HOME

3 వ అధ్యాయము


ప్రకటన

తెలివైన వాడివి అని తెలుసు కానీ, తెలివైన ముర్కుడివి అని ఇప్పుడే తెలిసింది నాకు అంటూ, నన్ను చెంప మీద  చెల్లున కొట్టారు నాన్న గారు. మనసుకి నచ్చని విషయం, మనిషి కంటికి కనిపించినప్పుడు ఆలోచించడానికి కావలసిన, వెలకట్టలేని అనుభవం మరియు విలువైన నమ్మకం సూన్యం అని అనిపించింది నాకు, ఎందుకు అంటే, నా నడవడిక గురించి నాన్న గారికి అంతా తెలిసిన, కేవలం నేను అమృత సులోచనతో మాట్లాడడం చూడడం వలన ఆయన, నా మీద నమ్మకం ఇంకా ఆయనికి ఉన్న ఆలోచించే  అనుభవం కోల్పోయారు నాన్న గారు. బాధతో కోపంలో ఉన్న వ్యక్తికి  విషయాన్ని వివరించడం వ్యర్థం అనుకోని, నేను మౌనం బాటలో నాన్న గారి తోడుగా ఇంటికి వెళ్లిపోయాను, అదే రోజు Delhi వరకు వెళ్లే రైలు బండి ఎక్కడానికి సిద్ధం అయ్యాం, Delhi నుంచి Paris కి విమానంలో ప్రయాణం, Delhi చేరుకోగానే నా స్నేహితుడు  చెలపతికి ఫోన్  చేశాను, అమృత సులోచన ఎలా ఉంది అని తెలుసుకోడానికి, చెలపతి  సమాధానం చెపుతున్నాడు ఇలా, “సోదరా  మీ చిన్నాన్న  ఇంకా ఊరిలో ఉన్న కొంత మంది పెద్ద మనుషులు కలసి అమృత సులోచన వాళ్ళని ఊరినుంచి  వెలివేశారు, నీకు ఇంకో విష్యం చెప్పడం మరిచిపోయాను అమృత సులోచనని చూడడం ఇదే మొదటి సరి అంట మన ఊరివాళ్ళు కూడా, నాకు కూడా తాను కోతే, నువ్వు డాక్యుమెంటరీ కోసం అడిగావు అని నేను ఆ ఇంటిని కనుక్కున్నాను సోదరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారో కూడా తెలియటం లేదు సోదరా అని చెప్పాడు.

చిన్నాన్న, నమ్మిన అబద్ధాన్ని, నిజంలా నాన్న గారికి చేర్చినప్పుడు, అది నిజం కాదు అని నిరూపించడానికి నాకు సాక్ష్యాలు కావాలి, అమృత సులోచన జాడ తెలియనప్పుడు నాకు ఒకటే అనిపించింది. అబద్ధానికి,  నిజం నీడ  కూడా అవసరం లేదు, కానీ నిజాన్ని నిరూపించడానికి నమ్మే సాక్ష్యాలుతో పటు నమ్మే  మనిషి  కూడా ఉండాలి. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడం కాన, క్షమించండి అని చెప్పడమే మంచింది నాన్న గారికి అని అనిపించింది. మొత్తానికి Paris వచ్చేసాము, నా డాక్యుమెంటరీని కూడా మధ్యలోనే ఆపేసాను. రోజులు గడిచిపోతున్నాయి, అమృత సులోచన రోజు గుర్తు రాకపోయినా కానీ తనని మాత్రం పూర్తిగా మరిచిపోలేదు, నాన్న గారు నాతో మాట్లాడం మొదలు పెట్టారు, నాకు చాల సంతోషంగా ఉంది నా  డిగ్రీ చేతపుచ్చుకొని, నాన్న గారి వ్యాపారంలో దిగాను, నెలలు గడిచిపోతున్నాయి, నేను మధ్యలో ఆపేసిన డాక్యుమెంటరీ, విజేతని తెలిపే రోజు రానే వచ్చింది, నాకు వేలాలి అని ఉంది ఆ కార్యక్రమానికి కానీ, గతం గుర్తుకు వచ్చి ముందడుగు  వేయలేదు, ఒకడినే నా గదిలో కవిత రాసుకుంటున్న…

గడిచిన కాలం గొప్పగా  లేకున్నా,

గడవ బోతున్న కాలం గమ్యం తెలియకున్నా,

గడుపుతున్న కాలం, గడిచిపోయిన జ్ఞ్యాపకాల గాయాలతో కాలు కదులుతున్నా,

తీరం మాత్రం మనశ్శాoతి వైపే ఉండాలి అంటుంది ప్రాణం.

అని రాసుకుంటూ ఉండగా, ఏరా అభి రామ్ ఏం చేస్తున్నావ్ అని అడుగుతూ నాన్న గారు వచ్చారు నా గదిలోకి, నేను ఏమి లేదు నాన్న గారు అంటూ చెపుతూ ఉండగా, నడు ఆలా బయటకి వెళదాం అంటూ, నన్ను తీసుకొని వెళ్లరు. ఎక్కడికి వెళుతున్నాం అనుకుంటూ వెళ్ళాను, తీరా చూస్తే యూనివర్సిటీకి  తీసుకొచ్చారు, డాక్యుమెంటరీ submission హాల్లో విజేతని  తెలిపే కార్యక్రమం జరుగుతున్నది, మేము అక్కడకి వెళ్ళాం, నాకు చాల ఆనందంగా ఉంది, ఈలోపు అమ్మ కూడా వచ్చింది, నేను నా డాక్యుమెంటరీ అందించలేకపోయిన, ఈ కార్యక్రమం చూస్తుంటే నా మనసుకి ఏదో తెలియని ఆనందం. ప్రథమంగా  6 డాక్యూమెంటరీలు నోమోదు అయ్యాయి, మేము అలసయంగా వెళ్లడంతో ముందే చెప్పేసారు వాటి పేర్లు. సరే విజేత ఎవరు అని చూస్తున్న నేను ఆరాటంగా, అంతలో  France మహిళ వచ్చి ఒక ఎన్వలప్ ఓపెన్ చేసి, ఎంతో సంతోషంగా చెపింది ఇలా, The best documentary award of 1970 goes to Ms. Amrutha Sulochana for VESYA అంటూ ప్రకటించింది….

To be continued on 18th Aug 2023

                                                                

Writer – Ram Kocherlla
S/o Mani kumar Kocherlla.

Thank you so much for reading, please comment below of your reading experience and share with your friends and Family.

Please click on below icon to follow us on Instagram, support our Instagram handle the way you supported my story. Meet you all at my Insta

4.8 6 votes
Article Rating
Subscribe
Notify of
guest

8 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Rambabu
Rambabu
1 year ago

Excellent Sairam. Maintaining the curiosity. Keep it up.

Vaishnavi
Vaishnavi
1 year ago

Chapter ending lo ichina twist chala bagundi🙌🏻 Mee story caduvutunnapudu theatre lo kurchoni cinema chusthu unatu untadi antha Baga rastunaru Ram garu😍
Next chapter kosam eduru chusthu unta.

Pawan Sekhar J
Pawan Sekhar J
1 year ago

Wow.

Kiran
Kiran
1 year ago

Nice ending episode