని చూడు, రోజు నాతో గొడవపడటం తప్ప ఇంకో పని ఉండదు. ఒకొక్కసారి అనిపిస్తుంది, రామ కృష్ణ లాగా నాకో లవ్ ఫెయిల్యూర్ ఉండి. సింగిల్‌గా ఉండిపోతే బాగుండును అని.
రవి: హాహాహా, లేకపోతే నువ్వు వేసే ఎదవ కుళ్ళు జోక్స్ కి ప్రేమగా ఉంటారు నీతో.
సింధు: మీరు ఇద్దరు ఆపుతారా ఇంకా. రుక్మిణి నన్ను వాళ్ల ఇంటికి invite చేసిందని, మనం వెళ్ళలి రేపు.
సుదీక్ష: మరి మన రామ కృష్ణ వస్తాడా?
సింధు: అది నేను చూసుకుంటాను లే రా.
రవి: నువ్వు రామ కృష్ణకి అంత క్లోజ్ గా ఉంటూ, అన్నీ నువ్వు చూసుకున్నావ్ అనుకో, నీకు కాబోయే వాడు ఇంకో దాన్ని చూసుకుంటాడు నీ ఇష్టం మరి.
సింధు: నోరు మూయి రా, పడుకో ఇంక రేపు వెళ్ళలిగ.
నేను రాను అంటున్నా కుడా సింధు నన్ను రుక్మిణి వాళ్ల ఇంటికి వెళ్లాలని ఒప్పించింది, ఎలాగో ఇండియా కి వెళ్ళిపోతున్నానా, ఒకసారి చూడాలి , నేను సరే అని చెప్పాను సింధుతో.
రాత్రి కోసం వేచి చూసే చుక్కల మాదిరిగా
వెలుగు కోసం ఎదురు చూసే చీకటి మాదిరిగా
ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాను
రుక్మిణి ఇంటికి వెళ్ళం, ఇల్లు చిన్నదైనా కానీ అందంగా ఉంది, గోడ మొత్తం వాళ్ల అమ్మా నాన్నతో గడిపిన ఫోటోలు ఉన్నాయి, తనకి వాళ్ల Father అంటే చాలా ఇష్టం అని అర్థం అయ్యింది, రుక్మిణి మమ్మల్ని చూసి, వెంటనే సింధుతో అంటుంది.
రుక్మిణి: నిన్ను ఒక దానిని ఇన్వైట్ చేసాను సింధు. వాళ్ళ ముగ్గురు ఎందుకు వచ్చారు..?
రవి: సింధు ఏమి చేస్తే, మేము కూడా అదే చేస్తాం.
రుక్మిణి: అయితే సింధుకి పెళ్లిఅయితే పిల్లలు కంటుంది, మీరు కూడా కంటారా?
సుదీక్ష: కనమ్… కనిపిస్తాం.
సింధు: అరే పనికి మలిన వెధవ (Stupid), ఎం మాటలాడుతున్నావ్ రా సుదీక్ష…?
సుదీక్ష: ఏధో Flow లో వచ్చిందే, అయినా రైటర్ చూసుకోవాలి డైలాగ్స్ అన్నీనన్ను అంటావేంటి?
అని ఒక్కరు ఒక్కరు సెటైర్ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు, ఇంతలో వాళ్ల మాటలు విని, రుక్మిణి అమ్మా, లక్ష్మి గారు రూమ్‌లో నుంచి, నన్ను చూసి “మీరు రామ కృష్ణ కదా” అని అడిగారు, మా మాటలు ఇలాగే సాగుతున్నాయి.
రామ కృష్ణ: అవును aunty, నేను మీకు ఎలా తెలుసు?
లక్ష్మి: మీ ఇంటర్వ్యూ నేను మ్యాగజైన్ లో చదివాను, కానీ నకు అర్ధం కానిది ఏమిటంటే, మీ కథలో ప్రేమ కథ ఎటు వంటిది…?
రామ కృష్ణ: ఎటు వంటి ప్రేమ కథ, అంటే మీ ఉద్దేశం?
లక్ష్మి: తండ్రి కొడుకుల మధ్య ప్రేమనా…? లేక లేక ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమనా…? అని.
రామ కృష్ణ: ఒక కుర్రాడికి ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేను కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే, తన తండ్రి తన కుటుంబం మీద చూపించే బాధ్యతను బట్టి, తండ్రి ఎంత ఎక్కువ బాధ్యత చూపిస్తే ఆ కుర్రాడికి అంత ఎక్కువ ప్రేమించడం తెలుస్తుంధి, ఇప్పుడు చెప్పండి, ఎటు వంటి ప్రేమ కథ అంటారు మరి?
