HOME

#1

Click Here to Flip
ఓయ్ కొంటె పిల్ల !

కళ్ళతో నవ్వుతావు… పెదవులతో సైగ చేస్తావు… కనుబొమ్మలతో పలకరిస్తావు… చూపులతో చుట్టుముట్టుతావు…

మొత్తానికి ని ముఖ చంద్రభింబం చేసే మాయజాలంలో నా మనస్సుకి గేలం వేస్తూ, వదిలేస్తూ నవ్వుతావు, నాకు అర్ధం కావు


రామ్ కొచెర్ల #1

#2

Click Here to Flip
ఒంటరి తనం భరించలేని ఓ వరం,

వద్దు అనుకోకు, వద్దకు వస్తే విడిచిపెటకు, ఎందుకు అంటే, నీతో నువ్వు, నీకై నువ్వు, నీలో నువ్వు, గడిపే సమయం సొంతమవుతుంది.

ప్రాణం కి ఇంకో ప్రాణం తోడు కన్నా, ప్రశాంతత ఎంతో విలువైనది, అందుకే ఒంటరి తనాన్ని వెలకట్టలేక వద్దు అనుకుంటారు.

రామ్ కొచెర్ల #2

#3

Click Here to Flip
బలం ఎప్పుడు ముందు అడుగులో అనిగి ఉంటుంది అనుకోకూడదు

వెనకడుగు వేసి ముందుకు వచ్చే బలానికి వేగం ఎక్కువ… విజృంభించిందా దానికి విశ్రాంతి తక్కువ.

రామ్ కొచెర్ల #3

#4

Click Here to Flip
ఓడిపోతున్న వాడికి గెలుపు ముందు ఉంది అని చెప్తు...

గెలుస్తున్న వాడికి ఓటమిని దాటి వచ్చిన క్షణాలను గుర్తు చేస్తూ...

రేపు అన్న రోజు మనది కాదు అని తెలిసినకూడా, సంవత్సరం అంతా సంతోషంగా సాగాలి అని కోరుకుంటూ...

కష్టపడుతూ, ఆశని ఆహారంగ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రామ్ కొచెర్ల #4