లక్ష్మి: ప్రేమకి బాధ్యత పుడుతుంది కానీ, బాధ్యతకి ప్రేమ ఎప్పుడు పుట్టడు, ఒక వేళ పుడితే, కష్ట కాలంలో ఆ ప్రేమకి ఆయుష్షు తక్కువ. అలాంటిది మీరు ప్రేమ కి బధ్యతకు ముడి వేసారు, ఇంకా ఏం చేయగలను.
ఆ ఇంటర్వ్యూ సంగతి అలా వదిలేయండి aunty, మీరు వెజ్ బాగా వాడుతారు అంట?, రుక్మిణి చెప్పింది, మా కోసం ఏమి వందుతున్నారు అని అంటున్నాను నేను. రుక్మిణి కి మా మాటలు ఏమి అర్ధం కాలేదు. ఇంటికి వచ్చిన Guests ని తిట్టకూడదు అనేది ఒక రీజన్ వల, రుక్మిణి formal గా ఉంది, కానీ సింధు తో బాగా మాట్లాడుతుంది, Food చాలా బాగా వండారు రుక్మిణి వాళ్ల అమ్మ గారు, బంగాళాదుంప ఫ్రై, వంకాయ కర్రీ ఇంకా సాంబార్ చాలా బాగా చేసారు.
అందరం కలసి చాలా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేసాం, రుక్మిణి అందరితో కలిసిపోయింది కానీ నాతో మాత్రం అసలు మాట్లాడలేదు, కోపానికి కాటిక పూస్తె ఎలా ఉంటుందో అలా ఉన్నాయి రుక్మిణి కన్నులు, తను చూస్తున్నప్పుడు అర్ధం అయ్యింది రాధకి ఎంత ఓపికో అని. ఇంకా మేమూ స్టార్ట్ అవుతుందపుడు, సింధు తన బ్యాగ్ లో నుంచి ఆ లాకెట్ తీసి రుక్మిణికి ప్రెజెంట్ చేసింది, వాళ అమ్మ గారి ముందు, రుక్మిణి ఇంకా చేసేది ఏమి లేక ఆ లాకెట్ తీసుకొని నా వంక చూస్తు “నువ్వు అనుకున్నది సాధించావు గా”, అన్నట్లు చాలా కోపం గా చూస్తుంది, ఇంకా మేము వెలుతున్న టైమ్ లో, రుక్మిణి వాళ్లఅమ్మ గారు నాతో “రామ కృష్ణ నాకు రాధా ఎలా ఉంటుందో చూడాలి అని ఉంది, తన ఫోటో నాకు చూపిస్తావా” అని అడిగారు. నిజానికీ రాధ ఫోటో నేను ఎవరికి చూపించను, నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు చూపించాలి అని ఉన్నా, చూపించలేని పరిస్థితి, నేను రుక్మిణి వాల అమ్మ గారితో, “ఇపుడు నా దగ్గర రాధా ఫోటో ఏమి లేదు ఆంటీ, ఇంటి దగ్గర laptop లో చాలా ఫోటోలు ఉన్నాయి నెను సెండ్ చేస్తాలే ఆంటీ”” అని చెప్పి బయటకి వద్ధాo అనుకుంటుంటే, సింధు మాత్రం నా దగ్గర ఉంది అంటూ చెప్పి రాధ ఫోటో చూపించింది, రుక్మిణి వాళ అమ్మ గారికి, నేను ఊహించినట్టే Aunty Shock అయ్యరు, ఆంటీ చేతిలో నుంచీ రుక్మిణి ఫోన్ తీసుకొని చూసింది, తాను ఆ ఫోటో చూసి నిలిచిపోయింది, వాళ్ళ అమ్మగారు మాత్రమే, “ఏంటి రామ కృష్ణ అచ్చం నా కూతురిలా ఉంది నీ రాధా”” అని అంటు న్నారు, నేను చిన్నగా నవ్వి మేము ఇంటి బయటికి వచ్చేసాం. మాతో పాటు రుక్మిణి కూడా బయటకి వచ్చి నా వంక చూస్తూ ““మీరు ఖర్చు పెట్టిన డబ్బు మీ కంటి ముందు ఉన్న దేహం కోసమా, మీ కనుల వెనక వెంటాడుతున్న రూపం కోసమా…?” అని అడిగింది. ““ఓడిపోయిన నా ప్రేమకి కారణం అయిన డబ్బు, నువ్వు మనసుపడ లాకెట్ కి గెలవడం కోసం”” అని చెప్పాను నేను, కానీ తను నా ఇష్టంలో అనుమానం ఒక్కటే వెతుకుతుందీ. to be continued
Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.
** Click here for Next chapter **
Thank you so much for reading, please comment below your reading experience and share with your friends and Family.
Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta